మొక్కవోని దేశభక్తి: ద్రోహిపై ప్రతీకారానికి జీవితాన్నే త్యాగం చేసి...
జలియన్ వాలా బాగ్ మారణహోమం గురించి తెలియని వాడుండడు. అది గుర్తొచ్చినప్పుడల్లా కడుపుమండని భారతీయుడు కూడా ఉండదు. ఇలానే కడుపు మండిన ఒక భారతీయుడు 21 సంవత్సరాలపాటు ఆ కసితో రగిలిపోతూ, తన 40సంవత్సరాల జీవితాన్ని కేవలం ఆ మారణహోమానికి కారకుడైన వ్యక్తిని చంపి భారత మాత ఋణం తీర్చుకోవడానికి త్యాగం చేసాడని మనలో ఎంత మందికి తెలుసు?
జలియన్ వాలా బాగ్ మారణహోమం గురించి తెలియని వాడుండడు. అది గుర్తొచ్చినప్పుడల్లా కడుపుమండని భారతీయుడు కూడా ఉండదు. ఇలానే కడుపు మండిన ఒక భారతీయుడు 21 సంవత్సరాలపాటు ఆ కసితో రగిలిపోతూ, తన 40సంవత్సరాల జీవితాన్ని కేవలం ఆ మారణహోమానికి కారకుడైన వ్యక్తిని చంపి భారత మాత ఋణం తీర్చుకోవడానికి త్యాగం చేసాడని మనలో ఎంత మందికి తెలుసు? ఆ భారత మాత ముద్దు బిడ్డ వీరమరణం పొందిన ఈ జులై 31న అతనినిని ఒకసారి మననం చేసుకుందాం.
జలియన్ వాలా బాగ్ బయట మనకు ఒక విగ్రహం కనపడుతుంది. అతడే ఉదం సింగ్. ఆ రాక్షస మారణకాండపై పగ తీర్చుకున్న ధీరుడు. ఉదం సింగ్. 1899లో పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో జన్మించాడు. అతనికి తండ్రి పెట్టిన పేరు షేర్ సింగ్. తండ్రిని కోల్పోవడంతో అనాథాశ్రమంలో పెరిగాడు. అక్కడ సిక్కు సాంప్రదాయం ప్రకారంగా అతనికి ఉదం సింగ్ అని నామకరణం చేశారు. అక్కడే ఉండి 1918లో మెట్రిక్యూలేషన్ పూర్తిచేసాడు.
1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ లో ప్రజలు శాంతియుతంగా సమావేశమైన వేళ, అప్పటి పంజాబ్ లెఫ్టనెంట్ గవర్నర్ మేజర్ డయ్యర్ ఆ పార్కులో ఉన్నవారిపై ఎటువంటి హెచ్చరికలు జారీచేయకుండానే కాల్పులకు ఆదేశించాడు. దాదాపుగా 1000 మంది ఈ మారణహోమంలో అసువులు బాసారు. అక్కడే ఆ సభలోని వారికి మంచినీరు అందిస్తున్న ఉదం సింగ్ ను ఈ దుశ్చర్య తీవ్రంగా కలచివేసింది.
దాంతో ఎలాగైనా కసి తీర్చుకోవాలనే ఆక్రోశం అతనిలో బయల్దేరింది. ఈ తరుణంలోనే విప్లవ పంథాకు చెందిన గదర్ పార్టీవైపు ఆకర్షితుడయ్యాడు. విదేశాల్లో ఉన్న భారతీయులను బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడడానికి సమీకరించే పనిలో నిమగ్నమయ్యాడు. ఒక 25మంది ఇదే భావజాలం కలిగిన మిత్రులతో, తుపాకులు ఇతర మందుగుండు సామాగ్రితో 1927లో భారత్ కి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే అక్రమ ఆయుధాల కేసులో అతన్ని జైల్లో పెట్టారు. అక్కడ భగత్ సింగ్ తో పెరిగిన సాన్నిహిత్యంవల్ల అతను మరింతగా విప్లవ భావాలను పునికి పుచ్చుకున్నాడు. తరువాతి కాలంలో భగత్ సింగ్ ను తన గురువు అని పేర్కొన్నాడు.
1931లో జైలునుంచి విడుదలైనప్పటికీ పోలీసులు మాత్రం అతని కదలికలను నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ కళ్లుగప్పి జర్మనీ పారిపోయాడు. అక్కడినుండి 1934లో లండన్ చేరుకున్నాడు. అక్కడ ఆరు సంవత్సరాలపాటు అదను కోసం ఎదురుచూశాడు. 1940 13మార్చ్ న క్యాక్సటన్ హాల్ లో డయ్యర్ ప్రసంగిస్తాడు అనితెలుసుకొన్న ఉదం సింగ్, తన కోటు జేబులో పిస్తోలును దాచి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఓపికగా డయ్యర్ వంతు వచ్చేవరకు ఆగి, అతను ప్రసంగానికి రాబోతుండగా రెండు తూటాలను పేల్చాడు. దాదాపుగా అక్కడిక్కక్కడే డయ్యర్ మరణించాడు.
అతడు వెంటనే తానే కాల్చానని, అతడికి బ్రతికే హక్కు లేదంటూ గట్టిగా అరిచాడు. కేవలం రెండు రోజుల్లోనే విచారణ పూర్తిచేసి అతడికి ఉరిశిక్ష విధించారు. కాకపోతే అతన్ని ఉరితీయడానికి మాత్రం ఇంకో మూడు నెలలు ఆగవలిసి వచ్చింది. కారణం- అతడు 42 రోజులపాటు జైల్లో నిరాహార దీక్ష చేసాడు. ఆ విచారణ జరుగుతున్న సమయంలో తనని తాను రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ గా పిలుచుకునేవాడు. భారతదేశంలోని మూడు ముఖ్య మతాల కలియకతో కూడుకున్న పేరు పెట్టుకొని భారతీయుల ఐక్యతను చాటాడు. చివరలో ఆజాద్ అని పెట్టుకోవడం ద్వారా స్వాతంత్ర కాంక్షను ప్రకటించాడు.
independence
ఇలాంటి ఎందరో త్యాగధనుల ఫలితమే మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వేఛ్చా స్వాతంత్య్రాలు. ఇటువంటి దీరులెందరినో అందించిన ఈ భారత గడ్డపైన పుట్టినందుకు మేరా భారత్ మహాన్ అనకుండా ఉండగలమా చెప్పండి!!!