Carrot: రోజూ క్యారెట్ తింటే చర్మం రంగు మారుతుందా?
Carrot: క్యారెట్ ప్రతిరోజూ తినేవారిలో చర్మం రంగు మారుతుందనే నమ్మకం ఉంది. క్యారెట్ కు చర్మాన్ని మెరిపించే శక్తి క్యారెట్ కు ఉంటుంది. అయితే నెలరోజుల పాటూ క్యారెట్ తిని చూడండి ఏం జరుగుతుందో.

క్యారెట్ లో నిండుగా పోషకాలు
క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వైద్యులు కూడా క్యారెట్ ను తినమని చెబుతూ ఉంటారు. మన రోజువారీ ఆహారంలో క్యారెట్‌కి ప్రాధాన్యం ఇస్తే మంచిది. క్యారెట్ తినడం వల్ల చర్మం రంగు మారుతుందనే భావన ఎంతో మందిలో ఉంది. అందుకే చర్మం రంగు తెలుపుగా అవుతుందనే ఆశతో ఎంతో క్యారెట్ అధికంగా తినేస్తూ ఉంటారు. వైద్యులు చెప్పిన ప్రకారం రోజుకు ఒకటి లేదా రెండు క్యారెట్లు తింటే చర్మం రంగు మారదు. కానీ చర్మానికి తాజా మెరుపు వస్తుంది. క్యారెట్‌లో ఉన్న బీటా క్యారొటిన్ అనే పదార్థం మన చర్మానికి చాలా మంచిది. క్యారెట్ తినడం వల్ల ఇది విటమిన్ Aగా మారి కళ్లకు రక్షణ కల్పిస్తుంది.శరీరానికి శక్తి కూడా ఇస్తుంది.
క్యారెట్ అతిగా తింటే..
ఆరోగ్య నిపుణుల ప్రకారం క్యారెట్ మరీ అధికంగా తింటే చర్మం రంగు మారే అవకాశం ఉంది. రోజూ నాలుగైదు క్యారెట్లు లేదా అంతకంటే ఎక్కువగా తినేవారిలో బీటా-క్యారొటిన్ ఎక్కువగా శరీరంలో చేరుతుంది. ఈ పదార్థం ఎక్కువైనప్పుడు చర్మంపై కొద్దిగా పసుపు, నారింజ రంగు మచ్చలు కనిపిస్తాయి. దీనికే క్యారొటీనీమియా అని అంటారు. ఈ రంగు మార్పు సాధారణంగా చేతి వేళ్ల చివరల్లో, పాదాల అడుగులో, ముక్కు చుట్టూ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది శరీరానికి ఏమీ హాని చేయదు. దీని వల్ల ఎలాంటి నొప్పి, అసౌకర్యం కూడా ఉండదు. పైగా ఇది జాండిస్ కూడా కాదు. అందువల్ల ఈ రంగు మార్పు ప్రమాదకరం అని అనుకోవాల్సిన పని లేదు.
రంగు మారినా.. పోతుంది
క్యారెట్ అధికంగా తినడం వల్ల రంగు మారే పరిస్థితి వచ్చినా అది తాత్కాలికం మాత్రమే. వైద్యుల ప్రకారం ఈ సమస్యకు ఎలాంటి మందులు అవసరం లేదు. క్యారెట్‌ను కొన్ని రోజులు తినడం మానేస్తే శరీరంలో ఎక్కువగా చేరిన బీటా క్యారొటిన్ తగ్గిపోతుంది. రెండు మూడు వారాల్లో చర్మం మళ్లీ సహజ రంగులోకి వస్తుంది. కాబట్టి క్యారెట్ వల్ల రంగు మారిపోతుంది, అందుకే దాన్ని తినకూడదు అనుకోవాల్సిన అవసరం లేదు. క్యారెట్‌ను మితంగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కూడా మెరుగ్గా ఉంటుంది.
రోజుకు ఎన్ని తినాలి?
రోజుకి ఒకటి లేదా రెండు క్యారెట్లు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా క్యారెట్‌ను కూరగాయగా, సలాడ్‌గా, జ్యూస్‌గా ఎలా తిన్నా మంచిదే. కానీ ఏ ఆహారమైనా హద్దు దాటకూడదు. ఏదైనా ఎక్కువగాతింటే శరీరంపై చిన్న చిన్న మార్పులు వచ్చే అవకాశం సహజం. అదే క్యారెట్ విషయంలో కూడా జరుగుతుంది. కానీ అవి ప్రమాదకరం కావు. కాబట్టి ప్రజలు భయపడి క్యారెట్ తినటం ఆపాల్సిన అవసరం లేదు.
రోజుకో క్యారెట్ మంచిదే
రోజుకి ఒక క్యారెట్ తినడం ఎంతో ఆరోగ్యకరం అని వైద్యులు చెబుతున్నాు. క్యారెట్ ఆరోగ్యకరమైన కూరగాయ. దాని వల్ల జరిగే హాని ఏమీ ఉండదు. వీటిని ఎక్కువగా తిన్నప్పుడు మాత్రమే చిన్న రంగు మార్పులు కనిపించొచ్చు. అవి కూడా కొన్ని రోజులకే మాయం అవుతాయి. కాబట్టి క్యారెట్ గురించి అపోహలను పక్కన పెట్టి, మితంగా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది.

