MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే తల్లిదండ్రులు ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే

Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే తల్లిదండ్రులు ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే

Parenting: పిల్లలకు మంచి మార్కులు రావాలని పేరెంట్స్ కోరుకుంటారు. అయితే మార్కులే లక్ష్యంగా మారితే పిల్లల్లో చదువు తగ్గి, పరీక్షలంటే భయం పెరుగుతుంది. అందుకే పిల్లలకు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులకు కచ్చితంగా ఈ నాలుగు అలవాట్లు ఉండాల్సిందే.

1 Min read
Author : Nandini Arava
Published : Oct 25 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎన్ని మార్కులొచ్చాయని కాకుండా.. ఏం నేర్చుకున్నావని అడగండి
Image Credit : AI

ఎన్ని మార్కులొచ్చాయని కాకుండా.. ఏం నేర్చుకున్నావని అడగండి

పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలామంది తల్లిదండ్రులు అడిగే మొదటి ప్రశ్న.. ఈ రోజు ఎన్ని మార్కులొచ్చాయి?అని. అలా కాకుండా ఈ రోజు ఏం నేర్చుకున్నావు? అని అడిగితే పిల్లల్లో ఆలోచించే అలవాటు పెరుగుతుంది. చదువును కేవలం మార్కులతో ముడిపెట్టకుండా, కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. దీంతో చదువుపై ఆసక్తి పెరిగి, తప్పులు చేస్తామనే భయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెలివితేటలనే కాదు.. చేసిన పనిని ప్రశంసించండి
Image Credit : Getty

తెలివితేటలనే కాదు.. చేసిన పనిని ప్రశంసించండి

నువ్వు చాలా తెలివైనవాడివి అంటూ పిల్లలను పొగడటం కంటే ఒక పనిని పూర్తి చేయడానికి వారు చేసిన ప్రయత్నాన్ని గుర్తించడం ముఖ్యం. ఉదాహరణకు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు తిట్టకుండా.. గతంలో కంటే ఎంత మెరుగయ్యారో చెప్పండి. క్రమంగా చదవడం, కష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వంటి అలవాట్లను ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల తప్పులు జరిగినా వెనకడుగు వేయకుండా, కొత్త విషయాలను నేర్చుకోవడానికి పిల్లలు సిద్ధపడతారు.

34
హాబీలను కూడా పోటీగా మార్చకండి
Image Credit : Getty

హాబీలను కూడా పోటీగా మార్చకండి

పిల్లలకు డ్రాయింగ్, మ్యూజిక్, గేమ్స్ ఇలా ఇష్టాలు ఉండొచ్చు. అయితే, ప్రతి విషయంలోనూ ఫస్ట్ రావాలని, ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలని ఒత్తిడి చేస్తే.. వారికి మొదట్లో ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోవచ్చు. పిల్లలు తమకు నచ్చిన పనులను ఆనందంగా చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. హాబీల ద్వారా వారు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. ప్రతి పనిలోనూ గెలవాల్సిన అవసరం లేదని, నేర్చుకోవడం కూడా ముఖ్యమేనని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

44
ఇతర పిల్లలతో పోల్చడం మానుకోండి
Image Credit : Getty

ఇతర పిల్లలతో పోల్చడం మానుకోండి

నీ ఫ్రెండ్‌కు ఎక్కువ మార్కులొచ్చాయి.. నువ్వెందుకు తెచ్చుకోలేకపోయావు? అంటూ ఇతర పిల్లలతో పోల్చడం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం పెరిగే అవకాశం ఉంది. పిల్లల్లో నేర్చుకోవడం, ఇంట్రెస్ట్, సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఇతరులతో పోల్చే బదులు, గతంలో కంటే ఇప్పుడు ఎంత మెరుగయ్యారో గుర్తించండి. వారి బలాలను ప్రోత్సహిస్తూ, బలహీనతలను అధిగమించేందుకు సహాయం చేయండి. దీంతో పిల్లలు తమను తాము నమ్మడం నేర్చుకుంటారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: పిల్లలు పేరెంట్స్ దగ్గర సీక్రెట్స్ ఎందుకు దాస్తారో తెలుసా?
Recommended image2
Parenting: పిల్లలు బుద్ధిగా మీ మాట వినాలంటే ..ఈ సూత్రాలు ఫాలో అయిపోండి
Recommended image3
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా?
Related Stories
Recommended image1
Parenting: పిల్లలు బుద్ధిగా మీ మాట వినాలంటే ..ఈ సూత్రాలు ఫాలో అయిపోండి
Recommended image2
Parenting: పిల్లలు పేరెంట్స్ దగ్గర సీక్రెట్స్ ఎందుకు దాస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved