MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • Aadhaar Card : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఈ 5 డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ప్రాసెస్ ఇదే!

Aadhaar Card : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఈ 5 డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ప్రాసెస్ ఇదే!

Aadhaar Card Update : ఆధార్ కార్డులో పుట్టిన తేదీని అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ కీలక మార్పులు చేసింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవడానికి అవసరమైన 5 ముఖ్యమైన డాక్యుమెంట్లు, పూర్తి ప్రక్రియ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2026, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పుందా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
Image Credit : Getty

ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పుందా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

దేశంలో నివసించే ప్రతి పౌరుడికి 'ఆధార్' అనేది తప్పకుండా ఉండాల్సిన ఒక గుర్తింపు కార్డు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసే ఈ 12 అంకెల సంఖ్య కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, మన బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటాకు గుర్తింపు. 

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గరి నుండి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం వరకు ప్రతిదానికీ ఆధార్ తప్పనిసరి. అయితే, చాలామంది తమ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందని ఆందోళన పడుతుంటారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఏయే డాక్యుమెంట్లు కావాలి? ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆధార్ కార్డు ప్రాముఖ్యత తెలుసా?
Image Credit : Getty

ఆధార్ కార్డు ప్రాముఖ్యత తెలుసా?

ఆధార్ కార్డులో మీ వేలిముద్రలు, కనుపాప స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలతో పాటు అడ్రస్, ఫోటో, పుట్టిన తేదీ వంటి సమాచారం ఉంటుంది. కేవైసీ వెరిఫికేషన్ కోసం ఇది అత్యంత నమ్మదగిన డాక్యుమెంట్. ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజలకు చేరాలన్నా, మనీ ట్రాన్సాక్షన్స్ సజావుగా జరగాలన్నా ఆధార్ కార్డు కరెక్ట్‌గా ఉండటం చాలా ముఖ్యం.

36
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అప్‌డేట్ ఎందుకు ముఖ్యం?
Image Credit : Aadhaar Official/Instagram

ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అప్‌డేట్ ఎందుకు ముఖ్యం?

చాలా ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్ పాలసీలు వయస్సు ఆధారంగానే వర్తిస్తాయి. ఆధార్‌లోని పుట్టిన తేదీ తప్పుగా ఉంటే, మీరు అర్హులైనప్పటికీ ఆ సేవలను పొందలేరు. అందుకే మీ ఆధార్ కార్డులోని డేటా ఎప్పుడూ లేటెస్ట్ సమాచారంతో అప్‌డేట్ అయి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే, మీ వయస్సుకు ఇది ప్రాథమిక ఆధారంగా పనిచేస్తుంది.

46
పుట్టిన తేదీ అప్‌డేట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే
Image Credit : our own

పుట్టిన తేదీ అప్‌డేట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే

UIDAI నిబంధనల ప్రకారం, ఆధార్‌లో పుట్టిన తేదీని మార్చుకోవడానికి ఈ క్రింది 5 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి మీ దగ్గర ఉండాలి..

1. బర్త్ సర్టిఫికేట్: పుట్టిన తేదీకి ఇది అత్యంత బలమైన ఆధారం.

2. భారతీయ పాస్‌పోర్ట్: అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐడెంటిటీ ప్రూఫ్.

3. సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్: ప్రభుత్వ లేదా పీఎస్‌యూ సంస్థలు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు.

4. పెన్షనర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్: రిటైర్డ్ ఉద్యోగుల దగ్గర ఉండే పెన్షన్ కార్డ్.

5. మార్క్ షీట్/సర్టిఫికేట్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డ్ లేదా యూనివర్సిటీ జారీ చేసిన సర్టిఫికేట్.

56
ఆధార్ కార్డులో పుట్టిన తేదీని అప్‌డేట్ చేసుకునే విధానం ఇదే
Image Credit : our own

ఆధార్ కార్డులో పుట్టిన తేదీని అప్‌డేట్ చేసుకునే విధానం ఇదే

ఆధార్‌లో పుట్టిన తేదీని మార్చుకోవడానికి మీరు నేరుగా ఆన్‌లైన్‌లో చేసే వీలుండదు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవసరం ఉంటుంది.

• ముందుగా మీ దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లండి.

• పుట్టిన తేదీ మార్పు కోసం దరఖాస్తు ఫారమ్ నింపి, పైన చెప్పిన 5 డాక్యుమెంట్లలో ఒకదానిని జత చేయండి.

• అక్కడ ఉన్న అధికారికి మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

• ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు ఒక అకనాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు.

66
ఎన్ని సార్లు ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎన్ని సార్లు మార్చుకోవచ్చు?
Image Credit : our own

ఎన్ని సార్లు ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎన్ని సార్లు మార్చుకోవచ్చు?

ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. UIDAI అధికారిక వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే, అప్‌డేట్ చేసేటప్పుడు డాక్యుమెంట్లు, వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ప్రభుత్వ పథకాలు
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image2
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Recommended image3
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే
Related Stories
Recommended image1
WhatsApp : వాట్సాప్ వాడుతున్నారా? జాగ్రత్త.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్! వెంటనే ఇలా చేయండి
Recommended image2
Goa Trip: బాలీవుడ్ సినిమాల్లో చూసే ఆ అందమైన లొకేషన్లు గోవాలో ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved