MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Health
  • Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?

Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?

Vitamin D Deficiency: భారత్‌లో విటమిన్ డి లోపం కేసులు బాగా పెరుగుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో భాగంగా ఎక్కువసేపు ఇళ్లకే పరిమితం కావడం, సన్‌స్క్రీన్ వాడకం పెరగడం, వాయు కాలుష్యం, శరీరాన్ని పూర్తిగా కప్పేలా దుస్తులు ధరించడం వంటివి దీనికి ప్రధాన కారణాలు.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 17 2026, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విటమిన్ డి లోపం: శరీరం చూపించే ఏడు లక్షణాలు
Image Credit : Getty

విటమిన్ డి లోపం: శరీరం చూపించే ఏడు లక్షణాలు

ఇప్పుడున్న కాలంలో విటమిన్ D లోపం సర్వసాధారణంగా మారింది. ఆధునిక జీవనశైలి, సన్‌స్క్రీన్ల వాడకం, వాయు కాలుష్యం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం వంటివి ఈ లోపానికి ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి.  అందుకే డాక్టర్లు ఏం చెప్తారంటే విటమిన్ డి దొరికే గుడ్లు, పాలు, చేపలు, పుట్టగొడుగులు, గింజలు, తృణధాన్యాలు తినాలంటారు. అంతేకాదు రోజు ఉదయం వచ్చే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి, ఆహారం కంటే సూర్యకిరణాల నుంచి విటమిన్ D పుష్కలంగా దొరుకుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది
Image Credit : Getty

ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

శరీరం కాల్షియం గ్రహించడానికి, ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి విటమిన్ D చాలా అవసరం. ఇది ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Related Articles

Related image1
Vitamin D: విటమిన్ డి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమౌతుంది?
Related image2
Vitamin D Deficiency ఓరినాయనో.. విటమిన్ డి లోపంతో ఇన్ని సమస్యలా?
36
సూర్యరశ్మి నుంచే విటమిన్ డి లభిస్తుంది
Image Credit : Getty

సూర్యరశ్మి నుంచే విటమిన్ డి లభిస్తుంది

మన శరీరానికి విటమిన్ D ప్రధానంగా సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. మన చర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు, శరీరం విటమిన్ Dని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు సన్ స్క్రీన్ రాసుకుంటే విటమిన్ డి తయారు కాదు. మధ్యాహ్నం ఎండలో ఉండకండి. మార్నింగ్ లేలేత సూర్యకిరణాలు చాలా మంచిది. అందుకే పాతకాలంలో పొలం పనులు చేసేవాళ్లు ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్లే వాళ్ల ఎముకలు స్ట్రాంగ్‍గా ఉండి ఇప్పటికీ యాక్టివ్‍గా ఉంటారు.

46
విటమిన్ డి లోపం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది
Image Credit : Getty

విటమిన్ డి లోపం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది

విటమిన్ D లోపం నేరుగా ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది తగినంత లేకపోతే, మనం తీసుకునే ఆహారం నుంచి శరీరం కాల్షియంను గ్రహించడానికి చాలా కష్టమవుతుంది. ఎముకలకు అత్యవసరమైన కాల్షియంను శరీరం గ్రహించేలా విటమిన్ D చేస్తుంది. అంతేకాదు, రోగనిరోధక వ్యవస్థ, కండరాలు, మెదడు కణాల పనితీరుకు కూడా ఇది తోడ్పడుతుంది.

56
స్థిరమైన శక్తి లేకపోవడం, అధిక అలసట విటమిన్ డి లోపానికి ప్రధాన లక్షణాలు
Image Credit : Getty

స్థిరమైన శక్తి లేకపోవడం, అధిక అలసట విటమిన్ డి లోపానికి ప్రధాన లక్షణాలు

ఎప్పుడూ శక్తి లేనట్లు అనిపించడం, తీవ్రమైన అలసట విటమిన్ డి లోపానికి ప్రధాన లక్షణాలు. కణాలలో శక్తి జీవక్రియలను, వాపును నియంత్రించడంలో విటమిన్ డి పాత్ర ఉండటమే దీనికి కారణం. శరీరంలో ఆకస్మిక మార్పులకు కూడా విటమిన్ డి లోపమే. విచారం, డిప్రెషన్, ఆందోళన వంటి వాటికి దారితీస్తుంది.

66
కీళ్లు, వెన్నునొప్పికి దారితీస్తుంది
Image Credit : Getty

కీళ్లు, వెన్నునొప్పికి దారితీస్తుంది

కండరాల కణాల పనితీరులో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల కండరాల బలహీనత, నొప్పి, తిమ్మిర్లు, నడవలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, కండరాల నొప్పులు వంటివి కూడా వస్తాయి. ఇవి శరీరం అంతటా వ్యాపించే అవకాశం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related Stories
Recommended image1
Vitamin D: విటమిన్ డి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Vitamin D Deficiency ఓరినాయనో.. విటమిన్ డి లోపంతో ఇన్ని సమస్యలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved