MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Chicken During Pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా?

Chicken During Pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా?

చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో చికెన్ తినడానికి భయపడతారు. చికెన్ తింటే వేడిచేస్తుందనో.. లేదా ఇంకేదో అవుతుందనో అపోహ పడతుంటారు. కానీ చికెన్ గర్భిణులకు చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకో.. ఎలా తినాలో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Jul 04 2025, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గర్భిణీలు చికెన్ తినచ్చా?

గర్భిణీలు చికెన్ తినచ్చా?

గర్భిణులు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీలో చాలామంది చికెన్ తినడానికి భయపడతారు. మటన్ తింటే మంచిదని భావిస్తారు. కానీ గర్భిణీలు చికెన్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చికెన్ తినడం వల్ల కలిగే లాభాలు

చికెన్ తినడం వల్ల కలిగే లాభాలు

గర్భిణీలు చికెన్ తినడం వల్ల ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. కడుపులోని బిడ్డ వృద్ధికి ఇది చాలా అవసరం. అంతేకాదు చికెన్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. చికెన్ లో ఉండే B6, B12 వంటి విటమిన్లు.. శిశువు శరీర అభివృద్ధికి, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

Related Articles

Related image1
Pregnancy Care: ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ ఎలా తింటే మంచిదో తెలుసా?
Related image2
Pregnancy tips: ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు గొడవపడితే ఏమవుతుందో తెలుసా?
35
చికెన్ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చికెన్ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • చికెన్ ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి. సరిగ్గా ఉడకని చికెన్ లో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంది.   
  • ఫ్రెష్ మాంసం వాడాలి. నిల్వ చేసిన ఫుడ్ తినకపోవడమే మంచిది. స్ట్రీట్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు.
  • ఎక్కువ మసాలా వేసిన లేదా ఫ్రై చేసిన చికెన్ కాకుండా.. ఉడికిన లేదా గ్రిల్డ్ చికెన్ తినడం మంచిది.
  • బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగడానికి రకరకాల ఇంజెక్షన్లు ఇస్తుంటారు. కాబట్టి అలాంటి చికెన్ తీసుకోవడం మంచిదికాదు. నాణ్యమైన చికెన్ లేదా నాటుకోడి మాంసం తినడం ఉత్తమం.  
45
చికెన్ ఎప్పుడు తినకూడదు:
Image Credit : freepik

చికెన్ ఎప్పుడు తినకూడదు:

  • మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉన్నపుడు చికెన్ తినకూడదు.
  • ప్రెగ్నిన్సీ టైంలో ఎప్పుడైనా చికెన్ తిన్నాక వాంతులు, అలర్జీ వస్తే మరోసారి చికెన్ తినకపోవడమే మంచిది.
  • డాక్టర్ నాన్ వెజ్ తినకూడదని చెప్పినప్పుడు.. చికెన్ కి దూరంగా ఉండటం మంచిది.
55
ఇవి గుర్తుంచుకోండి!

ఇవి గుర్తుంచుకోండి!

గర్భిణులు చికెన్ తినవచ్చు. కానీ మితంగా తినాలి. శుభ్రమైనది, సరిగ్గా ఉడికింది మాత్రమే తీసుకోవాలి. గైనకాలజిస్టు సూచనల ఆధారంగా ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Pregnancy Care: ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ ఎలా తింటే మంచిదో తెలుసా?
Recommended image2
Pregnancy tips: ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు గొడవపడితే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved