MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Heavy Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక ఈ 9 జిల్లాల్లో వర్ష బీభత్సమే, బిఅలర్ట్

Heavy Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక ఈ 9 జిల్లాల్లో వర్ష బీభత్సమే, బిఅలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో ఈ రెండు రోజులు భారీ నుండి అతిభాారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 22 2026, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Weather Update : ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీనికి ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వర్షాలు మరింత పెరుగుతాయని... ఇందుకు అనుకూలమైన వాతావరణం బంగాళాఖాతంలో సిద్దం అవుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై 23 లేదా 24 అంటే రేపు లేదంటే ఎల్లుండి బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించారు. దీంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంగాళాఖాతంలో అల్పపీడనం
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం

దేశవ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి... రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనమే కారణమని వెల్లడించింది. అల్పపీడనం బలపడుతూ ముందుకు సాగి దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలను కురిపిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది... తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Related Articles

Related image1
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్
Related image2
Now Playing
Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
35
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Gemini

తెలంగాణలో భారీ వర్షాలు

రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం... వీటన్నింటి ప్రభావం తెలంగాణపై గట్టిగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. వీటి ప్రభావంతో జూలై 22, 23 తేదీల్లో అంటే ఇవాళ, రేపు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని... రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.

45
భారీవర్షాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
Image Credit : PTI

భారీవర్షాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

ఈ వర్షాకాలంలో ఇప్పుడే భారీ వానలు మొదలయ్యాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించింది.

1. వర్ష సమయంలో ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితేనే వర్షంలో బయటకు వెళ్లాలి.

2. చెట్ల కింద వాహనాలను నిలపడం లేదంటే మీరే నిలబడటం చేయరాదు. చెట్లపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి, అంతేకాదు ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

3. వర్షాల సమయంలో రోడ్డుపై నీరు నిలిచివుంటుంది... కాబట్టి గుంతలు కనిపించవు. ఇలాంటి సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలి... లేదంటే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.

4. నదులు, జలాశయాలు, వాగులు వంకలు, చెరువుల పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వరద ప్రవాహంతో ప్రమాదాలు జరుగుతాయి.

5. వాతావరణ శాఖ హెచ్చరికలు ఫాలో అవ్వాలి. భారీ వర్షాల సమయంలో అధికారుల సూచనలు పాటించాలి. అవసరం అయితే ఇంటిని వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.

6. నగరాలు, పట్టణాల్లో వర్షాల కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతుంటాయి. కాబట్టి ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలి.

7-days warnings for Telangana dated : 22.07.2026 pic.twitter.com/xofCaJ7NLh

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 22, 2026

55
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
Image Credit : Gemini

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 5 రోజులు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని.. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్ కు పాకిన ఆందోళనలు.. ఏకంగా మంత్రులు, కాంగ్రెస్, బిజెపి చీఫ్ లు అరెస్ట్
Recommended image2
SIR Status Check : మీ ఎస్ఐఆర్ ఫామ్ బిఎల్వోకు అందజేశారా? అయితే SIR స్టేటస్ ఏంటో తెలుసుకునే సింపుల్ ట్రిక్
Recommended image3
IMD Rain Alert: బంగాళాఖాతంలో ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్
Recommended image2
Now Playing
Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved