Airtel Recharge: రూ. 500లోపు ఉన్న ఎయిర్టెల్ బెస్ట్ ప్రీ-పెయిడ్ ప్లాన్లు ఇవే..
భారతీ ఎయిర్టెల్ ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ. ఇండియాలో ప్రధానంగా మూడు టెలికాం కంపెనీలు ఉన్నాయి, ఇందులో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ ఐడియా పేర్లు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. జియోకు దాదాపు 400 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు.
అన్ని కంపెనీలకు ఒకటి కంటే ఎక్కువ ప్రీ-పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఇంకా 28 రోజుల వ్యాలిడిటీతో చాలా ప్లాన్లు ఉన్నాయి అలాగే 30-31, 56, 84, 365 రోజుల వ్యాలిడిటీతో కూడా రిచార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే రూ. 500 కంటే తక్కువ ధర ఉన్న Airtel కొన్ని బెస్ట్ ప్రీ-పెయిడ్ ప్లాన్ల గురించి చూద్దాం..
రూ. 499 ప్లాన్
ఎయిర్టెల్ ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 2జిబి డేటా, అన్ని నెట్‌వర్క్‌లకి ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే దీనితో మీరు ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
ఎయిర్టెల్ రూ. 479 ప్లాన్
ఎయిర్టెల్ రూ. 479 ప్లాన్‌తో కస్టమర్లు 56 రోజుల వాలిడిటీ పొందుతారు. అన్ని నెట్‌వర్క్‌లకు ఈ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్ అండ్ రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడితే ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 1.5 GB డేటా లభిస్తుంది. Airtel థాంక్స్ యాప్ కూడా ఈ ప్లాన్‌తో వస్తుంది, ఇందులో అపోలో 24/7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్ ఉన్నాయి.
ఎయిర్టెల్ రూ. 455 ప్లాన్
ఈ ప్లాన్ ధర రూ. 455. ఈ ప్లాన్‌తో మొత్తం 6 GB డేటాతో ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో లాంగ్ వాలిడిటీ ప్లాన్‌ను కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్.
ఎయిర్టెల్ రూ. 399 ప్లాన్
ఎయిర్టెల్ ఈ ప్లాన్‌తో రోజుకు 2.5 GB డేటాతో 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు ఈ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఈ ప్లాన్‌తో కూడా మీరు మూడు నెలల పాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు.