- Home
- Telangana
- Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
Vegetable Price in Hyderabad : కూరగాయల ధరలు ప్రస్తుతం భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో ఈ వీకెండ్ జరిగే సంతల్లో ఏ కూరగాయ ధర ఎలా ఉండే అవకాశాలున్నాయో తెలుసా?

కూరగాయల ధరలు
Vegetable Price : ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి... దేని ధర చూసినా కిలో రూ.50 కి అటుఇటుగా ఉంది. గతనెల డిసెంబర్ లో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన ధరలు కొత్త సంవత్సరంలో కొండెక్కి కూర్చున్నాయి. వంద రూపాయల నోటు పట్టుకుని మార్కెట్ కు వెళితే పట్టుమని రెండు రకాల కూరగాయలు కూడా రావడంలేదు... మరి వారానికి సరిపడా కావాలంటే రూ.300 నుండి రూ.500 సమర్పించుకోవాల్సిందే.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల దిగుబడి బాగా తగ్గింది... అందుకే ధరలు అమాంతం పెరిగాయని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. అటు రైతులకు దిగుబడిలేక లాభాలు లేవు... ఇటు సామాన్యులను ధరలు బెంబేలెత్తిస్తున్నారు.. మధ్యలో వ్యాపారులు మాత్రమే లాభపడుతున్నారు. మార్కెట్ లోకి కూరగాయల సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు... దీంతో కొత్త సంవత్సరంలో సామాన్యులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి.
సాధారణంగా ప్రతి వీకెండ్ హైదరాబాద్ , విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో కూరగాయల సంతలు జరుగుతుంటాయి. ఉద్యోగులు, గృహిణులు ఇక్కడే వారానికి సరిపడా కూరగాయలు కొంటుంటారు. మరీ ఈ వీకెండ్ మార్కెట్స్ లో వెజిటెబుల్స్ ధరలు ఎలా ఉండనున్నాయో ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల సరైన ధరకు కూరగాయలు కొనే వీలుంటుంది... తద్వారా కొంత డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
టమాటా ధర ఎంత..?
సాధారణంగా తెలుగువారి కిచెన్ లో ఎక్కువగా కనిపించే కూరగాయ టమాటా... చాలామంది మార్కెట్ కు వెళ్ళగానే ముందుగా దీన్నే కొనుగోలు చేస్తారు. కూరగాయల సంతల్లో కూడా టమాటాను కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. అయితే ప్రస్తుత చలి వాతావరణం కారణంగా టమాటా దిగుబడి బాగా తగ్గింది... దీంతో అమాంతం ధర పెరిగింది.
మొన్నటివరకు కిలో టమాటా రూ.20 నుండి రూ.30 వరకు లభించింది. కానీ ఇప్పుడు అమాంతం హాఫ్ సెంచరీకి టమాటా ధర చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో టమాటా ధర ఏకంగా రూ.60-70 ఉంది.. ఇది బయట మార్కెట్లో. సూపర్ మార్కెట్స్ లో అయితే ఇది దాదాపు సెంచరీకి టచ్ అవుతోంది. మంచి నాణ్యత కలిగిన టమాటా ధర మరింత ఎక్కువగా ఉంది. ఇలా టమాటా మెల్లిగా సామాన్యుడికి దూరమవుతోంది... రిచ్ పీపుల్ వెజిటెబుల్స్ జాబితాలో చేరుతోంది.
ఉల్లి ధర ఎంత?
ఉల్లిపాయల ధరలు అంచనాలకు అందనట్లు మారుతుంటాయి... ఒక్కోసారి రూ.100, రూ.200 కిలో వస్తాయి... ఇంకొన్నిసార్లు కిలో రూ.5, రూ.10 కి పడిపోతాయి. అయితే ప్రస్తుతం ఉల్లిధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు... హైదరాబాద్ లో కిలో రూ.25 నుండి 30 కి లభిస్తున్నాయి. వీకెండ్ మార్కెట్స్, రైతుబజార్లలో రూ.100 కు మూడు నాలుగు కిలోల ఉల్లిపాయలు లభిస్తున్నాయి... అదే సూపర్ మార్కెట్స్ లో అయితే రూ.40-50 కి కిలో వస్తున్నాయి.
గతంలో రూ.15-20 పలికిన ఉల్లిపాయలు ప్రస్తుతం రూ.35-40 కి చేరుకున్నాయి... దీన్నిబట్టి వీటిధర భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశాలున్నాయని అర్థమవుతోంది. కాబట్టి తక్కువ ధర ఉన్నప్పుడే ఎక్కువగా ఉల్లిపాయలు కొని పెట్టుకోవడం మంచిది.. ఉల్లిపాయలు తొందరగా పాడవవు, ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి. కాబట్టి ఈ ధరల భారం నుండి తప్పించుకోవాలంటే సామాన్యులు కాస్త తెలివిగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
ఏ కూరగాయ ధర ఎంత..?
చిక్కుడు కిలో రూ.50-55
పచ్చిమిర్చి కిలో రూ.50-60
బీట్ రూట్ కిలో రూ.35-40
ఆలుగడ్డ కిలో రూ.29-32
క్యాప్సికం కిలో రూ.50-60
కాకరకాయ కిలో రూ.40-50
సొరకాయ కిలో రూ.30-40
బీన్స్ కిలో రూ.46-51
క్యాబేజీ కిలో రూ.30-35
క్యారెట్ కిలో రూ.50-60
వంకాయలు కిలో రూ.45-50
బెండకాయలు కిలో రూ.55
బీరకాయ కిలో రూ. 50
ఆలుగడ్డ కిలో రూ.30-35
ఆకుకూరల ధరలు
కాయగూరల ధరలు ఎక్కువగా ఉన్నా ఆకుకూరల ధరలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. తాజా ఆకుకూరలు ఉదయం మార్కెట్ మొదలవగానే కొనుగోలుచేయడం మంచిది.
పాలకూర కిలో రూ.17-20
పూదీనా రూ.5-10 కట్ట
కరివేపాకు రూ.5-10 కట్ట (కిలో రూ.80)
కొత్తిమీర రూ.10 కట్ట,
మెంతి కూర కిలో రూ.20
చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

