Car Prices: కారు కొనాలనుకున్నవారికి భారీ షాక్, కొత్త ఏడాదిలో పెరిగిపోయిన ధరలు
Car Prices: కొత్త ఏడాదిలో కారు కొనులనుకునే వారికి బిగ్ షాక్. ఎందుకంటే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచనున్నాయి. ప్రముఖ కంపెనీలు తమ కార్ల ధరలను మూడు శాతం వరకు పెంచాయి. దీంతో కొత్తగా కారు కొనేవారిపై భారం గణనీయంగా పెరగనుంది.

కార్ల ధరల పెంపు
2026 కొత్త సంవత్సరం ప్రారంభంలోనే కారు కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగిలింది. కారు కొనాలనుకునే వారి కల దీని వల్ల కష్టమైపోయే అవకాశం ఉంది. దీని వల్ల కస్టమర్ల ఖర్చు పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నుంచి చాలా ప్రముఖ కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
జనవరి 1 నుంచి ధరల్లో మార్పు
ఖరీదైన కార్లలో బీఎండబ్ల్యూ కారు ఒకటి. గత సెప్టెంబర్‌లో ధరలను పెంచుతామని ముందే ప్రకటించాయి. కారు కొనాలనుకునే వారు డిసెంబర్లోనే అధికంగానే కొనేశారు. ఇప్పుడు 2026 ప్రారంభంలో మళ్లీ 3 శాతం ధర పెంచినట్టు కంపెనీ ప్రకటించింది. ముడిసరుకు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఈ పెంపు అన్నింటికీ కాకుండా కొన్ని మోడళ్లకే వర్తిస్తుందని చెప్పింది.
బెంజి ధర కూడా
మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) కూడా తన కార్ల ధరలనె పెంచినట్టు ప్రకటించింది.ఇది తన అన్ని మోడళ్లపై ఎక్స్-షోరూమ్ ధరను 2 శాతం వరకు పెంచింది. ఇన్‌పుట్ ఖర్చులు, యూరో రూపాయి మారకం రేటు ప్రభావమే దీనికి కారణమని తెలిపింది. ఇది తమ సీల్ మోడల్ ధరను పెంచింది.
ఎంజీ మోటార్ (MG Motor) కారు ధరలు పెంచేసినట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఇది 2 శాతం ధరను పెంచినట్టు ప్రకటించింది. ఈ మార్పు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లన్నింటికీ వర్తిస్తుంది. కామెట్ ఈవీ ధర రూ.10,000-రూ.20,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
నిస్సాన్ కార్లు
నిస్సాన్ (Nissan) కంపెనీ కూడా తమ కార్లపై 3 శాతం వరకు ధరలను పెంచినట్టు ప్రకటించంది. నిస్సాన్ మాగ్నైట్ మోడల్‌పై జనవరి నుంచి రూ.17,000 నుంచి రూ.32,000 వరకు పెరిగే అవకాశం ఉంది. హోండా, రెనాల్ట్ కూడా ధరలు కూడా పెరిగాయి. ఇక రెనాల్ట్ క్విడ్, ట్రైబర్, కైగర్‌పై రెండు శాతం ధర పెంపు ఉండొచ్చు.
