ధర్మాన హెచ్చరిక, చిక్కులు ఇవీ: కొత్త జిల్లాలపై వైఎస్ జగన్ వెనకడుగు

First Published 11, Jul 2020, 4:25 PM

రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేయబోతున్నారంటూ ఎప్పటినుండో సాగుతున్న చర్చ ఇప్పుడు కార్యరూపం దాల్చేలా కనబడుతుంది. జిల్లాల ఏర్పాటుపై అందరూ మంత్రులు సైతం మాట్లాడుతున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరును సైతం ఒక జిల్లాకు పెట్టాలని పలువురు మంత్రులు ఇప్పటికే చెప్పారు కూడా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తయిననాటి నుండి తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఒకదానితరువాత ఒకటిగా అన్నిటిని పూర్తిచేస్తూ ప్రజల్లో మంచి మార్కులే కొట్టేస్తున్నాడు. నవరత్నాల అమల్లో కూడా ఆయన విశేష శ్రద్ధ కనబరుస్తున్నారు.

ఎన్నికలప్పుడు ఇచ్చిన మరో హామీ జిల్లాల విభజన విషయంలో కూడా జగన్ ఇప్పుడు దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నాడు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేస్తామని ఎన్నికల ముందే జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిగారు దానిమీద దృష్టి సారించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేయబోతున్నారంటూ ఎప్పటినుండో సాగుతున్న చర్చ ఇప్పుడు కార్యరూపం దాల్చేలా కనబడుతుంది. జిల్లాల ఏర్పాటుపై అందరూ మంత్రులు సైతం మాట్లాడుతున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరును సైతం ఒక జిల్లాకు పెట్టాలని పలువురు మంత్రులు ఇప్పటికే చెప్పారు కూడా.

ఇదంతా జరుగుతుండగానే సీనియర్ నేత, మంత్రి ధర్మాన కృష్ణదాసు సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొన్న వైసీపీ పెద్దల సమక్షంలోనే జిల్లాల విభజన  ,రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శ్రీకాకుళం అభివృద్ధిని గురించి ప్రస్తావిస్తూ..... శ్రీకాకుళం జిల్లాను గనుక విభజిస్తే చాలా సమస్యలు వస్తాయని, శ్రీకాకుళం అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.

రాజకీయంగా ధర్మాన గారి ఈక్వేషన్స్ ఆయనకు ఉండొచ్చు, కానీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాన్ని గనుక విడదీస్తే ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం జిల్లా పరిధిలోకి వెళ్లిపోతాయి. పాలకొండ అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిపోతాయి. అవి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి రావు.

విజయనగరం జిల్లాలో సైతం పార్వతీపురం, సాలూరు, కురుపాం అన్ని కూడా అరకు పరిధిలోకి వెళ్లిపోతాయి. వారికి ఏండ్లుగా విజయనగరంతో ఉన్న సంబంధాలు అన్ని వారు వదులుకోవాలిసి వస్తుంది. ఇది ఏ రెండు నియోజికవర్గాలకో పరిమితం కాదు. చాలా నియోజకవర్గాల్లో కూడా మనకు ఇలాంటి పరిస్థితులు కనబడుతాయి.

విజయనగరం జిల్లా పరిధిలోని పార్వతీపురం వాసులు ఇప్పటికే తమ జిల్లాను ప్రత్యేక జిల్లాగా చేయాలని ర్యాలీలు తీస్తున్నారు. పార్టీలకతీతంగా అక్కడ నాయకులంతా జిల్లా సాధన ఉద్యమాలు చేపడుతున్నారు.

ఇక చిత్తూరు జిల్లా మదనపల్లె వాసులయితే ఏకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసారు. తమ మాధానపల్లెను అయితే ప్రత్యేక జిల్లాగా, లేదంటే... చిత్తూరు జిల్లాలోనైనా, లేదంటే.... కర్ణాటకలోనయినా కలపండి అని అంటున్నారు.

తెలంగాణాలో సైతం జిల్లాల ఏర్పాటప్పుడు ఎంత రచ్చ జరిగిందో అందరూ చూసారు. ప్రతిఒక్కరు తమకు ప్రత్యేక జిల్లా కావాలని ఉద్యమాలు చేసారు. సాధారణంగా ఒక జిల్లాలో కనీసం 5 నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి.

కానీ తెలంగాణాలో అయితే రెండు నియోజకవర్గాలతో కూడా జిల్లా ఏర్పడింది. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కేవలం రెండు అసెంబ్లీ నియోజికవర్గాలతోనే ఏర్పడింది. ఇప్పటికి తెలంగాణాలో సగం మందికి ఏ జిల్లా పరిధిలోకి ఏ ఊరు వస్తుందో అర్థంకాక, జర్నలిస్టులు సైతం ఉమ్మడి నల్గొండ, వరంగల్ అని రాస్తుండటం మనమందరం చూస్తూనే ఉన్నాము.

అన్ని జిల్లాలు ఫైనల్ లిస్ట్ తరువాత కూడా జనగామ జిల్లా పరిధిలో ఏ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి, ఆతరువాత జనగామ జిల్లా ఎలా ఏర్పడిందో అందరికి తెలిసిందే. జిల్లాల విషయం అటుంచితే తమ గ్రామాలను మండలాలు చేయాలనీ, తమ ఊర్లను గ్రామా పంచాయతీలు చెయ్యాలని, తమను వేరే ప్రాంతాలతో కలపొద్దు, కలపమని రకరకాల నిరసనలు మనం చూసినవే

ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఒకింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. గ్రామం, మండల స్థాయి నుంచి ఒక అవగాహనకు వచ్చిన తరువాత వీటిని ఏ జిల్లాలో కలపాలని శాస్త్రీయంగా ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా తెలియవస్తుంది.

దానితోపాటుగా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు సైతం ఈ జిల్లాల ఏర్పాటు వల్ల మారే ఆస్కారం ఉంది. అలా రాజకీయ సమీకరణాలు మారకుండా ఉండేలా నాయకులు తమ పట్టుకోల్పోకుండా ఉండేలా చూడాలని కూడా జగన్ భావిస్తున్నాడు. ధర్మాన ఆ వ్యాఖ్యలు చేయడానికి తన రాజకీయ ప్రాబల్యం పై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆయన ఆలా తన అసంతృప్తిని వెలిబుచ్చారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

loader