- Home
- Life
- Pregnancy & Parenting
- Pregnancy tips: ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు గొడవపడితే ఏమవుతుందో తెలుసా?
Pregnancy tips: ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు గొడవపడితే ఏమవుతుందో తెలుసా?
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవపడటం అస్సలు మంచిది కాదు. అది వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు కడుపులో ఉన్న బిడ్డపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయనే విషయం మీకు తెలుసా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రెగ్నెన్సీ అనేది భార్యాభర్తల మధ్య ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది. కానీ చుట్టూ ఉండే మనుషులు, పరిస్థితులు, కొన్ని విషయాలు ఆ సంతోషాన్ని పాడుచేసేవి కూడా ఉంటాయి. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది. ఒకవైపు గర్భిణులు సంతోషంగా ఉండాలని చెబుతుంటారు. మరోవైపు ఈ గొడవలు, కలహాల వాతావరణం వారిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటుంది. ఇది కడుపులో బిడ్డపై కూడా ఒక విధమైన ప్రభావం చూపుతుందట.
బిడ్డపై నెగెటివ్ ఎఫెక్ట్?
గర్భిణిగా ఉన్నప్పుడు భార్యాభర్తలు గొడవపడితే, దానివల్ల పుట్టబోయే పిల్లలపై నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుందని ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాంటి వాతావరణంలో పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉంటారని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ఆందోళన, ఒత్తిడికి గురయ్యే తల్లులకు ఆందోళన, భయం, దూకుడు లాంటి స్వభావం ఉన్న పిల్లలు పుడతారని ప్రచారం జరుగుతోంది. దీంట్లో నిజమెంతో, పరిశోధనలు, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ టైంలో..
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో కొంతమేర వాస్తవం ఉందని వైద్యులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల మధ్య ఒత్తిడి, గొడవలు పుట్టబోయే బిడ్డపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయని అంటున్నారు.
బిడ్డ మెదడు అభివృద్ధిపై ఎఫెక్ట్
తల్లి ఒత్తిడికి గురైతే కార్టిసోల్ స్థాయి పెరుగుతుందని సైంటిఫిక్ రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఇది గర్భాశయాన్ని దాటి, పిండం మెదడు అభివృద్ధిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల తర్వాత జీవితంలో బిడ్డకు ఎమోషనల్, ప్రవర్తనా సమస్యలు వస్తాయట.
తల్లికి కూడా ప్రమాదం
దీనివల్ల తల్లికి కూడా ప్రమాదం ఎక్కువ అవుతుంది. అంతేకాదు, ఎక్కువ ఒత్తిడి వల్ల నెలలు నిండకుండానే పుట్టడం, పుట్టినప్పుడు తక్కువ బరువు ఉండటం, పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి వాతావరణం బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
డాక్టర్ల సలహా
ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం తల్లిదండ్రులు యోగా, ధ్యానం, ఓపెన్ కమ్యూనికేషన్, ఎమోషనల్ సపోర్ట్ లాంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులపై దృష్టి పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటున్నారు.