సెక్స్ తర్వాత... స్త్రీ, పురుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా..?
మరికొందరికి ఆ గదిలో నుంచి బయటకు వెళ్లాలని అనిపిస్తుంది. మరికొందరు తమ భాగస్వామిని ముద్దాడాలని అనుకుంటారు. మరి కొందరు ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటారు.
కలయికను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. ఆ కలయిక తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో భావన కలుగుతుంది. కొందరికి కలయిక తర్వాత.. తమ భాగస్వామిని కౌగిలించుకవాలని అనిపిస్తుంటుంది. మరికొందరికి ఆ గదిలో నుంచి బయటకు వెళ్లాలని అనిపిస్తుంది. మరికొందరు తమ భాగస్వామిని ముద్దాడాలని అనుకుంటారు. మరి కొందరు ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే.. కలయిక తర్వాత స్త్రీ, పురుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి..? వారు దేని గురించి ఆలోచిస్తారో ఓసారి చూద్దాం...
"సెక్స్ తర్వాత నేను నా భాగస్వామితో చాలా కనెక్ట్ అయ్యాను. నేను ఆమెకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడతాను. ఆమె చర్మం చాలా మృదువుగా ఉంటుంది. శారీరక సాన్నిహిత్యం నాకు రిలాక్స్‌గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆమెకు మాత్రం సెక్స్ తర్వాత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండటం ఇష్టం.’’ అని ఓ వ్యక్తి తన ఆలోచన పంచుకున్నారు.
“సెక్స్ తర్వాత కౌగిలించుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నేను తదుపరి చేయవలసిన అన్ని పనుల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను. అదే నా థింకింగ్ స్పాట్ అవుతుంది. ఆ సమయంలో నన్న ఎవరూ.. డిస్టర్బ్ చేయకూడదనుకుంటున్నాను. కలయిక తర్వాత నా బ్రెయిన్ చాలా బాగా పని చేస్తుంది.’’ అని ఓ వ్యక్తి తన ఆలోచనలను తెలియజేశారు.
“నేను సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కలయికలో పాల్గొన్నంతసేపు ఒకే కానీ.. ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తే.. తప్పు చేశాననే భావన కలుగుతుంది. ఇది నేను నా మునుపటి భాగస్వాముల నుండి వేరుగా మారడానికి కారణమైంది. నేను సంబంధాలను కొనసాగించలేకపోవడానికి కూడా ఇది ఒక పెద్ద కారణం.’’ అని మరొకరు చెప్పారు.
‘‘నేను ఎవరినైనా నిజంగా ఇష్టపడినప్పుడు, సెక్స్ తర్వాత వ్యక్తిని తదేకంగా చూడటం నాకు ఇష్టం. వారితో కలయికను బాగానే ఆస్వాదిస్తాను. కానీ పెళ్లి మరొకరిని చేసుకునేది అని ఆలోచించినప్పుడు నాలో మథనం మొదలౌతుంది. తొందరపడ్డానా అనే భావన కలుగుతుంది.’’
‘‘నాకు ఈ విషయం గురించి చెప్పలి అంటే సిగ్గుగా ఉంది. కానీ సెక్స్ తర్వాత నా భాగస్వామి ఎంత పరిశుభ్రంగా ఉంటారు అనే విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తాను. అతను స్నానం చేసాడా, పళ్ళు తోముకున్నాడా మొదలైన అన్ని రకాల ఆలోచనలు నా మదిలోకి వస్తాయి. అది నాకు చికాకు కలిగిస్తుంది. కాబట్టి నేను సెక్స్ తర్వాత సన్నిహితంగా ఉండకూడదని భావిస్తాను’’ అని ఓ మహిళ చెప్పారు.