- Home
- National
- Top 5 South Indian dishes : ప్రాంతాల పేర్లతో ప్రపంచానికి పరిచయమైన దక్షిణాది వంటకాలు ఇవే..!
Top 5 South Indian dishes : ప్రాంతాల పేర్లతో ప్రపంచానికి పరిచయమైన దక్షిణాది వంటకాలు ఇవే..!
Top 5 South Indian dishes : తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని వంటకాలు ప్రాంతాలు, నగరాల పేర్లతో బాగా ఫేమస్. అలాంటి వంటకాలేవో తెలుసా..?

ఈ వంటకాల పేర్లు చాలా స్పెషల్ గురూ..!
Top 5 South Indian dishes : భారత్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం... ఒక్కో రాష్ట్రానిది ఒక్కో సంస్కృతి, సాంప్రదాయం. ప్రజల జీవన విధానం, అహార అలవాట్లు కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. తెలంగాణలో బిర్యాని, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లో స్వీట్లు, తమిళనాడులో చికెన్ కర్రీ ... ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వంటకం ఫేమస్. ఎంతలా అంటే కొన్ని నగరాలు, ప్రాంతాల పేర్లతో కూడిన వంటకాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. అలాంటి టాప్ 10 దక్షిణాది వంటకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. హైదరాబాదీ బిర్యానీ (Hyderabadi Biryani) - తెలంగాణ
తెలుగు ప్రజలనే కాదు దేశంలోని ఎక్కడివారినైనా బిర్యాని ఎక్కడ బాగుంటుందని అడగండి... 90 శాతం మంది హైదరాబాద్ పేరు చెబుతారు. నిజాం నవాబులు పాలించిన ఈ పురాతన నగరం రుచికరమైన బిర్యానీకి బ్రాండ్ గా మారింది. దేశవిదేశాల నుండి హైదరాబాద్ కు వచ్చే అతిథులు కూడా ఈ బిర్యానీ రుచికి ఫిదా అవుతుంటారు... సాధారణ ప్రజల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకే నగరంలో లభించే బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది... సాధారణ బిర్యానీ కాదు హైదరాబాదీ దమ్ బిర్యానీగా పేరు ఫిక్స్ అయ్యింది.
2. కాకినాడ కాజ (Kakinada Khaja)- ఆంధ్ర ప్రదేశ్
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రుచికరమైన స్వీట్స్, పిండివంటలు, వెజిటేరియన్ వంటకాలకు ఫేమస్. కొన్ని ప్రాంతాల్లో లభించే స్వీట్స్ మరెక్కడా కనిపించవు... ఆ ప్రాంతాలకే ఫేమస్. అలాంటిదే కాకినాడ కాజ. బయట కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ స్వీట్ నోరూరిస్తుంది.. కాకినాడలో మరింత ప్రత్యేకంగా తయారుచేస్తారు. అందుకే కాజ అంటే కాకినాడ... కాకినాడ అంటే కాజాగా మారిపోయింది.
3. చెట్టినాడ్ చికెన్ (Chettinad Chicken) - తమిళనాడు
పక్కా తమిళనాడు మాస్ స్టైల్ ఫుడ్ తినాలంటే చెట్టినాడ్ చికెన్ రుచి చూడాల్సిందే. బాగా మసాలాలు దట్టించి కారంకారంగా ఉండే ఈ చికెన్ కర్రీని తింటుంటే చెమటలు పట్టాల్సిందే. ఈ రుచికి ఫిదాకాని నాన్ వెజ్ ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. చెట్టినాడ్ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన ఈ చికెన్ కర్రీ ఆ ప్రాంతం పేరుతోనే చెట్టినాడ్ చికెన్ గా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.
4. మైసూర్ పాక్ (Mysore Pak) - కర్ణాటక
మైసూర్ పాక్... ఈ పేరు వినగానే చాలామంది నోరు ఊరుతుంది. అంతటి రుచికరమైన స్వీట్ ఇది... మైసూరులో బాగా ఫేమస్ అయిన ఇది ప్రస్తుతం దేశ ప్రజలందరి నోరు తీపి చేస్తోంది. మెత్తగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ స్వీట్ మైసూర్ సిటీ పేరుతో బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా దక్షిణాదిన మైసూర్ పాక్ అంటే తెలియనివారు ఉండరు.
5. మలబార్ పరోటా (Malabar Parotta) - కేరళ
లేయర్లు లేయర్లుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందా అన్నంత సాప్ట్ గా ఉండే పరోటాను కేరళ స్టైల్ కర్రీతో కలిపి తింటుంటే... ఆహా, ఆ రుచి అమోఘం. మరీముఖ్యంగా మలబార్ తీరప్రాంతాల్లో లభించే పరోటా మరింత రుచికరంగా ఉంటుంది. అందుకే కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా మలబార్ పరోటా లకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

