ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒకటి. వీటిని రోజూ తినడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నిపుణుల ప్రకారం ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన అంజీర్ నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం.

అంజీర్ ని అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు.. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేదంలో కూడా అంజీర్ కు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రతిరోజు అంజీర్ పండ్లను నానబెట్టి ఆ నీటిని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మెరుగైన జీర్ణక్రియ

నిపుణుల ప్రకారం ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన అంజీర్ నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది పేగుల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. 

షుగర్ లెవెల్స్ 

అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇవి సహజంగా లభించే చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ పేషెంట్లు కూడా మితంగా వీటిని తీసుకోవచ్చు.

అధిక బరువు

 బరువు తగ్గాలనుకునేవారు నానబెట్టిన అంజీర్ నీళ్లను తాగడం మంచిది. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. ఇది మీకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గడం సులభం అవుతుంది.

రోగ నిరోధక శక్తి 

అంజీర్ పండ్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కొనే ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేసి.. నొప్పిని తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే పొటాషియం, ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

బీపి నియంత్రణలో..

అంజీర్‌లో లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. రక్త పోటును నియంత్రిస్తాయి. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ వాటర్ తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

చర్మ ఆరోగ్యానికి..

నిపుణుల ప్రకారం ప్రతి రోజూ నానబెట్టిన అంజీర్ వాటర్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వాటర్ ను చర్మంపై రాసుకుంటే మృత కణాలు తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా మారుతుంది.