చాలామందికి ఉదయం లేవగానే ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మీక్కూడా ఈ అలవాటు ఉందా?
బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్, బి-విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఏకాగ్రతను పెంచడమే కాకుండా, లివర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
కాఫీని మితంగా తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
కాఫీలోని కెఫిన్.. శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే, డోపమైన్ స్థాయిలను పెంచి, మూడ్ను మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
బ్లాక్ కాఫీ జీవక్రియ రేటును పెంచుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.
అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల సంబంధిత వ్యాధులతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే శక్తి కూడా కాఫీకి ఉంది.
రోజుకు 3 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితం. అంతకు మించి తాగితే నిద్రలేమి, అసిడిటీ, గుండె దడ వంటి సమస్యలు రావచ్చు.
పరగడుపున బ్లాక్ కాఫీ తాగడం వల్ల కొందరిలో అసిడిటీ సమస్యలు తలెత్తవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
Spinach: రోజూ పాలకూర తింటే ఏమవుతుంది?
Papaya: బొప్పాయిని రెగ్యులర్ గా తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Amla Benefits: రోజూ ఉసిరికాయలు తింటే ఏమవుతుంది?
World Kidney Day 2026: కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టేలంటే ఈ 7 టిప్స్ చాలు