MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే

హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే

Hyderabad Real estate: హైద‌రాబాద్‌లో సొంతిళ్లు చాలా మంది కల. అయితే పెరిగ‌న ధ‌ర‌ల నేప‌థ్యంలో చాలా మందికి ఇది క‌ష్టంగా మారుతోంది. కానీ హైద‌రాబాద్‌కు కాస్త దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో త్వ‌ర‌లోనే రియ‌ల్ బూమ్ రానుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 14 2026, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రీజిన‌ల్ రిండ్ రోడ్డుతో
Image Credit : Gemini AI

రీజిన‌ల్ రిండ్ రోడ్డుతో

తెలంగాణ ప్ర‌భుత్వం రీజినల్ రింగ్ రోడ్ (RRR) పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సంగారెడ్డి సమీపంలో జాతీయ రహదారి–65కు కలిసే భారీ జంక్షన్ నిర్మాణం ప్రతిపాదించారు. ఈ ఇంటర్‌చేంజ్ చుట్టుపక్కల ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రకటనతోనే సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కదలికలు వేగంగా పెరిగాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం నగరానికి సమీపంగా అభివృద్ధి చెందుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భూముల ధరల్లో భారీ పెరుగుదల
Image Credit : Gemini AI

భూముల ధరల్లో భారీ పెరుగుదల

సంగారెడ్డి–జహీరాబాద్ జాతీయ రహదారి పరిధిలో ఒకప్పుడు ఎకరాకు రూ.1.4 కోట్ల నుంచి రూ.2.3 కోట్ల మధ్య ధరలు ఉండేవి. ఇప్పుడు RRR జంక్షన్ కారణంగా అదే భూమి ఎకరాకు రూ.3 కోట్ల వరకు చేరింది. హైవేకు 5–10 కిలోమీటర్ల పరిధిలో ఎకరాకు రూ.70 లక్షల నుంచి రూ.1 కోట్ల వరకు కోటేషన్లు వినిపిస్తున్నాయి. సదాశివపేట, ఆరూర్, బుధేరా, జహీరాబాద్ ప్రాంతాల్లో కూడా పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

35
డీటీసీపీ లేఅవుట్లలో ప్లాట్ల రేట్లు
Image Credit : Gemini AI

డీటీసీపీ లేఅవుట్లలో ప్లాట్ల రేట్లు

సంగారెడ్డి పట్టణ పరిధిలో DTCP అనుమతులతో ఉన్న లేఅవుట్లలో చదరపు గజానికి రూ.12,000 నుంచి రూ.30,000 వరకు ధరలు ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో రూ.8,000 నుంచి రూ.22,000 వరకు రేట్లు చెబుతున్నారు. సదాశివపేటలో చదరపు గజానికి రూ.8,000–రూ.18,000 మధ్య ధరలు ఉండగా, జహీరాబాద్‌లో రూ.12,000–రూ.25,000 వరకు ఉన్నాయి.

45
వాస్తవ పరిస్థితి ఎలా ఉంది?
Image Credit : Gemini AI

వాస్తవ పరిస్థితి ఎలా ఉంది?

రుద్రారం అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఆసుపత్రులు, పాఠశాలలు, కాలేజీలు, షాపింగ్ మాల్స్ వంటి ప్రాథమిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. చాలా మంది అవసరాల కోసం పటాన్‌చేరు లేదా లింగంప‌ల్లి వెళ్లాల్సి వస్తోంది.

55
రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు?
Image Credit : Getty

రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు?

RRR పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాల్లో నిజమైన మార్పు మొదలవుతుంది. రహదారి కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో నివాస కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు పెరుగుతాయి. అదే విధంగా రీజిన‌ల్ రింగ్ రోడ్ నుంచి రింగ్ రోడ్డు నుంచి ప‌టాన్ చెరు కేవ‌లం 30 నిమిషాల్లో చేరుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. తాజాగా మెట్రో రెండో ద‌శ‌లో భాగంగా ఇప్ప‌టికే మియాపూర్ నుంచి ప‌టాన్ చెర్ మార్గానికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో రీజిన‌ల్ రింగ్ రోడ్డు నుంచి న‌గ‌రంలోని ఏ ప్రాంతానికైనా కేవ‌లం గంట‌న్న‌ర నుంచి రెండు గంట‌ల్లో చేరుకునే వెసులుబాటు ల‌భించ‌నుంది. దీంతో ఈ ప్రాంతంతో భ‌విష్య‌త్తులో హైద‌రాబాద్‌కు వేగ‌వంత‌మైన క‌నెక్టివిటీ ల‌భించ‌నుంది. కాబ‌ట్టి హైద‌రాబాద్‌లో సొంతింటి క‌ల నెర‌వేర్చుకోలేని వారికి సంగారెడ్డి స‌మీపంలోని రీజిన‌ల్ రింగ్ రోడ్డు వ‌ద్ద‌ పెట్టుబ‌డి పెట్ట‌డం క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెట్టే ముందు నిపుణులు సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
స్థిరాస్తి
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Recommended image2
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Recommended image3
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Related Stories
Recommended image1
ఆట‌గాళ్ల‌కు కండోమ్ స‌మ‌స్య‌.. 3 రోజుల్లోనే 10 వేల స్టాక్ ఖ‌తం. అస‌లేంటీ కండోమ్‌ల గొడ‌వ‌
Recommended image2
Viral News: అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం.? ఎందుకు ఇంత‌లా వైర‌ల్ అవుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved