వివాహేతర సంబంధాల్లో ఈ నగరమే దేశంలో టాప్... హైదరాబాద్ స్థానమెంతో తెలుసా?
యాష్లే మాడిసన్ సంస్థ సర్వే ప్రకారం భారతదేశంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్న నగరం ఏది? ఈ విషయంలో హైదరాబాద్ ఏ స్థానంలో ఉంది?

వివాహేతర సంబంధాలపై సర్వే
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. మేఘాలయా హనీమూన్ హత్య తర్వాత ఇలాంటి ఘటనల గురించి మరింత ఎక్కువగా వినిపిస్తోంది... వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వివాహమైన మహిళలు భర్తలను చంపే దుర్ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో వివాహేతర సంబంధాల గురించి గ్లోబల్ డేటింగ్ ప్లాట్ ఫామ్ 'యాష్లే మాడిసన్' సంచలన ఢాటాను బైటపెట్టింది. దేశంలో అత్యధిక వివాహేతర సంబంధాలు వెలుగుచూస్తున్న నగరాల జాబితాను విడుదలచేసింది.
KNOW
యాష్లే మాడిసన్ సర్వేలో ఈ నగరమే టాప్
దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి... దీన్నిబట్టి మనుషుల్లో నైతిక విలువలు క్షీణిస్తున్నాయని అర్థమవుతోంది. యాష్లే మాడిసన్ సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం వివాహేతర సంబంధాాల్లో తమిళనాడులోని కాంచీపురం నగరం మొదటి స్థానంలో నిలిచింది.
గతంలో విద్య, ఆద్యాత్మిక నగరంగా ప్రసిద్ధి చెందిన కాంచీపురం నేడు వివాహేతర సంబంధాలకు కేంద్రంగా మారింది. ఈ ఏడాది భారతదేశంలో అత్యధిక వివాహేతర సంబంధాలు నమోదైన జిల్లా ఇదే. గత ఏడాది యాష్లే మ్యాడిసన్ విడుదల చేసిన జాబితాలో కాంచీపురం 17వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది.
సెంట్రల్ డిల్లీ
వివాహేతర సంబంధాల జాబితాలో సెంట్రల్ ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. దేశ రాజధానిలోని ఈ ప్రాంతంలో ధనిక కుటుంబాలు, ఉన్నత ఉద్యోగులు ఎక్కువగా నివసిస్తున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువేనని యాష్లే మాడిసన్ సర్వే బైటపెట్టింది.
బెంగళూరు
ఐటీ సిటీ బెంగళూరు విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే నగరం. దేశ ఐటీ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ నగరీకరణ, ఉద్యోగులు ఒత్తిడితో ఒంటరితనంగా ఫీల్ అవడం వంటివి వివాహేతర సంబంధాలకు కారణం కావచ్చు.
పుణే
పుణే నగరంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, స్వేచ్ఛ, నైట్ లైఫ్ వంటివి ఇక్కడ వివాహేతర సంబంధాలకు దారితీయవచ్చు.
డెహ్రాడూన్
ఈ ప్రశాంతమైన పర్వత నగరం కూడా వివాహేతర సంబంధాలకు అతీతం కాదు. నగరీకరణ, ఆర్థిక స్వాతంత్య్రం వంటివి ఈ సంబంధాలకు కారణం కావచ్చు.
ఇలా వివాహేతర సంబంధాలపై యాష్లే మాడిసన్ నిర్వహించిన సర్వేలో తెలుగు రాష్ట్రాల్లోని ఒకే ఒక నగరం టాప్ 20 లో నిలిచింది. హైదరాబాద్ 18వ స్థానంలో నిలిచింది. యాష్లే మాడిసర్ సర్వే వివరాలను జాతీయా మీడియాసంస్థ ది ఎకనామిక్స్ టైమ్ లో చూడవచ్చు.