MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చలికాలంలో పెరుగు తింటే ఏమౌతుందో తెలుసా?

చలికాలంలో పెరుగు తింటే ఏమౌతుందో తెలుసా?

పెరుగులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బుల నుంచి కాపాడుతాయి. కానీ చలికాలంలో పెరుగును తినకూడదని చాలా మంది అంటుంటారు. మరి దీనిపై డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 24 2024, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
curd

curd

ఆరోగ్యకరమైన ఆహారంలో పెరుగు ఒకటి. పెరుగు ప్రోబయోటిక్  కు మంచి వనరు. దీనిలో మనకు మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి సీజన్ లో పెరుగును ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 

25


అయితే పెరుగును చలికాలంలో తినకూడదని చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే దీనివల్ల జలుబు చేస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది చలికాలంలో పెరుగును తినడానికి ఇష్పపడరు. మరి చలికాలంలో పెరుగును తినాలా? వద్దా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో కూడా పెరుగును తినొచ్చు. ఎందుకంటే ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీనిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి మాత్రమే తినాలని చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే? దీన్ని సాయంత్రం, రాత్రి అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనివల్ల జలుబు అయ్యే అవకాశం ఉంది. పెరుగును తింటే మీ జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మీరు తొంరదగా బరువు తగ్గుతారు.
 

35

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

పెరుగును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు ప్రోబయోటిక్ ఫుడ్ కాబట్టి దీన్ని తింటే జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో పెరుగును తినడం వల్ల అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. చలికాలంలో పెరుగును తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటివి రావు.

ప్రేగులకు ప్రయోజనకరంగా ఉంటుంది 

పెరుగు మన పేగులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగును తింటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు మన పేగుల పనితీరు కూడా మెరుగుపడుతుంది. 

45


ఎముకలను బలంగా ఉంచుతుంది

పెరుగును తింటే ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. పెరుగులో ఎముకల్ని బలంగా ఉంచే కాల్షియంతో పాటుగా ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని చలికాలంలో తింటే ఎముకల నొప్పులు తగ్గిపోతాయి. ఎముకలు బలంగా కూడా ఉంటాయి. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంటుంది. అయితే ఈ సీజన్ లో మీరు పెరుగును తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. పెరుగులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

55
തൈര്

തൈര്

చర్మం, జుట్టుకు ప్రయోజనకరం

పెరుగులో ఉండే రకరకాల పోషకాలు మన చర్మానికే కాకుండా.. జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీన్ని  ప్రతి రోజూ తినడం వల్ల మన చర్మం సహజంగా తేమగా ఉంటుంది. అలాగే జుట్టు మంచి రంగులో, షైనీగా మెరుస్తుంది. 

బరువును నియంత్రిస్తుంది

పెరుగు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే పెరుగులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీన్ని తింటే మీరు అతిగా తినలేరు. దీంతో మీ బరువు అదుపులో ఉంటుంది. బరువు పెరగరు. ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spinach: వారంలో ఒక్కరోజు పాలకూర తిన్నా చాలు.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Recommended image2
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశ క్రిస్పీగా , టేస్టీగా రావాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు
Recommended image3
Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిట్కాతో వారం రోజులైనా తియ్యగా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved