Health Tips: రోజుకి రెండు మామిడి పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి.. చిన్నా, పెద్ద వీటిని లొట్టలేసుకుంటూ తింటారు. అయితే రోజుకు ఎన్ని మామడిపండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
గుండె ఆరోగ్యానికి..
నిపుణుల ప్రకారం.. మామిడి పండ్లలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీంతో గుండెపోటు, అథెరోస్క్లెరోసిస్ ముప్పు తగ్గుతుంది. కరగని ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు:
మామిడి పండ్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్, క్వెర్సెటిన్, అస్ట్రాగలిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడి, వాపు తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బీపి తగ్గడానికి..
మామిడి పండ్లలోని పొటాషియం, మెగ్నీషియం బీపీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పొటాషియం రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మామిడిలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి బీపీని తగ్గిస్తాయి.
కొలెస్ట్రాల్:
మామిడి పండ్లలోని పెక్టిన్ అనే కరిగే ఫైబర్.. ఆహారంలోని కొవ్వు శోషణను నిరోధిస్తుంది. ఇది పైత్యామ్లాలతో కలిసి కొవ్వును బయటకు పంపుతుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
రోజుకి రెండు మామిడి పండ్లు:
రోజుకి రెండు మామిడి పండ్లు తినడం గుండె ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ మామిడి పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. షుగర్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు మామిడి పండ్లను మితంగా తినాలి. ఆరోగ్యవంతులు రోజుకి ఒకటి లేదా రెండు మీడియం సైజు మామిడి పండ్లు తినచ్చు. మామిడి పండ్లను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవాలి.