MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Richest cities: దేశంలో టాప్ 10 ధ‌నిక‌ న‌గ‌రాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు సిటీలు

Richest cities: దేశంలో టాప్ 10 ధ‌నిక‌ న‌గ‌రాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు సిటీలు

Richest cities: ఒక దేశం ఎంత బలంగా ఉందో చెప్పేది కేవలం జనాభా లేదా సైనిక శక్తి కాదు. ఆ దేశంలోని పెద్ద నగరాలు ఎంత ఆదాయం సృష్టిస్తున్నాయన్నదే అసలు సూచిక. భార‌త దేశంలో అత్య‌ధిక ఆదాయం ఉన్న న‌గ‌రాల‌పై ఓ లుక్కేయండి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 14 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మొద‌టి స్థానంలో ముంబై
Image Credit : Gemini AI

మొద‌టి స్థానంలో ముంబై

దేశ ఆర్థిక రాజ‌ధానిగా ముంబైకి గుర్తింపు ఉన్న విష‌యం తెలిసిందే. సుమారు రూ.27.80 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో అగ్రస్థానంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్, స్టాక్ ఎక్స్చేంజ్‌లు, పెద్ద బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. బాలీవుడ్‌ సినిమా రంగం, పెద్ద పోర్ట్ కూడా భారీ ఆదాయం తెస్తున్నాయి.

210
దేశ రాజ‌ధాని రెండో స్థానంలో
Image Credit : Getty

దేశ రాజ‌ధాని రెండో స్థానంలో

ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం ఆర్థిక పరంగా రెండో స్థానంలో ఉంది. సుమారు రూ.26.33 లక్షల కోట్ల జీడీపీతో బలంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రియల్ ఎస్టేట్, ఐటీ హబ్‌లు, గురుగ్రామ్–నోయిడా వంటి కార్పొరేట్ కేంద్రాలు ఈ ప్రాంత బలంగా చెప్పొచ్చు.

Related Articles

Related image1
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ల‌వ‌ర్‌గా దొర‌కాలంటే రాసి పెట్టుండాలి..
Related image2
హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే
310
మూడో స్థానంలో కోల్‌కతా
Image Credit : Asianet News

మూడో స్థానంలో కోల్‌కతా

కోల్‌క‌తా సుమారు రూ.13.45 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో మూడో స్థానంలో ఉంది.  ఇది హిస్టారికల్ గాపెద్ద పోర్ట్ నగరం. స్టీల్, ఇంజినీరింగ్, టీ వ్యాపారం, తయారీ రంగం బలంగా ఉన్నాయి.

410
4వ స్థానంలో ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీ
Image Credit : Bengaluru Greater Authority

4వ స్థానంలో ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీ

ఐటీ కంపెనీల‌కు పెట్టింది పేరై బెంగ‌ళూరు ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన విష‌యం తెలిసిందే. ఈ న‌గ‌రం సుమారు రూ.9.86 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో నాలుగో స్థానంలో ఉంది. ఐటీ, స్టార్టప్‌లకు కేంద్రంగా ప్రసిద్ధి. అనేక యూనికార్న్ కంపెనీలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి.

510
5వ స్థానంలో చెన్నై
Image Credit : @Kadungaappi/X

5వ స్థానంలో చెన్నై

చెన్నై సుమారు రూ.7.05 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో ఐదో స్థానంలో ఉంది. ఆటోమొబైల్ తయారీలో దేశంలో కీలక నగరం. ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు కూడా బలంగా ఉన్నాయి.

610
6వ స్థానంలో హైదరాబాద్
Image Credit : swagruha.telangana.gov.in

6వ స్థానంలో హైదరాబాద్

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ సుమారు రూ.6.70 లక్షల కోట్ల జీడీపీతో ఆరవ స్థానంలో ఉంది. ఐటీ కంపెనీల పెద్ద క్యాంపస్‌లు, ఫార్మా, బయోటెక్ పరిశ్రమలు నగర ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

710
7వ స్థానంలో పుణే
Image Credit : X

7వ స్థానంలో పుణే

పుణే సుమారు రూ.6.18 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో ఎదుగుతోంది. విద్యాసంస్థలు, ఆటోమొబైల్ పరిశ్రమ, ఐటీ రంగం ప్రధాన బలం.

810
8వ స్థానంలో అహ్మదాబాద్
Image Credit : ANI

8వ స్థానంలో అహ్మదాబాద్

అహ్మ‌దాబాద్ సుమారు రూ.6.09 లక్షల కోట్ల జీడీపీతో వ్యాపార, టెక్స్టైల్ రంగాల్లో ముందుంది. కెమికల్ పరిశ్రమలు కూడా బలంగా ఉన్నాయి.

910
9వ స్థానంలో సూరత్
Image Credit : Asianet News

9వ స్థానంలో సూరత్

సూర‌త్ సుమారు రూ.5.30 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలోనే ప్రముఖ వజ్ర కట్టింగ్ కేంద్రంగా నిలిచింది. టెక్స్టైల్ పరిశ్రమ కూడా విస్తృతంగా ఉంది. దేశంలోని న‌లుమూల‌ల నుంచి ఇక్క‌డికి వ‌స్త్రాల కోసం వ‌స్తుంటారు.

1010
10వ స్థానంలో విశాఖపట్నం
Image Credit : Asianet News

10వ స్థానంలో విశాఖపట్నం

విశాఖ‌ప‌ట్నం సుమారు రూ.3.90 లక్షల కోట్ల జీడీపీతో పదో స్థానంలో ఉంది. పెద్ద పోర్ట్, స్టీల్ ప్లాంట్, షిప్పింగ్, పవర్ రంగాలు నగర ఆర్థిక బలంగా చెప్పొచ్చు. ప్ర‌స్తుతం విశాఖ‌లో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఏర్పాట‌వుతున్నాయి.

ఈ నగరాలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ, సేవా రంగం, ఎగుమతులు, స్టార్టప్‌లు కలిసి కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ నగరాలు మరింత విస్తరించి దేశ ఆర్థిక వృద్ధికి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
భారత దేశం
విశాఖపట్నం

Latest Videos
Recommended Stories
Recommended image1
యువతకు AI శిక్షణ ఇచ్చేందుకు సరికొత్త పథకం... ఏదో తెలుసా?
Recommended image2
Best Honeymoon Spots : ఖర్చు తక్కువ, కిక్ ఎక్కువ.. ఇండియాలో బడ్జెట్ ప్రెండ్లీ హనీమూన్ స్పాట్స్ ఇవే
Recommended image3
Vande Bharat: కిలో మీట‌ర్‌కు రూ. 2 మాత్ర‌మే.. వందే భార‌త్ ఏసీ టికెట్ ధ‌ర‌పై కేంద్ర మంత్రి
Related Stories
Recommended image1
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ల‌వ‌ర్‌గా దొర‌కాలంటే రాసి పెట్టుండాలి..
Recommended image2
హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved