MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలోని 17 జిల్లాలు సహా ఏపీలో జులై 21న ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2026, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ వర్షాలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్
Image Credit : Gemini

భారీ వర్షాలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారింది. దీనికి తోడు నైరుతీ రుతుపవనాలు కూడా ఊపందుకోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

సోమవారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రానున్న 72 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. జులై 20 నుంచి 27 వరకు వారమంతా వానల ప్రభావం ఉంటుందని వాతావరణ బులెటిన్‌లో స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణలోని ఈ 17 జిల్లాల ప్రజలు జాగ్రత్త.. ఐఎండీ వార్నింగ్
Image Credit : pexels

తెలంగాణలోని ఈ 17 జిల్లాల ప్రజలు జాగ్రత్త.. ఐఎండీ వార్నింగ్

తెలంగాణలోని దాదాపు 17 జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్ లలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 

ఈ ప్రాంతాల్లో పిడుగులు పడటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యధికంగా 10.1 సెం.మీ, నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

DISTRICTS RAIN ALERT - 7.30AM ⚠️🌧️

As expected, WIDESPREAD DOWNPOURS lashed various parts of North, East TG districts like Mancherial, Peddapalli, Bhupalapally, Mulugu, Bhadradri, Karimnagar, Asifabad, Jagitial during overnight hours 🔥🔥🌧️🌧️

For next 3hrs, LIGHT - MODERATE…

— Telangana Weatherman (@balaji25_t) July 21, 2026

35
హైదరాబాద్ వెదర్ ఎలా ఉంటుంది?
Image Credit : Gemini

హైదరాబాద్ వెదర్ ఎలా ఉంటుంది?

హైదరాబాద్ లో కూడా వాతావరణం కూల్‌గా, మబ్బులుగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34℃, కనిష్ఠ ఉష్ణోగ్రత 24℃ వరకు నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరవాసులు సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగొచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్‌లు అయ్యే ఛాన్స్ ఉన్నందున ప్లాన్ చేసుకుని బయలుదేరడం మంచిది.

45
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు పడే ఛాన్స్.. ఏపీఎస్డీఎంఏ కీలక సూచనలు
Image Credit : chatgpt

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు పడే ఛాన్స్.. ఏపీఎస్డీఎంఏ కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆవర్తన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీరప్రాంతాల్లో గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు.

పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం (21-07-2026) శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA తెలిపింది. pic.twitter.com/K3dIKqCkZN

— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 20, 2026

55
రైతులకు సేఫ్టీ అడ్వైజరీ
Image Credit : Gemini

రైతులకు సేఫ్టీ అడ్వైజరీ

పిడుగులతో కూడిన వర్షాలు, తీవ్ర గాలుల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కొన్ని అత్యవసర సూచనలు చేసింది..

చెట్ల కింద నిలబడొద్దు: వర్షం పడే సమయంలో లేదా ఉరుములు వస్తున్నప్పుడు భారీ చెట్ల కింద గానీ, ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ స్తంభాల దగ్గర గానీ నిలబడకూడదు.

రైతు అలర్ట్: కోసిన పంటలను, ధాన్యాన్ని తడవకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి.

యాప్స్ వాడండి: వాతావరణ సమాచారం కోసం 'Mausam', పిడుగుల అలర్ట్స్ కోసం 'Damini', వ్యవసాయ సలహాల కోసం 'Meghdoot' యాప్‌లను ఉపయోగించుకోవాలని ఐఎమ్‌డీ సూచించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
వాతావరణం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Recommended image2
TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
Related Stories
Recommended image1
Nagadurga Top 5 Folk Songs: నాగవ్వతో నాగదుర్గ రచ్చ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !
Recommended image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved