MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు

Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు

Love Marriage: ప్రేమించుకుని, లేచిపోయి పెళ్లి చేసుకునే జంటలకు ఇకపై కొత్త రూల్ రాబోతోంది. ఇకపై పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, కచ్చితంగా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సిందే. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఈ రూల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 22 2026, 06:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లేచిపోయి పెళ్లిచేసుకునే వారికి బిగ్ షాక్
Image Credit : our own

లేచిపోయి పెళ్లిచేసుకునే వారికి బిగ్ షాక్

తమన ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోతే చాలు… ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చేస్తాయి ప్రేమ జంటలు. స్నేహితుల సాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. లేదా ఆర్య సమాజ్ వంటి చోట్ల పెళ్లి చేసుకుంటారు. రిజిస్ట్రార్ ఆఫీసులో నలుగురు సాక్షుల సంతకాలతో పెళ్లి తంతు ముగిస్తారు. కానీ ఇకపై ఇలా కుదరదు. లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు.. కానీ తల్లిదండ్రులకు చెప్పడం తప్పనిసరి. లేదంటే వీరి పెళ్లి రిజిస్టర్ కాదు. ఈ నియమాన్ని గుజరాత్ లో అమలు చేయాలని అధికార యంత్రాంగం ఆలోచిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
త్వరలో అమల్లోకి
Image Credit : stockPhoto

త్వరలో అమల్లోకి

ప్రస్తుతం ఈ కొత్త రూల్ ఇంకా అమల్లోకి రాలేదు. త్వరలో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గుజరాత్ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి అసెంబ్లీలో ప్రకటించారు. 'మీ ప్రేమ నిజమైతే ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. తల్లిదండ్రులకు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు' అని ఆయన అన్నారు.

34
డిక్లరేషన్ తప్పనిసరి
Image Credit : our own

డిక్లరేషన్ తప్పనిసరి

ప్రేమించి లేదా లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకునే జంట  తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. అలా ఇచ్చినట్టు ఓ డిక్లరేషన్ ఇవ్వాలి. తల్లిదండ్రుల అడ్రస్, ఆధార్ కార్డ్ వివరాలు, ఫోన్ నంబర్ వంటివి అధికారులకు ఇవ్వాలి. పెళ్లికి సాక్షులుగా ఉండేవారు కూడా తమ ఆధార్ వివరాలు, డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ ఆఫీసుకు ఇవ్వాలి. తల్లిదండ్రులకు పెళ్లి విషయం తెలియకపోతే పెళ్లి రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. అంటే పెళ్లే జరగదు.

44
మతమార్పిడి పెళ్లిళ్లను ఆపడానికే
Image Credit : Gemini AI

మతమార్పిడి పెళ్లిళ్లను ఆపడానికే

ఈ విషయంపై గుజరాత్ ప్రభుత్వం మాట్లాడుతూ తాము ప్రేమకు అడ్డుకాదని , కానీ ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని ఆపడానికే మా ప్రయత్నం అని చెబుతోంది. అంతే కాాదు ప్రేమ పేరుతో నాటకాలు ఆడదుతూ మత మార్పిడిలు చేయడం వంటివి కూడా జరుగుతున్నాయని వాటిని అడ్డుకునేందుకు ఇలాంటి చట్టాలు చేస్తున్నామని వివరిస్తోంది. 

రిజిస్ట్రేషన్ ఆఫీసుకు చేరుకున్నపెళ్లి జంట పెళ్లికి  దరఖాస్తు చేసుకోవాలి. అధికారి ఆ దరఖాస్తును సంబంధిత జిల్లా లేదా తాలూకాకు పంపిస్తారు. అక్కడ అధికారులు అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా లేదా అని పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి  30 రోజులు పడుతుంది. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పామని అబద్ధం చెబితే, వాళ్లు ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికప్పుడు పెళ్లిళ్లు జరిగే ఛాన్స్ లేదు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బంధుత్వం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
శనివారం ఏం జరగనుంది.? లాక్‌డౌన్‌ త‌ర‌హా నిబంధ‌న‌లు ఎందుకు విధించారు.?
Recommended image2
Indian Railways: రైళ్లలో పిల్లలకు 50 శాతం టికెట్ ఛార్జీ తగ్గింపు.. ఏ వయసు వరకు ఇస్తారో తెలుసా?
Recommended image3
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆస్తులు ఎన్ని కోట్లు? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు?
Related Stories
Recommended image1
Prabhas: ఈ చిన్న సినిమాను తెగ పొగిడేసిన ప్రభాస్, మరొక నాలుగు సార్లు చూస్తానని కామెంట్
Recommended image2
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే భర్త దొరికితే ఆ భార్య ఎంతో లక్కీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved