'మల్లేశం' విజయగాథ వెనకాల మరో సామాన్యుడి కథ

First Published 4, Jun 2019, 3:08 PM IST

పద్మశ్రీ చింతకింది మల్లేశం గారి నిజ జీవితాన్ని ఆధారం చేసుకుని ‘మల్లేశం’ పేరిట ఒక సినిమా వస్తోన్న నేపథ్యంలో అతడికన్నా ముందు అసుయంత్రాన్ని ఆవిష్కరించిన ఒక సామాన్యుడు కథ ఒకటి వెల్లడి కావలసి ఉంది. దాన్ని చెప్పే ఒక చిరు ప్రయత్నమే ఈ వ్యాసం.

పద్మశ్రీ చింతకింది మల్లేశం గారి నిజ జీవితాన్ని ఆధారం చేసుకుని ‘మల్లేశం’ పేరిట ఒక సినిమా వస్తోన్న నేపథ్యంలో అతడికన్నా ముందు అసుయంత్రాన్ని ఆవిష్కరించిన ఒక సామాన్యుడు కథ ఒకటి వెల్లడి కావలసి ఉంది. దాన్ని చెప్పే ఒక చిరు ప్రయత్నమే ఈ వ్యాసం. -కందుకూరి రమేష్ బాబు

ఆసు యంత్రం సృష్టి కర్తగా పేరొందిన చింతకింది మల్లేశం వల్ల ఇక్కత్ వస్త్ర కేంద్రం పోచంపల్లి, దాని చుట్టుపక్కల నలభై గ్రామాల ప్రజలకు ఊరట లభించింది. ముఖ్యంగా వృద్ద మహిళలకు ఎంతో మేలైంది. అంతేకాదు, ఇటీవల మూడేళ్ళుగా పోచంపల్లి పరిశ్రమ అధిక వస్తోత్పత్తి చేస్తున్నదీ అంటే, అది లాభాల దిశగా పరిశ్రమ పరిగేడుతున్నదీ అంటే వృత్తి దారుల సమయాన్ని, శ్రమను ఆదా చేసే ఘనతలో మల్లేశం సృష్టించిన ఆసు యంత్రం కూడా ఒకటని చెప్పాలి. ఆ విజయంలో పద్మశ్రీ చింతకింది మల్లేశం గారికి భాగం ఉందని అందరం అభినందించాలి. అదే సమయంలో అతడు ఎక్కడా తన ఊర్లో తనకన్నా ముందు ఆరేడేళ్ళ క్రితం తయారైన ఆసు యంత్రం గురించి మాట మాత్రం ఎత్తక పోవడం, స్పూర్తి పొందాను అని చెప్పకపోవడంతో మరో సామాన్యుడి కథ అసామాన్యంగా వెనుకడుగు పట్టింది. మల్లేశం గారు చేసిన ఆసు యంత్రాన్ని ఈ మధ్యే కాదు. పది పదిహేను ఏండ్ల నుంచే, కొనుగోలు చేసుకొని ఎందరో వాడుతున్నారు. ఆయనకు పద్మశ్రీ రావడం, అటు పిమ్మట తెలంగాణ ప్రభుత్వం వారి సేవలు గుర్తించి కోటి రూపాయల ఆర్ధిక సహకారం చేయడానికి ముందుకు రావడం దేశంలోనే ఒక విశేషం. దీంతో అయన ప్రతిష్ట గొప్పగా ఇనుమడించింది. వృద్ద మహిళలకు ఎంతో ఉపశమనం లభించింది. అతిశయోక్తి కాదు, వారి వల్లే నేడు కొన్నివేల ఆసు యంత్రాలు వినియోగంలో ఉన్నవి. తెలంగాణా ప్రభుత్వం మల్లేశం గారికి ప్రకటించిన వర్క్ షెడ్ నిర్మాణం, సబ్సిడీ మీద ఆసు యంత్రాల తయారీ కోసం ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయలు వారు సద్వినియోగం చేసుకొని నేతన్నలకు మరింత ప్రయోజనం చేకూరుస్తారని మనం ఆశించాల్సిందే. ఐతే, కొన్ని విషయాలు చెప్పుకోవాలి. గత ఏడు ఈ వ్యాసకర్త తెలంగాణ వస్త్ర పరిశ్రమకు పేరొందిన ముఖ్య కేంద్రాలను సందర్శించే క్రమంలో అయన అలక్ష్యం గురించిన విమర్శలు నా దృష్టికి వచ్చాయి. మల్లేశం భువనగిరి జిల్లా నుంచి జనగాం జిల్లా వరకూ వేలాది మందికి ఆసు యంత్రాలు ఇచ్చారు. కానీ, రోజు రోజుకూ ఆయన బిజీ కావడంతో వాటి రిపేర్ల విషయంలో మునుపటిలా శ్రద్ధ పెట్టడం లేదని పోచంపల్లి, కొయ్యలగూడెం తదితర ప్రాంతాల నేతకారులు అప్పుడు విమర్శించారు. “పేరు, ప్రఖ్యాతి వచ్చేదాకా ఒక తీరు, తర్వాత ఒక తీరా?” అని వారు బాధ పడ్డారు. “ఫోన్ చేస్తే ఎత్తడు. ఎత్తినా సలహా ఇచ్చే టైం లేదు. చిన్నదానికీ పెద్ద దానికీ యంత్రాలను ఆటో ట్రాలీలో వేస్కొని అయన దగ్గరకే రావలసి వస్తోంది. దాంతో సమయం, డబ్బు వృధా అవుతోంది” అని వారు వాపోయారు. “వాటిని తనవద్దకు తీస్కొని రమ్మంటాడేతప్ప ఇంత మందికి ఇచ్చినప్పుడు అక్కడక్కడా సర్వీసింగ్ కోసం కొందరికి పెట్టవలసింది. వారికి శిక్షణ ఇచ్చి సర్వేస్ ఇప్పించవలసింది. కానీ ఆ పని చేయడం లేదు. వ్యక్తిగతంగా సమయం ఇవ్వడం లేదు. ఒక్కడే అన్నీ చూసుకోవడం వల్ల మాకు అన్ని విధాల ఇబ్బంది అవుతోంది” అని పలువురు నాకు తెలిపారు. ఐతే, అది ఇప్పుడు మారిందా లేదా అన్న విషయం తెలుసుకోవలసే ఉంది.

“అవార్డులు, రివార్డులు ఆయనకు పేరు, పఖ్యాతి, డబ్బులూ తెచ్చాయి. కానీ, అదే సమయంలో అసలుకే మూలమైన సర్వీసు విషయంలో ఆయన నిర్లక్ష్యం మంచిది కాదని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం అవసరం అని పలువురు చెప్పడం అప్పటి ఒక వాస్తవం. ఇదిలా ఉంటే, గతంలో మల్లేశం ఇచ్చిన యంత్రాలు బరువుగా ఉండేవి, మంచి మెటీరియల్ వాడేవారు. పని చేసేటప్పుడు కదలకుండా ఉండేవి. రాను రాను ఎక్కువ మందికి అందించే క్రమంలో దాని నాణ్యత తగ్గించినట్లు కూడా చాలా మంది చెప్పారు. ఇదిలా ఉంటే, మరో ముఖ్య విషయం “మల్లేశం రూపొందించిన ఆసు యంత్రం వల్ల శ్రమ తగ్గింది గానీ అది ‘పొర తిరుగుతుంది. దాంతో డిజైన్ ఒక ఇంచ్ మందం షేక్ అవుతుంది” అని కొందరు చెప్పారు. అలా పొర తిరిగకుండా ఉంటే మంచిదని, అటువంటి మిషను ఆలేరులో ఉండే ఎలుగందుల శ్రీనివాస్ తయారు చేశాడని కొయ్యలగూడెం కు చెందిన దుద్యాల శంకర్ అనే నేత కళాకారుడు నాకు అప్పుడు చెప్పారు. “శ్రీనివాస్ నిజానికి మేలైన యంత్రం తయారు చేయడమే కాదు, అసలు ఆసు యంత్రాన్ని మొదట తయారు చేసింది కూడా అతడు, వాళ్ళ అన్నయ్యే. కావాలంటే మీరే వెళ్లి తెలుసుకొండి” అని అయన చెప్పడం విశేషం. దాంతో ఒకింత విస్మయానికి గురై, శ్రీనివాస్ గారి నంబర్ తీసుకొని సంప్రదించగా, “మా అన్న, నేను తాయారు చేసిన యంత్రమే మొదటిది. అంతేకాదు, నా యంత్రం వల్ల పొర తిరగదు” అని కూడా అయన చెప్పాడు పడుగు పోసే ఈ యంత్రానికి మేం ‘చైతన్య ఆసు యంత్రం’ అన్న పేరు పెట్టామని కూడా అయన అన్నాడు. ఒక రోజు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి తమ ఆవిష్కరణ గురించి మరిన్ని వివరాలు అందించి వెళ్ళాడు కూడా.

*వివాదస్పద విషయం – మొదట యంత్రం ఎవరిది? కాగా, చింత కింది మల్లేశం ఆసుయంత్రం రూపొందించింది 1998లో కాగా అదే ఊర్లో, స్వయంగా అయన ఇంటికి సమీపంలోనే ఉన్న ఎలుగందుల సత్యనారాయణ, శ్రీనివాస్ సోదరుల కుటుంబం 1993లోనే ఇటువంటి యంత్రం రూపొందించినట్లు తెలిస్తోంది. దానికి ‘చైతన్య ఆసుయంత్రం’ అన్న పేరు పెట్టారు. సీనియర్ పాత్రికేయులు తిరునగరి శ్రీనివాస్ గారు అప్పట్లోనే ఆంధ్ర ప్రభ పత్రికకు 28 ఏప్రిల్ రోజు ఒక వార్త ఇచ్చారు కూడా. ఆ కథనం కూడా తొలిసారిగా మహిళల శ్రమను తగ్గించే యంత్రం రూపొందించినట్లు ప్రస్తావించింది. “పడుగు పోసే యంత్రానికి జేవం పోసిన నేతగాడు” అన్న శీర్షికతో ఆ వార్త వచ్చింది. చిత్రమేమిటంటే, మల్లేశం తన అమ్మ కష్టాన్ని చూసి తాయారు చేసాను అని ఎట్లా అయితే చెబుతాడో, అదే విషయం అందులో ఉంటుంది. “పేక పడుగు పోయలేక తన తల్లి, భార్య పడుతున్న బాధలే ఈ యంత్రం తయారీకి ప్రేరణ” అని శ్రీనివాస్ సోదరుడు సత్యనారయణ చెబుతారు. అయన ఇంకా ఇలా అంటారు...” ఈ యంత్రాన్ని తయారు చేయడంలో పాలిటెక్నిక్ చదివిన తన తమ్ముడు శ్రీనివాస్, తండ్రి పుండరీకం, శివశంకర్ సిల్క్ చేనేత సంఘం అధ్యక్షుడు శ్రీ చింతకింది మురళి తదితరులు తనకు ఎంతో సహకరించారని” చెబుతారు అయన. అయితే, మల్లేశం రూపొందించిన యంత్రం మరింత ఆధునికమైనది కాగా శ్రీనివాస్ సోదరులు రూపొందించిన యంత్రం మౌలిక రూపం వంటిది. ప్రస్తుతం తన అన్నయ్య మరణానంతరం శ్రీనివాస్ ఒక్కడే ఈ యంత్రాలను తయారు చేసి స్థానికంగా అడిగిన వారికి ఇస్తున్నాడు. చిత్రమైన విషయం ఏమిటంటే, “మల్లేశం బావ మా అసుయంత్రం ద్వారా పని తీసుకోవడానికి వచ్చేవాడు. అతడితో కలిసి మల్లేశం కూడా మా ఇంటికి వచ్చేవాడు. మా ఇంటి వద్ద చూసి, మా స్పూర్తితో రూపొందించినప్పటికీ ఆ విషయాన్ని మల్లేశం ఎక్కాడా చెప్పకపోవడం. కనీసం తన ఆవిష్కరణకు స్ఫూర్తి మేం రూపొందించిన యంత్రమే అని ఎక్కడా ఎప్పుడూ చెప్పకపోవడం వల్ల అయన సృష్టికర్తగా ప్రజల్లోకి విస్తృతంగా వెల్లగాలిగాడు. అది అసలు సమస్య. దాంతో ఒకవైపు అయన పద్మశ్రీ పురస్కారంతో సహా మరెన్నో పురస్కారాలు పొందారు. ప్రభుత్వం నుంచి నుంచి కోటి రూపాయల సహాయపు ప్రకటనా పొందారు. మేమేమో ఇంకా ఎంతో చేయగలిగి ఉండి ఎటువంటి సహకారం లేకుండా ఉండిపోయాం ” అని ఆలేరు శ్రీనివాస్ అన్నాడు. ఈ యంత్రాన్ని తన అన్నయ్య సత్యనారాయణ చేయగా తాను ఆ పనిలో సహకరించానని, ఈ విషయం అప్పట్లోనే పత్రికల్లో వచ్చిందని, అటు తర్వాత కూడా తాను ఆ యంత్రాన్ని డిజిటల్ టెక్నాలజీతో ఆధునీకరించి స్థానిక ఆలేరు శాసన సభ్యులు గొంగడి సునీత గారు సమక్షంలో ఆవిష్కరించామని, ఇవన్నీ స్థానికంగా అందరికే తెలుసనీ అయన చెప్పారు. కాగా, తమ ప్రస్తావన లేకుండా ఆసుయంత్రం భావన తన సృష్టి గా చెప్పుకోవడాన్ని తాము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తెచ్చామని, రెండేళ్ళ క్రితం దాకా కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకు గురై ఒక రకంగా పోరాడామని కూడా ఆయన చెప్పి, ఆ వివరాలు, కాగితాలు కూడా నాకు ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మల్లేశం సృష్టించిన అసుయంత్రం మా నుంచే స్ఫూర్తి పొంది రూపొందించిందే అన్నది అతడి వాదన. లేదా మొదట తామే చేశామన్నది వారి వదనా సారాంశం. ఈ విషయాన్ని గత కమిషనర్ దృష్టికి, ఇప్పటి కమిషనర్ దృష్టికీ కూడా తెచ్చినట్లు కూడా శ్రీనివాస్ చెప్పారు. ఆ ప్రయత్నాలన్నీ, తగిన ఆధారాలు తాను చూపించారు. “ఈ విషయంలో విచారణ కూడా జరిగింది గానీ అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయంలో” అన్నాడు. ఆ విచారణ నివేదిక చెప్పింది ఏమిటంటే, శ్రీనివాస్ సోదరులు చేసింది చెక్క యంత్రం. మల్లేశం చేసింది ఆధునిక యంత్రం. మల్లేశం మూడు రకాలుగా ఆ మిషను రూపొందించారు...అంటూ, అప్పుడు శ్రీనివాస్ సోదరులు చేసిన యంత్రం ఇప్పుడు అందుబాటులో లేదు కనుక ఆఖురున మల్లేశం యంత్రం వైపే మొగ్గి శ్రీనివాస్ సోదరుల ఆవిష్కరణ మొదటిది అన్న వాదనను ద్వితీయం చేశారు లేదా తిరస్కరించారు. కాగా. ఇప్పుడు తెలంగాణ వచ్చాక ప్రభుత్వం కోటి రూపాయల సహాయాన్నిమల్లేశంకి ప్రకటించిన నేపథ్యంలో అలాంటి యంత్రాన్ని ముందే రూపొందించిన వారిగా, అటువంటి యంత్రాలను తయారు చేసి ఇప్పటికీ స్థానికంగా చేసి ఇస్తున్నందున, మరిన్ని ఆవిష్కరణలు చేయగలిగి ఉన్నందున కూడా ప్రభుత్వం తనకు సహాయం చేయాలని, చేనేత పరిశ్రమ అభివృద్దిలో తనవంటి వారికి అండగా నిలవాలని అయన మత్రివర్యులను కలిసేందుకు కూడా ప్రయత్నించారు. అదీ సఫలం కాలేదని అన్నారు. కాగా, ఆలేరు విద్యుత్ కార్యాలయంలో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న శ్రీనివాస్ తన వాదన ఇప్పటికైనా ప్రభుత్వం వినాలని, ఒక నివేదిక ఆధారంగా తన కృషిని విస్మరించడం తగదని కోరుతున్నారు. కాగా, మల్లేశంకు పద్మశ్రీ కూడా ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి వచ్చిందని అయన చెప్పారు.

*నివేదిక ఇలా చెప్పింది... చివరగా ఇదీ మల్లేశం అవిష్కర్తగా నిరూపణ కావడానికి బి. పద్మ అన్న చేనేత జౌలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాసిన నివేదిక సారాంశం. ఇది చదివితే, 2017 ఏప్రిల్ 3 న శ్రీనివాస్ సోదరుల ఆవిష్కరణ ఎలా వెనుక పట్టు పట్టి, మల్లేశం హీరోగా ప్రజల్లోకి వెళ్ళడానికి మూలమిందో తెలుస్తుంది. It is observed from the above, that on going through the documents and photographs on invention of ASU YANTRAM, it is observed that ASU machine which was supposed to have been invented by Sri Yelugandula Srinivasulu and his brother was not available at present in working condition. Ongoing through the photographs it is understood that the ASU machine was made of wood. Further it is submitted that when the wood made ASU mchine compared with the ASU machine invented by sri.Ch.Mallesham seems to be entirely different. Further Sri Ch.Mallesham informed that before standardizing the machine, he had to make three models and then got it PATENTED as given below.. 1. Completely Mechanical Asu Machine( 1999-2005) 2. Electronic ASU Machine ( 2005-2011) 3. Micro controller programme system ASU Machine ( 2011-2017) It is observed from the above three creations that, in the process of making to the final ASU machine he created three version of ASU madhines. Hence the claim of Sri Yelagandula Srinivas that Sri Ch.Mallesham has copied is not justified. Further submitted that sri.Ch.Mallesham has got patent for his invention, dully raisi8ng no objection from the other inventors and got the patent rights.

*ఇప్పటికైనా ఈ మాత్రం తెలియాలి... కాగా, పైన నేను రాసిన సమాచారాన్ని నా దగ్గరే పెట్టుకోకుండా ఒక నివేదిక లాగా రాసి చేనేత జౌళి శాఖ మంత్రికి, కమిషనర్ కి కూడా ఇచ్చాను. శ్రీనివాస్ సోదరులు అన్యాయానికి గురయ్యారేమో చూడండి అని. ఇదొక్కటే కాదు, తెలంగాణా చేనేత పరిశ్రమ గురించి వస్త్ర లిపి పేరిట నేను రాసిన నివేదికలో మరెన్నో సూచనలు, వాస్తవాలు ఉన్నాయి. అవి వారు చూసారో లేదోగానీ, ఇప్పుడు మల్లేశం సినిమా వస్తోన్న నేపథ్యంలో శ్రీనివాస్ గారి గురించి అందరికీ తెలియజెప్పడం నా కనీస బాధ్యత అని రాస్తున్నాను. తెలంగాణా సినిమాలు, సామాన్యుల సినిమాలు అని మనం సంతోషించడంలో తప్పులేదు. కానీ తగిన పరిశోధన లేకుండా చేసే ఏ నిర్మాణాలైనా తిరిగి సామాన్యులకు, తెలంగాణకు కీడే చేస్తాయి అని చెప్పక తప్పదు.

*అసలు సినిమా శ్రీనివాస్ పై తీయాలి... కాకపోతే, ఆలేరు శ్రీనివాస్ చేసిన ఆవిష్కరణ, ఆ క్రమంలో డీఆర్ డీ ఏ అధికారి చిరంజీవి చౌదరి గారు, బ్యాంకు అధికారి శరత్చంద్ర గారు ( స్టేట్ బ్యాంక్ అఫ్ హైదరాబాద్ మేనేజర్ ), వడ్రంగి వెంకటా చారి, వెల్డింగ్ వర్కర్లు రాం రెడ్డి మొదలు ఎంతో మంది స్థానికుల వాంగ్మూలాలు కూడా తన వద్దే కాదు, నా వద్ద జిరాక్స్ ప్రతులున్నై. అవన్నీ చదివితే, ఒక చక్కటి గ్రంధం రాయాలనిపించింది. నిజానికి అసలు సినిమా తీయవలసింది మల్లేశం మీద కాదు, శ్రీనివాస్ మీద అనిపించింది నా వరకు నాకు.

ఆసు యంత్రాన్ని తాము 1992లోనే తయారు చేశామని శ్రీనివాస్ చెప్పారు. ఆయన ఏషియా నెట్ న్యూస్ మాట్లాడారు. తాము దాన్ని తయారు చేసిన క్రమాన్ని కూడా వివరించారు. తమ ఇంట్లో తమ తండ్రి, అన్నలు కలిసి మగ్గాలు నేసేవాళ్లని, పోత పోయడం కష్టమై ఆసు యంత్రాన్ని కనిపెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ఆరు నెలలు కష్టపడి యంత్రాన్ని తయారు చేశామని చెప్పారు. ఆ యంత్ర రూపకల్పనకు బ్యాంక్ నుంచి పది వేల రూపాయల అప్పుడు కూడా తీసుకున్నామని అన్నారు. మల్లేశం తమ నుంచి స్ఫూర్తి పొందితే పొందవచ్చు గానీ ముందుగా దాన్ని తయారు చేసింది తామేనని శ్రీనివాస్ చెప్పుకున్నారు. అందుకు తగిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అప్పట్లో పత్రిల్లో కూడా వార్తలు వచ్చాయని అన్నారు. మల్లేశం యంత్రం 1999లో బయటకు వచ్చిందని అన్నారు. నోట్: శ్రీనివాస్ వెర్షన్ తో తప్ప మిగతా వార్తాకథనంతో ఏషియా నెట్ న్యూస్ కు ఏ విధమైన సంబంధం లేదు. ఆ అభిప్రాయాలు రచయితలకే చెందుతాయి.

loader