అసలు సిసలైన శృంగారం ఇదే..!
కనీసం పార్ట్ నర్ తో కూడా తమకు ఏమి కావాలనే విషయాన్ని చర్చించలేకపోతున్నారట. కాబట్టి.. ఆ సిగ్గు విడిచి.. తమకు ఏం కావాలో స్వేచ్ఛగా చర్చించాలట.
sex
శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే.. పని ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎమోషల్ బారియర్స్.. ఇలా కారణం ఏదైనా చాలా మంది కలయికను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు.
sex
కొందరేమో.. కలయిక విషయంలో ఏవేవో ఊహించుకొని.. తీరా రియాల్టీలో అలా ఉండకపోయేసరికి ఇబ్బందిపడుతుంటారు. మరి కొందరు.. వారికి కలయిక విషయంలో ఫాంటసీలు ఉంటాయి. వాటిని కనీసం పార్ట్ నర్ తో కూడా షేర్ చేసుకోలేరు. వీటన్నింటి కారణంగా వారు కలయికను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. మరి ఈ సమస్యలను అధిగమించి.. అసలు సిసలైన కలయికను ఆస్వాదించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
Sex in fashion
మనం పెరిగిన వాతావరణం, సమాజం కారణంగా సెక్స్ గురించి మాట్లాడటానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు. సమాజంలో అన్ని విషయాల గురించి మాట్లాడే మనం.. ఆ విషయం గురించి మాత్రం చర్చించడానికి కూడా ఇష్టపడంలేదు. దాని వల్ల కూడా భార్యభర్తల మధ్య ఈ శృంగారం విషయంలో సమస్యలు మొదలౌతున్నాయట. కనీసం పార్ట్ నర్ తో కూడా తమకు ఏమి కావాలనే విషయాన్ని చర్చించలేకపోతున్నారట. కాబట్టి.. ఆ సిగ్గు విడిచి.. తమకు ఏం కావాలో స్వేచ్ఛగా చర్చించాలట.
Sex in fashion
చాలా మంది సెక్స్ గురించి పెద్దగా తెలుసుకోవడానికి ఏముంటుంది లే అని అనుకుంటూ ఉంటారు. కానీ.. అది చాలా పెద్ద తప్పు అంట. దీని గురించి తెలుసుకోవడానికి చాలా ఉంటుందట. కాబట్టి ప్రతి ఒక్కరికీ సెక్స్ ఎడ్యుకేషన్ కచ్చితంగా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Sex in fashion
ఇక చాలా మంది సెక్స్ అంటే కలయిక మాత్రమే అనుకుంటారు. దానికంటే ముందు ఇద్దరి మధ్య ప్రేమ, రొమాన్స్ కూడా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రొమాన్స్ తో మొదలుపెట్టి తర్వాత కలయిక దాకావెళ్లాలని చెబుతున్నారు. చివరి స్టెప్ లో మాత్రమే కలయికకు వెళ్లాలని .. అప్పటి వరకు రొమాన్స్, ఫోర్ ప్లే చేయాలని చెబుతున్నారు.
sex life
కలయిక విషయంలో చాలా ముఖ్యమైనది స్పర్శ. దానిలో ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ.. మీరు మీ పార్ట్ నర్ ని ఎలా తాకుతున్నారనేది కూడా చాలా ముఖ్యమట. ప్రేమగా తాకడానికి.. ప్రేమ లేకుండా తాకటానికి తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. రఫ్ గా కాకుండా స్మూత్ గా హ్యాండిల్ చేయాలట. ప్రేమగా తాకడం ముఖ్యమట.