Health Tips: రోజుకో గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా ?
health-life Jun 14 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
గొప్ప ప్రోటీన్ వనరు
గుడ్డులో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే గుడ్డును సమతుల ఆహారం అంటారు. ఇది జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
Image credits: Getty
Telugu
మెదడు చురుగ్గా
మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేసే ఎసిటైల్ కొలిన్ చాలా కీలకం. అది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది.
Image credits: Freepik
Telugu
మెరుగైన కంటి చూపు
గుడ్లు తినడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లలో లుటీన్, జియాక్సంతిన్, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి, ఇవి రెటీనా, మాక్యులా ఆరోగ్యానికి సహాయపడతాయి.
Image credits: Freepik
Telugu
రోగనిరోధక శక్తిని
గుడ్డులో విటమిన్ D, B12, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా విటమిన్ B12, సెలీనియం రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరుస్తాయి.
Image credits: Freepik
Telugu
చర్మ, జుట్టుకు ప్రయోజనం
గుడ్లలో బయోటిన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు , చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
Image credits: Freepik
Telugu
బరువు తగ్గడానికి
గుడ్డు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, ముఖ్యంగా పచ్చసొనలో మంచి కొలస్ట్రాల్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలస్ట్రాల్స్ను తగ్గించి, మంచి కొలస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది
Image credits: Freepik
Telugu
ఎముకల బలోపేతం
గుడ్డులోని విటమిన్ డి, ఫాస్ఫరస్ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. విటమిన్ డి ఎముకలకు కాల్షియం, ఫాస్ఫరస్ గ్రహించడానికి సహాయపడుతుంది.