MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?

AI Smart Glasses : గణతంత్ర వేడుకల్లో భద్రత కోసం ఢిల్లీ పోలీసులు తొలిసారిగా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ వినియోగిస్తున్నారు. గుంపులో ఉన్నా సరే పాత నేరస్తులను, దాచిన ఆయుధాలను ఈ కళ్లజోళ్లు రెప్పపాటులో గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 24 2026, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
20 ఏళ్ల క్రితం నేరం చేసినా తప్పించుకోలేరు.. పోలీసుల చేతికి మాయా అద్దాలు
Image Credit : Gemini

20 ఏళ్ల క్రితం నేరం చేసినా తప్పించుకోలేరు.. పోలీసుల చేతికి మాయా అద్దాలు

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి వేడుకల్లో కవాతు, శకటాల ప్రదర్శన ఎంత ఆసక్తికరంగా ఉండబోతోందో, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా వలయం కూడా అంతే చర్చనీయాంశంగా మారింది. ఉగ్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు. 

కేవలం సీసీటీవీలు, డ్రోన్లకే పరిమితం కాకుండా, సినిమా రేంజ్‌లో ఉండే ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ధరించి పహారా కాయనున్నారు. ఈ కళ్లజోళ్లు కేవలం చూడటానికే కాదు, కంటికి కనిపించని ముప్పును పసిగట్టడంలోనూ పోలీసులకు మూడో నేత్రంలా పనిచేయనున్నాయి.

25
ఏమిటీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రత్యేకత?
Image Credit : Gemini

ఏమిటీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రత్యేకత?

సాధారణంగా జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం పోలీసులకు కత్తి మీద సాము లాంటిది. ఈ సవాలును అధిగమించేందుకు భారతీయ టెక్ స్టార్టప్ అజ్నాలెన్స్ (Ajnalens) రూపొందించిన ఏఐ ఆధారిత కళ్లజోళ్లను పోలీసులు వినియోగిస్తున్నారు. 

ఇవి సాధారణ కళ్లజోళ్లలా కనిపిస్తాయి కానీ, వీటిలో శక్తివంతమైన కెమెరాలు, సెన్సార్లు అమర్చి ఉంటాయి. సబ్-ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎంపిక చేసిన సిబ్బంది ఈ గ్లాసులను ధరించి కర్తవ్యపథ్ పరిసరాల్లోని రద్దీ ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఇవి మొబైల్ సీసీటీవీ కెమెరాల మాదిరిగా పనిచేస్తూ, లైవ్ ఫుటేజీని విశ్లేషిస్తాయి.

Related Articles

Related image1
Ketu Transit : కేతువు నక్షత్ర గోచారం.. ఈ 3 రాశుల వారికి గడ్డుకాలం
Related image2
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా
35
రెడ్ బాక్స్ vs గ్రీన్ బాక్స్ : ఐఏ స్మార్ట్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
Image Credit : Gemini

రెడ్ బాక్స్ vs గ్రీన్ బాక్స్ : ఐఏ స్మార్ట్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?

ఈ స్మార్ట్ గ్లాసెస్ వ్యవస్థ పనితీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ పోలీసుల వద్ద ఉండే నేరస్తుల డేటాబేస్‌తో కనెక్ట్స్ అయి ఉంటుంది. ఒక పోలీస్ అధికారి జనం వైపు చూసినప్పుడు, ఈ గ్లాసెస్ అక్కడి వ్యక్తుల ముఖాలను క్షణాల్లో స్కాన్ చేస్తాయి. ఇలా స్కాన్ చేసిన వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర లేకపోతే, అధికారికి మొబైల్ స్క్రీన్‌పై లేదా గ్లాసులో గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి వల్ల ప్రమాదం లేదని అర్థం.

ఒకవేళ స్కాన్ చేసిన వ్యక్తి ముఖం పోలీసుల రికార్డుల్లోని నేరస్తులు, ఉగ్రవాదులు లేదా అనుమానితుల ఫోటోలతో 60 శాతం కంటే ఎక్కువ పోలి ఉంటే, వెంటనే రెడ్ బాక్స్ అలర్ట్ వస్తుంది. దీంతో పోలీసులు క్షణాల్లో అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు.

20 ఏళ్ల క్రితం నాటి ఫోటో ఉన్నా దొరికిపోతారు

నేరస్తులు తమ వేషధారణ మార్చుకుని పోలీసుల కళ్లు గప్పాలని చూసినా ఈ టెక్నాలజీ దగ్గర వారి ఆటలు సాగవు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సిస్టమ్ ఎంత పటిష్ఠంగా ఉందంటే.. ఒక నేరస్తుడి ఫోటో 20 ఏళ్ల క్రితం నాటిదైనా సరే, ప్రస్తుత ముఖ కవళికలను బట్టి అది పోల్చుకోగలదు. గడ్డం పెంచుకున్నా, హెయిర్ స్టైల్ మార్చుకున్నా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కచ్చితత్వంతో వారిని గుర్తిస్తుంది. ఇది పాత నేరస్తులను, పరారీలో ఉన్న నిందితులను గుర్తించడంలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

45
దుస్తుల లోపల ఆయుధాలున్నా కనిపెట్టే థర్మల్ విజన్
Image Credit : Gemini

దుస్తుల లోపల ఆయుధాలున్నా కనిపెట్టే థర్మల్ విజన్

కేవలం ముఖాలను గుర్తించడమే కాదు, ఈ గ్లాసెస్‌కు ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ థర్మల్ ఇమేజింగ్. ఎవరైనా వ్యక్తులు తమ దుస్తుల లోపల కత్తులు, తుపాకులు లేదా ఇతర ఇనుప వస్తువులను దాచుకుని వస్తే, ఈ గ్లాసెస్ వాటిని పసిగట్టగలవు. సాధారణ కంటికి కనిపించని ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఇవి గుర్తిస్తాయి. దీనివల్ల భౌతిక తనిఖీలు చేయకుండానే, దూరం నుంచే అనుమానిత వ్యక్తులను గుర్తించి ప్రమాదాలను నివారించే అవకాశం పోలీసులకు లభిస్తుంది.

55
ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ శకటం.. పటిష్ఠ భద్రతా వలయం
Image Credit : ANI and X

ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ శకటం.. పటిష్ఠ భద్రతా వలయం

ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆపరేషన్ సింధూర్ శకటాన్ని ప్రదర్శిస్తున్నారు. పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా దీనిని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో పాక్ నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు ఉండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

సుమారు 10,000 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగా, ప్రతి వాహనం మూడు అంచెల తనిఖీలను దాటుకుని రావాల్సి ఉంటుంది. ఇలాంటి అత్యంత సున్నితమైన సమయంలో, ఏఐ కళ్లజోళ్లు పోలీసులకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వారి పూర్తి జాతకాన్ని సెకన్ల వ్యవధిలో అధికారుల కళ్ల ముందు ఉంచే ఈ సాంకేతికత, ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో అసలైన హీరో అని చెప్పవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పోలీసు భద్రత
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
అమరావతి

Latest Videos
Recommended Stories
Recommended image1
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?
Recommended image2
Jobs : పదో తరగతి పాసైతే చాలు.. ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఏది లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Recommended image3
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలు, అక్కడ తుపాను బీభత్సం
Related Stories
Recommended image1
Ketu Transit : కేతువు నక్షత్ర గోచారం.. ఈ 3 రాశుల వారికి గడ్డుకాలం
Recommended image2
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved