అమరావతిపై మంత్రుల వ్యాఖలు: రాజధానులపై జగన్ వ్యూహం ఇదీ
ప్రజలంతా అమరావతి విషయంలో ఏమి జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో జగన్ అమరావతి విషయంలో మెత్తబడ్డారు అని అంటున్నారు. కాదు జగన్ రాజధాని ప్రాంతవాసులు మెత్తబడే నిర్ణయాలను తీసుకుంటున్నారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ జరుగుతుంది ఏమిటో ఒకసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అమరావతి విషయం చర్చనీయాంశంగా మారింది. మొన్న మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ.... అమరావతిని ఇప్పుడప్పుడు మార్చే ఉద్దేశం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టినాక మాత్రమే తాము ఆ దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఎవరు భయాందోళనలు చెందొద్దని అన్నారు.
ఇకపోతే అనూహ్యంగా ఇంతకుమునుపు అమరావతిని భ్రమరావతి అని, మూడు రాజధానుల ఏర్పాటుపై హింట్ ఇచ్చిన బొత్స సత్యనారాయణ నిన్న సీఆర్డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో పర్యటించారు.
ఆయన అక్కడ నిర్మాణంలో ఉన్న పనులను పర్యటించారు. పూర్తికావొచ్చినా భవనాలను పరిశీలించారు. భవనాలకు ఇంకెంతమేర నిధులు అవసరం, ఏయే పనులు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలను పరిశీలించారు.
ఇక వీటికి తోడుగా రాజధాని ప్రాంతం రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు డబ్బును నిన్న విడుదల చేసారు. కౌలు డబ్బులు, మంత్రి పర్యటన, ఇంకో మంత్రి వ్యాఖ్యలే అనుకుంటుండగా.... జగన్ వైఖరి అమరావతిపై మారిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
నిన్న జగన్ గవర్నర్ తో భేటీ. ఆయన నిన్న ఉన్నట్టుండి గవర్నర్ ని కలవనున్నట్టుగా ప్రకటించి సాయంత్రం కలిశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మర్యాదపూర్వక భేటీ అని చెప్పినప్పటికీ..... ఊహాగానాలు మాత్రం ఊపందుకున్నాయి.
ప్రజలంతా అమరావతి విషయంలో ఏమి జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో జగన్ అమరావతి విషయంలో మెత్తబడ్డారు అని అంటున్నారు. కాదు జగన్ రాజధాని ప్రాంతవాసులు మెత్తబడే నిర్ణయాలను తీసుకుంటున్నారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ జరుగుతుంది ఏమిటో ఒకసారి చూద్దాం.
అమరావతి ప్రాంతంలో ఉద్యమాలు ఇప్పుడప్పుడు చల్లారేలా కనబడడం లేదు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల విధించిన నిషేధాజ్ఞలు అమల్లో ఉండి అక్కడ నిరసనలు బయటకు కనబడడమలేదు కానీ అక్కడ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పుగానే ఉంది.
అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే... జగన్ ధైర్యం చేసి వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ లను తిరిగి ఎన్నికల బరిలో నిలబెట్టలేకపోతున్నారు. తన పార్టీలో ఎవరు చేరినా రాజీనామా చేసి ఎన్నికవ్వాలన్న జగన్, ఇతర ప్రాంత నాయకులనైతే తిరిగి నిలబెట్టి గెలిపించుకునేవారు. కానీ రాజధాని ప్రాంతం అవడంతో... అది ఇబ్బందికరంగా మారింది.
మరి జగన్ మోహన్ రెడ్డి మెత్తబడ్డారు, రాజధానిని మారవరా అంటే... దానికి ఛాన్సే లేదు. జగన్ మూడు రాజధానుల విషయంలో దృఢనిశ్చయంతో ఉన్నాడు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఆ విషయాన్నీ చేర్చారంటేనే.... ప్రభుత్వం ఆ విషయంలో ఎంత నిర్ణయాత్మకంగా ఉందొ మనకు అర్థమవుతుంది.
మరి మంత్రుల పర్యటనలు ఎందుకు? ఏమి సూచిస్తున్నాయి. మంత్రులు ఇప్పుడు ఇక్కడ పర్యటించడంద్వారా రాజధాని ప్రాంత రైతులకు, ప్రాంతవాసులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పెద్ది రెడ్డి మాటలను గనుక తీసుకుంటే... రాజధాని తరలింపు ఇప్పుడు ఉండదు. టైం ఉంది అని ఇండికేటే చేసారు.
ఆయన ఇంకా సమయం ఉంది అనడం, ఆ తరువాత బొత్స వచ్చి పర్యటించడం. ఆయన వచ్చి భవనాల నిర్మాణాలను చూసి వెళ్లారు. ఈ రెండు చర్యలను గనుక ఒకదానితో ఒకటి పోల్చి చూసుకుంటే... ఆసక్తికర విషయం మనకు ఆవిష్కృతమవుతుంది.
రాజధాని తరలింపు జరిగే లోపు అమరావతిని అభివృద్ధి చేయాలి అని జగన్ సర్కారు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనము ఇక్కడ అర్థం చేసుకోవలిసి ఉంటుంది. అమరావతిలోని పెండింగ్ పనులకు అవసరమైన డబ్బులు దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారని అంటున్నారు.
ఆ పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రజలకు రాజధాని ప్రాంతాన్ని ప్రభుత్వం విస్మరించడంలేదు అనే నమ్మకాన్ని కలిగించాలని చూస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం అభివృద్ధి చేసేంతమేర చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిరూపించుకోవాలని చూస్తుంది.
దానితోపాటుగా.... అవసరమైన చోట ప్రైవేట్ వ్యక్తులను కూడా భాగస్వాములను చేయాలనీ చూస్తున్నారు. ఈ స్ట్రాటెజీతోపాటుగా జిల్లాల విఉభజనను కూడా చేసేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇప్పటికే ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి, పాలన మరింత వికేంద్రీకరన అని,... ఇందులో భాగంగా కృష్ణ జిల్లాను కూడా రెండుగా విభజించాలని యోచిస్తోంది. ఇదే జిల్లాలో స్వర్గీయ ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు ఏ జిల్ పరిధిలోకి వస్తే..., ఆ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలనే యోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అలా టీడీపీని పొలిటికల్ గా కూడా టార్గెట్ చేయాలనీ యోచిస్తుందివో జగన్ సర్కార్. ఇది ప్రస్తుత అమరావతి రాజకీయం.