MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • రెడ్ అలర్ట్.. 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

రెడ్ అలర్ట్.. 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

Heavy Rain Alert: ఐఎండీ 14 రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. గుజరాత్‌, రాజస్థాన్‌ లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 07 2025, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
14 రాష్ట్రాలకు ఐఎండీ  భారీ వర్షాల హెచ్చరికలు
Image Credit : X-@Brezzy_Drive

14 రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరికలు

రాబోయే రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఐఎండీ తాజా వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్‌, రాజస్థాన్‌లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఐఎండీ నివేదిక ప్రకారం, మాధ్య మహారాష్ట్ర, కొంకణ్‌, గోవా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం మధ్య గుజరాత్‌, సౌరాష్ట్ర, కచ్‌, తూర్పు రాజస్థాన్‌ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ రెండు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపునకు గురయ్యే అవకాశముంది. రవాణాకు అంతరాయం కలగవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మధ్య, తూర్పు భారతదేశంలో వర్షాలు
Image Credit : Getty

మధ్య, తూర్పు భారతదేశంలో వర్షాలు

మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లో వర్షాలు పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ మధ్యప్రదేశ్‌, సుబ్‌హిమాలయన్‌ పశ్చిమ బెంగాల్‌, సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో వర్షాల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అలాగే, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపురలో ప్రస్తుతం కురుస్తున్న వానలు సెప్టెంబర్ 11 వరకు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రాల పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన, పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరించారు.

35
దక్షిణ భారతంలో కూడా భారీ వర్షాలు
Image Credit : Gemini AI

దక్షిణ భారతంలో కూడా భారీ వర్షాలు

తమిళనాడులో ఆదివారం నుంచి (సెప్టెంబర్ 7న) 10 తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కేరళ, మాహే ప్రాంతాల్లో సెప్టెంబర్ 9, 10న వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 

ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతం, రాయలసీమలో వచ్చే 5 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 30–40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇక తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

45
ఉత్తర భారతంతో భారీ వర్షాలతో వరదలు
Image Credit : PTI

ఉత్తర భారతంతో భారీ వర్షాలతో వరదలు

ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. దీంతో వరదలు, భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పెద్దమొత్తంలో ప్రాణనష్టం సంభవించింది. పంజాబ్‌ ప్రభుత్వం సెప్టెంబర్ 4న ప్రకటించిన ప్రకారం, వరదల కారణంగా రాష్ట్రంలో 37 మంది మరణించారు. ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది. ఢిల్లీ యమునా నది నీటి మట్టం 207.48 మీటర్లకు చేరుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.

55
భారీ వర్షాలపై అధికారుల జాగ్రత్తలు, హెచ్చరికలు
Image Credit : ANI

భారీ వర్షాలపై అధికారుల జాగ్రత్తలు, హెచ్చరికలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఈ క్రమంలోనే అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ అమలులో ఉందని తెలిపారు. జమ్మూ-కాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, పశ్చిమ రాజస్థాన్‌, తెలంగాణ, మహారాష్ట్రలోని కొంకణ్‌, గోవా, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

దేశవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, ఐఎండీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. మాన్సూన్‌ ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
అమరావతి
విశాఖపట్నం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
ఒకసారి వన్డే.. మరోసారి టీ20.. ఇలా ఆసియా కప్ ఫార్మాట్ ఎందుకు మారుతుంటుంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన 6 విషయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved