ఒంటరిగా ట్రిప్ కి వెళ్లాలనుకుంటున్నారా? బెస్ట్ ప్లేసులు ఇవే
గత కొంత కాలంగా మన దేశంలో సోలో ట్రిప్ ట్రెండ్ బాగా పెరిగింది. మీరు కూడా వీకెండ్ లో ఎక్కడికైనా సింగిల్ గా ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటున్నట్లయితే.. బెస్ట్ ప్లేసులు ఉన్నాయి. ఆ ప్లేసులేంటో తెలుసుకుందాం...
ము.
మైసూర్
దక్షిణ భారతదేశంలో మీరు ట్రిప్ కి వెళ్లాలి అనుకుంటే కచ్చితంగా మైసూర్ వెళ్లాల్సిందే. ఇక్కడ మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి ఆలయం, బృందావన్ గార్డెన్స్ చూడొచ్చు. అంతేకాదు ది బెస్ట్ ఫిల్టర్ కాఫీ తాగొచ్చు. రుచికరమైన ఇడ్లీ, దోశ లాంటివి రుచి చూడొచ్చు.
2) రిషికేష్
దేవభూమి రిషికేష్ కి కూడా సోలో ట్రిప్ చేయొచ్చు. త్రివేణి ఘాట్, లక్ష్మణ ఝూలా, గంగా హారతి చాలా ఫేమస్. రిషికేష్ వెజ్, ఆయుర్వేదిక్ ఫుడ్ బాగుంటుంది. 3-4 రోజుల్లో రిషికేష్ చూడొచ్చు.
3) జైపూర్
రాజస్థాన్ కల్చర్ చూడాలంటే జైపూర్ వెళ్లాల్సిందే. సోలో గా వెళ్లినా ఈ జైపూర్ అందాలను చూసి మీరు మైమరిచిపోతారు. అక్కడ చూడటానికి కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి . ఆమెర్ కోట, హవా మహల్, సిటీ ప్యాలెస్ చూడొచ్చు. దాల్-బాటీ చూర్మా కచ్చితంగా రుచి చూడాల్సిందే.
4) పాండిచ్చేరి
తక్కువ బడ్జెట్ లో సోలో ట్రిప్ కి పాండిచ్చేరి బెస్ట్. బీచ్ లు, పోర్చుగీస్ కాలనీ, ప్రకృతి అందాలు బాగుంటాయి. పాస్ట్రీ, సీ ఫుడ్ కచ్చితంగా రుచి చూడాల్సిందే. స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు.
5) వారణాసి
కాశీ వెళ్లాలని అందరికీ ఉంటుంది. సోలో ట్రిప్ కి వారణాసి బాగుంటుంది. ఘాట్ లు, సారనాథ్, బెనారస్ గల్లీలు చూడొచ్చు.లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిన ప్లేస్ ఇది. చాట్, పాన్, లస్సీ ఇక్కడ రుచి చూడాల్సిందే.
6) కొచ్చిన్
కేరళలో కొచ్చిన్ కూడా బాగుంటుంది. సింగిల్ గా వెళ్లినా ఎంజాయ్ చేయగల ప్లేస్ ఇది. ఫుడ్ లవర్స్ కి కొచ్చిన్ బెస్ట్. సీ ఫుడ్ బాగుంటుంది. చాలా మంది విదేశీయులు వస్తారు.
7) ఉదయ్ పూర్
సరస్సుల నగరం ఉదయ్ పూర్ కూడా సోలో ట్రిప్ కి బాగుంటుంది. సిటీ ప్యాలెస్, పిచోలా సరస్సు చూడొచ్చు. రాజస్థాన్ సంస్కృతి తెలుస్తుంది. గట్టే కూర తినాలి.