అంతరిక్షంలో వరి పంటను పండించిన చైనా.. ఈ స్పేస్ రైస్ ని ఎప్పుడైనా చూసారా..
చైనా చేసే దోపిడీలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇప్పుడు అంతరిక్షంలో వరిని పండించిన చైనా స్వంత సూర్యుడిని తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చైనా అంతరిక్షంలో పండించిన వరికి స్పేస్ రైస్ అని పేరు కూడా పెట్టింది. అంతేకాకుండా మొదటి పంటను(విత్తనాల రూపంలో) కూడా పండించింది.
చైనా గత ఏడాది చంద్రయాన్ తో వరి పంట విత్తనాలను అంతరిక్షంలోకి పంపింది. 40 గ్రాముల బరువున్న 1,500 వరి విత్తనాలు స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమికి తీసుకొచ్చింది. దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ విత్తనాలను నాటారు.
ఈ విత్తనాలను కాస్మిక్ రేడియేషన్ అండ్ సున్నా గురుత్వాకర్షణకు గురైన తరువాత తిరిగి భూమికి తీసుకువచ్చారు. వాటి బరువు సుమారు 40 గ్రాములు. గ్వాంగ్డాంగ్లోని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పేస్ బ్రీడింగ్ రీసర్చ్ సెంటర్ లో స్పేస్ రైస్ (అంతరిక్షంలో పండించిన బియ్యం)మొదటి పంటను పండించారు. స్పేస్ రైస్ విత్తనం పొడవు 1 సెంటీమీటర్. మంచి, ఉత్తమమైన విత్తనాలను ప్రయోగశాలలలో పెంచి, ఆపై పొలాల్లో పండిస్తామని పరిశోధనా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గువో టావో తెలిపారు.
స్పేస్ రైస్ అంటే ఏమిటి?
ఈ విత్తనాలు కొంతకాలంపాటు అంతరిక్ష వాతావరణంలో ఉన్న తరువాత చాలా మార్పులు జరుగుతాయి. వీటిని అంతరిక్షం నుండి తిరిగి తీసుకువచ్చిన తరువాత భూమిపై పండించిన పంట కంటే ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఇటువంటి ప్రయోగాలు వరితోనే కాదు, ఇతర పంటలతో కూడా ఉన్నాయి. చైనా వరి, ఇతర పంటల విత్తనాలను 1987 నుండి అంతరిక్షంలోకి తీసుకువెళుతోంది. దీని దిగుబడి సాధారణ వరి కంటే ఎక్కువగా ఉంటుంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, చైనా ఇప్పటివరకు పత్తి నుండి టమోటాల వరకు 200కి పైగా పంటలపై ప్రయోగాలు చేసింది. చైనా మీడియా ఒక నివేదిక ప్రకారం, 2018లో చైనాలో 2.4 మిలియన్ హెక్టార్లకు పైగా సాగులో అంతరిక్షం నుండి తీసుకొచ్చిన విత్తనాలు మాత్రమే ఉపయోగించారు. చైనా సోషల్ మీడియా వినియోగదారులు దీనిని హెవెన్ రైస్ (స్వర్గం బియ్యం) అని కూడా పిలుస్తున్నారు. గ్లోబల్ టైమ్స్ ప్రకారం, ఇటువంటి విత్తనాలు సుమారు 3-4 సంవత్సరాల తరువాత మార్కెట్లో లభిస్తాయి.
చైనా ప్రణాళిక ఏమిటి
చైనా చంద్రునిపై ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంతేకాకుండా అంతరిక్షంలో పంటలను పండించడానికి గ్రీన్ హౌస్ లను ఉపయోగించడాన్ని కూడా చైనా పరిశీలిస్తోంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, చైనా యూనివర్శిటీ ఆఫ్ జియాలజీ, సన్ యాట్-సేన్ విశ్వవిద్యాలయంతో సహా 13 పరిశోధనా సంస్థలకు చైనా 17 గ్రాముల చంద్రమండలం పై ఉన్న మట్టిని ఇచ్చింది. చంద్రుని భూగర్భ శాస్త్రం, పరిణామం గురించి మరింత అర్థం చేసుకోవడం దీని లక్ష్యం.