MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • PM Modi: త‌న త‌ల్లిని దూషించిన వారిపై మోదీ రియాక్ష‌న్‌.. ఆలోజింప‌చేస్తున్న ప్ర‌ధాని మాట‌లు

PM Modi: త‌న త‌ల్లిని దూషించిన వారిపై మోదీ రియాక్ష‌న్‌.. ఆలోజింప‌చేస్తున్న ప్ర‌ధాని మాట‌లు

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన దివంగత తల్లిపై విద్యార్థుల నిరసనలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేసిన యువతను శిక్షించడం కంటే వారికి సరైన మార్గనిర్దేశం చేయడం సమాజ బాధ్యత అని ఆయన అన్నారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 01 2026, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'నిరసన హక్కు ఉంది.. కానీ భాషకు హద్దులు ఉండాలి'
Image Credit : Narendra Modi/X

'నిరసన హక్కు ఉంది.. కానీ భాషకు హద్దులు ఉండాలి'

జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనను దేశం మొత్తం గమనించిందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని పేర్కొన్న ఆయన, అయితే ఆ సందర్భంగా ఉపయోగించిన కొన్ని పదజాలం నాగరిక సమాజంలో అంగీకరించదగినది కాదన్నారు. తనతో పాటు తన దివంగత తల్లిని కూడా అవమానించేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
'వారు దారి తప్పిన పిల్లలు.. కోపంతో సమస్యలు పరిష్కారం కావు'
Image Credit : instagram.com/narendramodi/reels/

'వారు దారి తప్పిన పిల్లలు.. కోపంతో సమస్యలు పరిష్కారం కావు'

ఈ ఘటనపై ప్రతీకారం లేదా ఆగ్రహంతో స్పందించడం సరైన మార్గం కాదని ప్రధాని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన విద్యార్థులను దారి తప్పిన పిల్లలుగా తాను భావిస్తున్నానని చెప్పారు. అలాంటి వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, కఠిన చర్యలు తీసుకోవడం లేదా సమాజంలో అవమానించడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. వారిలో మార్పు తీసుకురావడమే అసలు లక్ష్యంగా ఉండాలని సూచించారు.

Related Articles

Related image1
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Related image2
ఈ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియోకు 100 కోట్ల వ్యూస్‌.. ఇంత‌కీ ఆ ఆ వీడియోలో ఏముందంటే..?
35
'నాలుక, పళ్ల' ఉపమానంతో వివరించిన ప్రధాని
Image Credit : Asianet News

'నాలుక, పళ్ల' ఉపమానంతో వివరించిన ప్రధాని

తన అభిప్రాయాన్ని వివరించేందుకు ప్రధాని మోదీ ఒక ఉదాహరణ చెప్పారు. కొన్నిసార్లు పొరపాటున నాలుక పళ్ల కింద పడితే గాయమవుతుంది, కానీ అందుకని ఎవరూ పళ్లను విరగ్గొట్టరని అన్నారు. ఎందుకంటే పళ్లు, నాలుక రెండూ మన శరీరంలోని భాగాలేనని వివరించారు. అదే విధంగా యువత కూడా సమాజంలో భాగమేనని, వారు తప్పు చేసినప్పుడు వారిని దూరం చేయడం కాదు, సరిదిద్దే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.

45
'దేశ నిర్మాణంలో యువత ముందుండాలి'
Image Credit : Asianet News

'దేశ నిర్మాణంలో యువత ముందుండాలి'

విద్యార్థులు జరిగిన ఘటనను పాఠంగా తీసుకుని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని, చేసిన తప్పుల నుంచి అనుభవం పొందాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్రతి యువకుడు భారత పురోగతిలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. "నేను మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను. మనమంతా కలిసి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిద్దాం" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Narendra Modi (@narendramodi)

55
క్షమాభావంతో ముందుకు సాగాలని పిలుపు
Image Credit : Facebook

క్షమాభావంతో ముందుకు సాగాలని పిలుపు

సమాజంలో విభేదాలు, ఆవేశం కంటే పరస్పర అవగాహన, క్షమాభావం ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. తప్పు చేసిన వారిని శాశ్వతంగా ముద్ర వేయడం కాకుండా, వారికి సరైన దిశ చూపించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. యువతపై విశ్వాసం ఉంచి వారికి మంచి విలువలు నేర్పడం ద్వారానే బలమైన భారతాన్ని నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప‌లువురిని ఆలోజింప‌జేస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నరేంద్ర మోదీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Passport Fees : ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లేవారికి కేంద్రం షాక్..14 ఏళ్ల తర్వాత పాస్ పోర్ట్ ఫీజు పెంచుతూ నిర్ణయం
Recommended image2
LPG Cylinder Price : ఆగస్ట్ ఆరంభంలోనే అదిరిపోయే న్యూస్, తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్ లో ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image3
LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే
Related Stories
Recommended image1
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Recommended image2
ఈ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియోకు 100 కోట్ల వ్యూస్‌.. ఇంత‌కీ ఆ ఆ వీడియోలో ఏముందంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved