FIFA World Cup : ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2026 లో టాప్ 5 కోచ్‌లు వీళ్లే..!
ఒక మంచి కోచ్ సాధారణ జట్టును కూడా అద్భుతంగా తీర్చిదిద్దగలడు. అదే సమయంలో అతని తప్పుడు వ్యూహాలు స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్టును కూడా ఓటమి వైపు నడిపిస్తాయి. మరి ఈ ఫిఫా వరల్డ్ కప్ లో టాప్-10 కోచ్‌లు ఎవరో ఓ లుక్కేద్దాం.
15

Image Credit : Getty
1) కార్లో అన్‌సెలోటి (బ్రెజిల్)
ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో కార్లో అన్‌సెలోటి ఒకరు. క్లబ్ ఫుట్‌బాల్‌లో ఐదుసార్లు ఛాంపియన్స్ లీగ్ గెలిపించిన రికార్డు ఆయన సొంతం. సంప్రదాయాన్ని పక్కనపెట్టి, విదేశీ కోచ్ అయిన అన్‌సెలోటి నాయకత్వంలో బ్రెజిల్ ఈసారి ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. 24 ఏళ్ల తర్వాత సాంబ ఆర్మీని ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టే బాధ్యత ఈ ఇటాలియన్ కోచ్‌పై ఉంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : Getty
2) డిడియర్ డెషాంప్స్ (ఫ్రాన్స్)
డిడియర్ డెషాంప్స్ ఆటగాడిగా, కోచ్‌గా ఫ్రాన్స్ తరఫున ప్రపంచకప్ గెలిచారు. 2018లో ఫ్రాన్స్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టి, 2022లో రన్నరప్‌గా నిలిపారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యంత అనుభవజ్ఞులైన కోచ్‌లలో ఈయన ఒకరు.
35
Image Credit : Getty
3) లియోనెల్ స్కాలోని (అర్జెంటీనా)
2022 ప్రపంచకప్‌లో స్కాలోని అర్జెంటీనాకు టైటిల్ అందించి, వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు. ఆయన కోచింగ్‌లోనే అల్బిసెలెస్టె జట్టు కోపా అమెరికాను కూడా గెలుచుకుంది. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో అద్భుతమైన జట్టును నిర్మించడంలో స్కాలోనికి మంచి పేరుంది.
45
Image Credit : Getty
4) థామస్ టుషెల్ (ఇంగ్లండ్)
జర్మనీకి చెందిన థామస్ టుషెల్ ఆధునిక ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ టాక్టీషియన్లలో ఒకరిగా పేరుగాంచారు. చెల్సీ జట్టుకు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ అందించిన ఘనత ఆయనది. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ జట్టుతో ప్రపంచకప్ గెలవాలనే లక్ష్యంతో ఆయన బరిలోకి దిగుతున్నారు.
55
Image Credit : Getty
5) జూలియన్ నగేల్స్‌మన్ (జర్మనీ)
చిన్న వయసులోనే నగేల్స్‌మన్ ప్రపంచ ఫుట్‌బాల్‌పై తనదైన ముద్ర వేశారు. దూకుడైన, ఆధునిక ఫుట్‌బాల్ ఫిలాసఫీకి ఆయన పెట్టింది పేరు. జర్మనీ కొత్త తరం ఆటగాళ్లకు నాయకత్వం వహిస్తున్నాడు.
Latest Videos

