Women Safety Apps : అమ్మాయిలూ.. మీ ఫోన్లో ఈ యాప్స్ లేకుంటే అరిచి గోలచేసినా లాభం ఉండదు
Women Safety Apps : కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలు, వర్కింగ్ ఉమెన్స్ మొబైల్ లో తప్పకుండా కొన్ని సేప్టీ యాప్స్ ఉండాల్సిందే. ఇవి వారికి రక్షణ కల్పించి ధైర్యంగా ముందుగా సాగేందుకు సహాయపడతాయి.

ప్రతి ఆడబిడ్డ ఫోన్లో ఉండాల్సిన యాప్స్ ఇవే...
Women Safety Apps : ఈ కలికాలంలో మహిళ పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది... స్వేచ్చ పెరిగిందని సంతోషించాలో... తమపై అఘాయిత్యాలు పెరిగాయని బాధపడాలో అర్థంకావడం లేదు. ఇంటినుండి బయటకు వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్లేవరకు అమ్మాయిలకే కాదు వారి కుటుంబసభ్యులకు భయమే... రోడ్లు, రైలు, బస్సు, స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఎక్కడా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. అమ్మాయి కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాలుగా మారిపోతున్నారు... ఈ ఆటవిక సమాజంలో వారిని వేటాడేందుకు సిద్దమవుతున్నారు.
ఇటీవలి కాలంలో చిన్నారులు, కాలేజీ అమ్మాయిలు, వర్కింగ్ ఉమెన్స్ పై జరుగుతున్న అఘాయిత్యాల గురించి వింటున్నాం. అందుకే మన ఇంటి ఆడబిడ్డల రక్షణ మన బాధ్యత... వారికి ముందుజాగ్రత్త చర్యలు సూచించడమే శ్రీరామర రక్ష. ప్రతి అమ్మాయి, మహిళ స్మార్ట్ ఫోన్ లో కొన్ని సేప్టి యాప్స్ తప్పకుండా ఉండాలి... అవి ఆపత్కాలంలో వారికి ఎంతగానో ఉపయోగపడతాయి... మానప్రాణాలను కాపాడతాయి. ఇలాంటి ఉమెన్ సెప్టీ యాప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. బీ సేఫ్ (bsafe - Never Walk Alone)
ఈ యాప్ మహిళల రక్షణ కోసం రూపొందించబడింది. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారి ఫోన్లోని ఈ బి సేప్ యాప్ ద్వారా జిపిఎస్ లొకేషన్, వీడియోలను కుటుంబసభ్యులు, స్నేహితులను పంపించవచ్చు. ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కో వర్కర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు... ఆపత్కాలంలో ఎవరికి సమాచారం అందాలో నిర్ణయం తీసుకోవచ్చు.
2. మై సేప్టీపిన్ (My Safetipin)
ఆడబిడ్డల రక్షణకు ఉపయోగపడే మరో యాప్ ఈ మై సేప్టీపిన్. ఇందులో GPS ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ వంటివి ఉన్నాయి. అంతేకాదు మహిళలు డేంజరస్ ప్రాంతాలకు వెళ్లినపుడు నోటిఫికేషన్ ఇస్తుంది... తద్వారా వారు ముందుగానే జాగ్రత్తపడవచ్చు.
3. షేక్2సేప్టీ (Shake2Safety)
అమ్మాయిలు ఏదైనా అపాయంలో ఉండి ఫోన్ ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఈ యాప్ ద్వారా అలర్ట్ చేయవచ్చు. కేవలం ఫోన్ ను షేక్ చేయడంద్వారా లేదా పవర్ బటన్ ను ప్రెస్ చేయడంద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కు సమాచారం అందించవచ్చు. ఈ షేక్2సేప్టీ యాప్ ను ఇంటర్నెట్ లేకున్నా ఉపయోగించవచ్చు.
4. 112 ఇండియా (112 India)
కేంద్ర ప్రభుత్వం అత్యవసర సాయంకోసం కేటాయించిన ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ 112. అయితే మహిళల రక్షణ కోసం కూడా ఇలాగే 112 ఇండియా పేరిట ఓ యాప్ ను తీసుకువచ్చింది.. దీని ద్వారా మహిళలు రక్షణ పొందవచ్చు. జిపిఎస్ ఆధారంగా మహిళలు ఎక్కడున్నారో గుర్తిస్తారు... స్థానిక పోలీసులు, ఇతర అధికారులు లేదా వాలంటీర్స్ ను అలర్ట్ చేస్తారు.
5. సతర్క్ ఇండియా (Satark India-Women Safety App)
ఈ యాప్ కూడా మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రమాదకర సమయంలో మహిళలు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు సమాచారం అందించి సహాయం పొందవచ్చు.
మరిన్ని ఉమెన్స్ సెప్టీ యాప్స్
మహిళల సేప్టీ కోసం ఇంకా అనేక యాప్స్ ఉన్నాయి. రక్ష(Raksha), స్మార్ట్ 24×7 (Smart 24×7), ఐమ్ సేఫ్ (I'M Safe), చిల్లా (Chilla), పుకార్ (Pukar), సౌండ్ సేఫ్ (SoundSafe), షీరోస్ (Sheroes) వంటివి కూడా ఉమెన్స్ సేప్టీ యాప్సే. డిల్లీ పోలీసులు ప్రత్యేకంగా హిమ్మత్ ప్లస్ (Himmat Plus) యాప్ ను మహిళల కోసం ఉపయోగిస్తోంది. ఇలాంటి యాప్స్ ఫోన్ లో ఉంచుకోవడంద్వారా ప్రమాద సమయాల్లో మహిళలు రక్షణ పొందవచ్చు... లేదంటే అరిచి గోలచేసినా లాభం ఉండదు... సాయం చేసేవారు కనిపించరు.
