- Home
- National
- LPG Cylinder Price : ఆగస్ట్ ఆరంభంలోనే అదిరిపోయే న్యూస్, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు, హైదరాబాద్ లో ఎంత తగ్గిందో తెలుసా?
LPG Cylinder Price : ఆగస్ట్ ఆరంభంలోనే అదిరిపోయే న్యూస్, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు, హైదరాబాద్ లో ఎంత తగ్గిందో తెలుసా?
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ్టి నుండి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ.200కి పైగా తగ్గింంది. ఈ తగ్గింపు హోటల్, రెస్టారెంట్ రంగాలకు పెద్ద ఊరటనివ్వనుంది.

భారీ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు ఊరట ఇచ్చారు. గ్యాస్ కొరత, ధరలు భారీగా పెరగడంతో ఇబ్బంది పడుతున్న హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులకు ఆగస్ట్ ఆరంభంలోనే అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి అంటే ఇవాళ్టి నుండే తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి. సిలిండర్‌పై రూ.200కు పైగా ధర తగ్గింది.
హైదరాబాద్ సిలిండర్ ధర ఎంత తగ్గింది?
ఆగస్టు 1 నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు నగరాలతో సహా దేశవ్యాప్తంగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.200 కంటే ఎక్కువగా తగ్గింది. హైదరాబాద్ లో రూ.206 తగ్గి రూ.2985 కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సిలిండర్ ధర రూ.194 తగ్గి రూ.2691 కి చేరింది. చెన్నైలో రూ.2691 కి చెరింది. న్యూఢిల్లీలో సిలిండర్‌పై రూ.202, కోల్‌కతాలో రూ.209 తగ్గించారు. దీంతో ఢిల్లీలో కొత్త ధర రూ.2,738కి చేరగా, కోల్‌కతాలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2,872.50గా నిర్ణయించారు.
గ్యాస్ సిలిండర్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్ యుద్దవాతావరణం, హర్మూజ్ లో రవాణా మార్గంలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇండియాకు ఎల్పిజి గ్యాస్ సరఫరా తగ్గడంతో కొరత ఏర్పడింది… దీంతో భారీ డిమాండ్ ఏర్పడి కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో 3 వేల నుండి 4 వేల మధ్య పలికింది.కానీ ఇప్పుడు గ్యాస్ సరఫరా పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి… తాజాగా రూ.200 తగ్గడంతో హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు దిగొస్తున్నాయి.
పశ్చిమాసియాలో సంక్షోభం, గ్లోబల్ ఇంధన మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఇటీవల ఆయిల్, గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే, ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన సరఫరా స్థిరపడుతోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా, ఇండియాలోనూ కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించి మార్కెట్‌కు ఊతమివ్వాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి.
వ్యాపార రంగానికి బిగ్ రిలీఫ్
సిలిండర్ ధర తగ్గించడం ఇది వరుసగా రెండోసారి. ఈ నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్, చిన్న పరిశ్రమలకు పెద్ద ఊరటనిచ్చింది. వాణిజ్య సంస్థలకు వంట గ్యాసే ప్రధాన నిర్వహణ వ్యయం (Operating Expense)… కాబట్టి ఇంధన ఖర్చు తగ్గడం హాస్పిటాలిటీ, ఫుడ్ సర్వీస్ రంగాలకు (Hospitality Sector) బూస్టర్ డోస్ లాంటిది.

