సెక్స్ మధ్యలో కండోమ్ తొలగిస్తే.. కొత్త చట్టం..!
పార్ట్ నర్ సెక్స్ మధ్యలో అనుమతి లేకుండా కండోమ్ తీసేస్తే వారిని నేరస్తులుగా పరిగణనించడమే ఈ చట్టం ఉద్దేశం.
condom
డేటింగ్ కి వెళ్లినప్పుడు... మీరు మీ పార్ట్ నర్ ఎలాంటి ప్రశ్న అడుగుతారు..? మీ సంగతేమో కానీ.. అమెరికాలో మాత్రం.. అమ్మాయిలు ముందుగా.. తమ పార్ట్ నర్ ని కండోమ్ ఉందా అని అడుగుతారట. ఒకవేళ వాళ్ల దగ్గర కండోమ్ లేదు అనే సమాధానం వస్తే.. డేట్ క్యాన్సిల్ చేసి మరీ వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఒక్కోసారి కండోమ్ లేకపోవడం వల్ల రిలేషన్స్ కూడా ముగిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే అక్కడి అబ్బాయిలు కచ్చితంగా తమ వెంట కండోమ్ ప్యాకెట్ ని క్యారీ చేస్తారు.
ఇంతకీ ఈ కండోమ్ గోల ఏంటా అనుకుంటున్నారా..? తాజాగా అమెరికాలో ఈ కండోమ్ విషయంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఆ చట్టం దేనికో తెలుసా..?
పార్ట్ నర్ సెక్స్ మధ్యలో అనుమతి లేకుండా కండోమ్ తీసేస్తే వారిని నేరస్తులుగా పరిగణనించడమే ఈ చట్టం ఉద్దేశం. కాగా.. ఏబీ 453 పేరిట కాలిఫోర్నియా కొత్త బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు క్రిస్టినా గార్సియా ప్రతిపాదించగా ఆ రాష్ట్ర శాసనసభ తాజాగా ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఈ బిల్లు కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ న్యూసమ్ వద్దకు చేరింది. అక్టోబర్ 10 వరకు గవర్నర్‌కు ఈ బిల్లుపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందితే మాత్రం ఇలాంటి సంచలన బిల్లు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచిపోనుంది.
condom
లైంగిక వేధింపులకు సంబంధించి కాలిఫోర్నియా సివిల్ కోడ్‌లోని సెక్షన్ 1708.5ను సవరిస్తూ 453 బిల్లును తీసుకురావడం జరిగింది. సంభోగ సమయంలో ఏ విధంగాను భాగస్వామిని గాయపరిచేలా వ్యవహరించడం నేరం అని 1708.5 సెక్షన్ పేర్కొంటోంది.
అంటే.. భాగస్వామి(ఆమె, అతడు) జననాంగాలను, ఇతర ప్రైవేట్ పార్ట్స్‌ను గాయపరచకూడదు. దీనికి కొనసాగింపుగా తీసుకొచ్చిందే 453 బిల్లు. శృంగార సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్స్ తొలిగించడానికి వీల్లేదు. ఒకవేళ భాగస్వామి అనుమతి లేకుండా సంభోగం మధ్యలో కండోమ్ తొలగిస్తే అది నేరంగా పరిగణించబడుతోంది.
ఇక తాజాగా రాష్ట్ర శాసన సభలో ఈ బిల్లు ఆమోదం పొందడంపై అసెంబ్లీ సభ్యురాలు, బిల్లు రూపకర్త క్రిస్టినా గార్సియా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈ నెల 8న ఓ ట్వీట్ చేశారు.
"బిల్లు ఏబీ453 గవర్నర్ వద్దకు వెళ్లింది. గవర్నర్ ఈ బిల్లుపై సంతకం చేసి ఆమోదిస్తారని అనుకుంటున్నాను. శృంగారం సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించడం అనేది నేరం అని ఈ బిల్లు పేర్కొటోంది. ఇకపై అలా చేస్తే శిక్షార్హులు" అని ఆమె ట్వీట్ చేశారు.
ఇదే తరహాలో న్యూయార్క్ సెనేట్‌లో కూడా 2019 మార్చిలో డయాన్ జే సేవినో కూడా ఎస్4401 పేరిట ఓ బిల్లును ప్రవేశపెట్టారు. న్యూయార్క్ రాష్ట్ర సెనేట్ వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం ఇంకా ఈ బిల్లు సెనేట్‌లోనే ఉంది
అటు విస్కాన్సిన్ రాష్ట్ర ప్రతినిధి మెలిస్సా సార్జెంట్ కూడా ఇదే విషయమై 2017లో ఓ బిల్లును ప్రతిపాదించారు. అయితే, ఈ బిల్లు భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగిస్తే.. అవాంఛిత గర్భం, లైంగిక సంబంధిత అంటు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని పేర్కొంటోంది.