ABC Juice: చలికాలంలో ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
ABC Juice అంటే అందరికీ తెలిసే ఉంటుంది. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ మూడు కలిపి తయారు చేస్తారు. తమను తాము ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకునేవారు చాలా మంది రెగ్యులర్ గా ఈ జ్యూస్ తాగుతూ ఉంటారు.

Winter Drink
చలికాలంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, స్కిన్ డ్యామేజ్ అవ్వడం, జలుబు, దగ్గు , జ్వరం లాంటివి రావడం ఇలా చాలానే ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ కేవలం ఒకే ఒక్క జ్యూస్ తో చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? మరి, ఆ జ్యూస్ ఏంటి? దానిని ఎలా తాగాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
చలికాలంలో ABC Juice ఎందుకు తాగాలి..?
ABC Juice అంటే అందరికీ తెలిసే ఉంటుంది. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ మూడు కలిపి తయారు చేస్తారు. తమను తాము ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకునేవారు చాలా మంది రెగ్యులర్ గా ఈ జ్యూస్ తాగుతూ ఉంటారు. ఈ డ్రింక్ లో జింక్, పొటాషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, విటమిన్లు ఏ, బి6, సి వంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. చలికాలంలోనే ఎందుకు తాగలి అంటే... ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఇది తాగితే ఆ సమస్య ఉండదు.
ABC జ్యూస్ తయారు చేసే విధానం...
నార్మల్ గా ఏబీసీ జ్యూస్ ని కేవలం యాపిల్, బీట్రూట్, క్యారెట్ తో మాత్రమే చేస్తారు. దీనిలోనే కొద్దిగా అల్లం, ఉసిరికాయ, నిమ్మకాయ, కొత్తిమీర లాంటివి కూడా చేర్చి తాగితే.... మీ హెయిర్ ఫాల్ కేవలం వారం రోజుల్లోనే ఆగిపోతుంది. అంతేకాకుండా, స్కిన్ లో గ్లో వస్తుంది. ఇక.. చాలా మంది పచ్చి బీట్రూట్, క్యారెట్ వాడతారు. దీని వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి, ఉడికించిన బీట్రూట్, క్యారెట్ వాడాలి. అప్పుడు అరుగుదల సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీని కోసం మీరు... ఉడికించిన బీట్రూట్, యాపిల్, క్యారెట్, ఉసిరి, కొత్తిమీర, కరివేపాకు చిన్న ముక్కలుగా కోసి బ్లెండర్ లో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీనిని వడకట్టి.. తాగొచ్చు. లేదంటే వడకట్టకుండా ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ లా స్టోర్ చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ ని ప్రతిరోజూ ఒక గ్లాసు హాట్ వాటర్ లో వేసుకొని తాగొచ్చు. వరసగా నెల రోజులు తాగితే... ముఖంలో గ్లో క్లియర్ గా కనపడుతుంది.
ఉడికించిన బీట్‌రూట్ , క్యారెట్లు ఎందుకు?
ఈ జ్యూస్ రెసిపీలో, కూరగాయలను పచ్చిగా ఉపయోగించకుండా ఉడికించిన బీట్‌రూట్ , క్యారెట్‌లను మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. దీనికి కారణం ప్రధానంగా జీర్ణ ఆరోగ్యానికి సంబంధించినది.
జీర్ణక్రియను సులభతరం చేస్తుంది: ఉడికించిన కూరగాయలు జీర్ణం కావడం సులభం. పేగు ఆరోగ్యం సరిగా లేని చాలా మందికి, ముఖ్యంగా తక్కువ రక్తపోటు, అలసట, అధిక జుట్టు రాలడం, చర్మ సమస్యలు , తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి, పచ్చి కూరగాయల రసాలు కొన్నిసార్లు జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల, ఉడికించిన కూరగాయలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. వాటి పోషకాలు కూడా సరిగా అందుతాయి. 15 రోజులు ఈ జ్యూస్ తాగినా మీ హెయిర్ ఫాల్ ఆగిపోవడం క్లియర్ గా గమనించగలరు.
గమనిక...
కీళ్ళనొప్పులు ఉన్నవారు: కీళ్ళనొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు ఈ రసంలో ఉసిరికాయ, నిమ్మకాయను జోడించకపోవడమే మంచిది. దీనివల్ల వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చు.

