FIFA : చెత్త రిఫరీ.. ఛీట్ చేసి గెలిచిన ఖతార్.. భారత్ ఆశలు ఆవిరి
India vs Qatar Football Highlights: తొలి అర్ధభాగంలో మ్యాచ్ భారత్ చేతిలోనే ఉంది. అద్భుతమైన ఆటతో గోల్ చేసి ఖతార్‌కు షాకిచ్చింది. అయితే, చెత్త రిఫరీ, ఖతార్ ఛీట్ గేమ్ తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్ 1-2 తేడాతో ఓడిపోయింది.
FIFA World Cup Qualifiers : ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్ లో భారత్ పోరు ముగిసింది. దోహాలోని జాసిమ్ బిన్ హమద్ స్టేడియంలో జరిగిన తమ చివరి గ్రూప్ ఏ మ్యాచ్‌లో ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-2 తేడాతో ఓడిపోయిన భారత్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ నుండి నిష్క్రమించింది. లాలియన్జువాలా చాంగ్టే భారతదేశానికి స్కోరింగ్ గోల్ అందించాడు. అయితే యూసెఫ్ ఐమెన్, అహ్మద్ అల్-రవిల నుంచి వచ్చిన వివాదాస్పద గోల్ కారణంగా ఖతార్ విజేతగా నిలిచింది. అలాగే, ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించిన తర్వాత ఈ గ్రూప్ నుంచి తదుపరి రౌండ్‌కు చేరుకున్న రెండో జట్టుగా కువైట్ నిలిచింది. దీంతో భారత్ ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్ నుంచి ఔట్ అయింది.
వివాదాస్పద రిఫరీ నిర్ణయంతో భారత్ కు దెబ్బ
మంగళవారం దోహాలో ఖతార్ 2-1 గోల్స్ తేడాతో విజేతగా నిలవడంతో ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మూడో రౌండ్ లోకి చారిత్రాత్మక ప్రవేశంపై భారత్ ఆశలు అడియాశలయ్యాయి. 37వ నిమిషంలో లాల్లియాన్జువాలా చాంగ్టే చేసిన గోల్ ద్వారా భారత్ ఆధిక్యం సాధించింది. అయితే, బంతి ఆట మధ్యలో గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినట్టు కనిపించినప్పటికీ రిఫరీ యూసుఫ్ ఐమెన్ గోల్ ను అనుమతించడంతో వివాదం చెలరేగింది. ఈ వివాదాస్పద నిర్ణయం భారత్ మ్యాచ్ పై కాస్త పట్టుతప్పింది. ఆసియా చాంపియన్ ఖతార్ 85వ నిమిషంలో అహ్మద్ అల్ రవీ ద్వారా రెండో గోల్ సాధించింది. ఈ వివాదాస్పద రిఫరీ నిర్ణయానికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైరల్ గా మారాయి.
T20 WC 2024 : భారత్ VS అమెరికా బిగ్ ఫైట్.. గెలిచిన జట్టు సూపర్-8కు అర్హత.. పిచ్ ఎలా ఉండనుంది?