MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం

Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం

భారత్‌లో చట్టవిరుద్ధంగా నడుస్తున్న 32 నకిలీ యూనివర్సిటీల జాబితాను యూజీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యధికంగా ఢిల్లీలో 12 ఫేక్ వర్సిటీలు ఉన్నాయి. ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 23 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారతదేశంలో నకిలీ యూనివర్సిటీలు..
Image Credit : gemini

భారతదేశంలో నకిలీ యూనివర్సిటీలు..

Fake Universities in India : భారతదేశంలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులను హెచ్చరిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా నడుస్తున్న 32 నకిలీ యూనివర్సిటీల జాబితాను యూజీసీ అధికారికంగా విడుదల చేసింది. ఈ చర్య ద్వారా ఫేక్ విద్యాసంస్థల్లో చేరి విద్యార్థులు తమ విలువైన సమయాన్ని, భవిష్యత్తును పాడు చేసుకోకుండా కాపాడుకోవాలని సూచిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫేక్ యూనివర్సిటీల్లో డిల్లీ టాప్
Image Credit : Getty

ఫేక్ యూనివర్సిటీల్లో డిల్లీ టాప్

యూజీసీ విడుదల చేసిన ఫేక్ యూనివర్సిటీల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ టాప్‌లో ఉండటం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒక్క ఢిల్లీలోనే 12 సంస్థలను నకిలీ యూనివర్సిటీలుగా ప్రకటించారు. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, స్పిరిచ్యువల్ యూనివర్సిటీ వంటి ఆకర్షణీయమైన పేర్లతో ఈ సంస్థలు విద్యార్థులను మోసం చేస్తున్నట్లు తేలింది.

ఢిల్లీ తర్వాత ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా నాలుగు ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పాండిచ్చెరి రాష్ట్రాల్లో రెండు చొప్పున నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది.

Related Articles

Related image1
Fake Rs500 Notes: చలామణిలో భారీగా నకిలీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా చూసి తీసుకోండి
Related image2
Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
35
నకిలీ యూనివర్సిటీల లిస్ట్ ఇదే..
Image Credit : Getty

నకిలీ యూనివర్సిటీల లిస్ట్ ఇదే..

1. ఆంధ్ర ప్రదేశ్ :

క్రీస్ట్ న్యూ టెస్ట్ మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, గుంటూరు

బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం

2. కర్ణాటక :

సర్వ భారతీయ శిక్షా పీఠ్, తుమ్కూరు

గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ, బెంగళూరు

3. కేరళ :

ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రోపెటిక్ మెడిసిన్ (IIUPM), కోజికోడ్

సెయింట్ జోన్స్ యూనివర్సిటీ, కిశనట్టమ్

4. మహారాష్ట్ర

రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగ్ పూర్

నేషనల్ బ్యాక్ వర్డ్ క్రిషి విద్యాపీఠ్, తడ్వాల్

5. జార్ఖండ్

దక్ష యూనివర్సిటీ (వొకేషనల్ ఆండ్ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్), రాంచి

6. పాండిచ్చెరి :

ఉషా లట్చిమనన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తిరుక్కనూర్

శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పుదుచ్చెరి

45
ఇక్కడ చదివితే అంతే సంగతి..
Image Credit : Getty

ఇక్కడ చదివితే అంతే సంగతి..

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 32 నకిలీ యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలకు ఎలాంటి చట్టబద్ధమైన గుర్తింపు ఉండదని యూజీసీ స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్లతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు గానీ, ఉన్నత చదువులకు గానీ వెళ్లలేరని స్పష్టం చేసింది. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే అధికారికంగా డిగ్రీలు ఇవ్వగలవని యూజీసీ మరోసారి తేల్చి చెప్పింది.

55
నకిలీ యూనివర్సిటీలకు ఎలా గుర్తించాలి..?
Image Credit : Getty

నకిలీ యూనివర్సిటీలకు ఎలా గుర్తించాలి..?

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ నకిలీ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని యూజీసీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాల ఉన్నత విద్యాశాఖ, ప్రధాన కార్యదర్శులకు యూజీసీ లేఖలు రాసింది. కాబట్టి విద్యార్థులు కాలేజీలో చేరే ముందు తాము చేరాలనుకుంటున్న యూనివర్సిటీకి గుర్తింపు ఉందో లేదో యూజీసీ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
విశాఖపట్నం
విజయవాడ
అమరావతి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu
Recommended image2
Now Playing
దమ్ముంటే దేవాన్ష్ పై ప్రమాణం చేయు లోకేష్ | Kethireddy Sensational Comments On Nara Lokesh
Recommended image3
Weather Update : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Related Stories
Recommended image1
Fake Rs500 Notes: చలామణిలో భారీగా నకిలీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా చూసి తీసుకోండి
Recommended image2
Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved