MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!

Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!

Snake Bite Cure: ఒంటె కన్నీళ్లలోని ప్రత్యేక నానోబాడీలు అత్యంత ప్రమాదకరమైన పాము విషాన్ని క్షణాల్లో నిర్వీర్యం చేస్తాయని దుబాయ్, భారత శాస్త్రవేత్తల ఉమ్మడి పరిశోధనల్లో తేలింది. ఈ ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 19 2026, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒంటె కన్నీళ్లు తాగితే నాగుపాము విషం దిగిపోతుందా? సైంటిస్టులు ఏం తేల్చారు?
Image Credit : Gemini

ఒంటె కన్నీళ్లు తాగితే నాగుపాము విషం దిగిపోతుందా? సైంటిస్టులు ఏం తేల్చారు?

ఈ ప్రపంచంలో సైన్స్ రోజుకో కొత్త అద్భుతాన్ని మన ముందుకు తెస్తోంది. సాధారణంగా మనం ఒంటెలను ఎడారి ఓడలు అంటాం, వాటి పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని కూడా తెలుసు. కానీ, ఇప్పుడు ఒంటెల కన్నీళ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పాము కాట్లకు సంజీవనిగా మారబోతున్నాయనే క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకొచ్చింది. 

అవును, మీరు విన్నది నిజమే.. ఒంటె ఏడ్చినా కూడా ఆ కన్నీళ్లతో మనుషుల ప్రాణాలు కాపాడవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. నాగుపాము, కట్లపాము లాంటి డేంజరస్ స్నేక్స్ కాటేసినా సరే, ఒంటె కన్నీళ్లలో ఉండే ప్రత్యేక గుణాలు ఆ విషాన్ని చిటికెలో న్యూట్రలైజ్ చేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దుబాయ్, ఇండియన్ సైంటిస్టుల జాయింట్ రీసెర్చ్
Image Credit : Asianet News

దుబాయ్, ఇండియన్ సైంటిస్టుల జాయింట్ రీసెర్చ్

దుబాయ్‌కు చెందిన ‘సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ’ (CVRL), భారత్‌లోని బికనీర్‌లో ఉన్న ‘నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్స్’ (NRCC) శాస్త్రవేత్తలు కలిసి చేసిన జాయింట్ రీసెర్చ్‌లో ఈ సీక్రెట్ రివీల్ అయింది. 

అత్యంత విషపూరితమైన 'సా-స్కేల్డ్ వైపర్' పాము విషాన్ని కొద్ది మోతాదులో ఒంటెలకు ఎక్కించారు. దీనివల్ల ఆ ఒంటెల శరీరంలో అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ అయింది. ఆ తర్వాత వాటి రక్తం, కన్నీళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లో టెస్ట్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Related Articles

Related image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Related image2
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
35
అసలు ఈ కన్నీళ్లలో ఏముంది?
Image Credit : Getty

అసలు ఈ కన్నీళ్లలో ఏముంది?

సాధారణంగా పాము విషం శరీరంలోకి వెళ్తే రక్తం గడ్డకట్టడం, ఇంటర్నల్ బ్లీడింగ్ కావడం, నరాలు పనిచేయకపోవడం లాంటివి జరిగి మనుషులు చనిపోతారు. అయితే, ఒంటె కన్నీళ్లలో ‘నానోబాడీలు’ అని పిలిచే చాలా చిన్న సైజు యాంటీబాడీలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.

ఇవి మామూలు యాంటీబాడీల కంటే చాలా చిన్నవిగా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇవి పాము విషంలోని టాక్సిన్స్‌ను ఈజీగా టార్గెట్ చేసి, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి. కేవలం ఒక్క చుక్క ఒంటె కన్నీటితో నాగుపాములు, వైపర్లతో సహా దాదాపు 26 రకాల పాముల విషాన్ని విరిచేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

45
సాధారణ యాంటీవెనమ్‌లకు ఇది ఎలా ప్రత్యామ్నాయం?
Image Credit : Asianet News

సాధారణ యాంటీవెనమ్‌లకు ఇది ఎలా ప్రత్యామ్నాయం?

ప్రస్తుతం వాడుతున్న పాముకాటు మందులను గుర్రాలు లేదా గొర్రెల రక్తం నుంచి తయారు చేస్తారు. ఇవి చాలా ఖరీదైనవి, పైగా కొందరిలో అలర్జీలు కలిగిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా వీటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే ఉంచాలి. 

కానీ, ఒంటె నానోబాడీలకు వేడిని తట్టుకునే శక్తి ఎక్కువ. వీటికి కోల్డ్ స్టోరేజ్ అవసరం లేదు. అందువల్ల, ఫ్రిజ్ సౌకర్యం లేని మన దేశంలోని మారుమూల గ్రామాలకు ఈ మందు ఒక పెద్ద వరంగా మారనుంది. పైగా ఇది చాలా చవకగా లభిస్తుంది.

55
ప్రాథమిక దశలోనే పరిశోధనలు
Image Credit : Jyoti Singh instagram

ప్రాథమిక దశలోనే పరిశోధనలు

అయితే, ఈ రీసెర్చ్ ఇంకా ల్యాబ్ లెవెల్ లోనే ఉంది. ఎవరైనా పాము కాటుకు గురైతే వెంటనే ఒంటె కన్నీళ్లను తెచ్చి కళ్లలో వేయడం లేదా డైరెక్ట్‌గా తాగించడం లాంటివి చేయకూడదు. ఈ కన్నీళ్ల నుంచి ల్యాబొరేటరీలలో నానోబాడీలను సపరేట్ చేసి, ప్రాసెస్ చేసిన తర్వాతే మందుగా మారుస్తారు. ఇది పూర్తిగా సక్సెస్ అయి మార్కెట్లోకి వస్తే.. రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఒంటెలను పెంచే రైతులకు కూడా ఇదో అదనపు ఆదాయ వనరుగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
విద్య
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational story: ఏ లోపం, శాపం కాదు మిత్ర‌మా.. మ‌నిషి ఆలోచ‌న‌ను మార్చే ప‌గిలిన కుండ క‌థ‌
Recommended image2
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image3
Train: రైలు ఇంజన్ అద్దానికి ఇనుప జాలిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఆలోచించారా.?
Related Stories
Recommended image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Recommended image2
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved