MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • WhatsApp : వాట్సాప్ వాడుతున్నారా? జాగ్రత్త.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్! వెంటనే ఇలా చేయండి

WhatsApp : వాట్సాప్ వాడుతున్నారా? జాగ్రత్త.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్! వెంటనే ఇలా చేయండి

WhatsApp : వాట్సాప్‌లో ప్రమాదకరమైన సెక్యూరిటీ లోపాలను మెటా గుర్తించింది. హ్యాకర్ల బారి నుంచి మీ ఫోన్, డేటాను కాపాడుకోవడానికి వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తూ పలు హెచ్చరికలు చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2026, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వాట్సాప్ యూజర్లకు హై అలర్ట్
Image Credit : Gemini AI

వాట్సాప్ యూజర్లకు హై అలర్ట్

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఒక ముఖ్యమైన సెక్యూరిటీ అలర్ట్‌ను జారీ చేసింది. వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా, యాప్‌లో రెండు తీవ్రమైన బగ్స్ ఉన్నట్లు గుర్తించింది. ఈ లోపాల వల్ల యూజర్ల వ్యక్తిగత డేటా, స్మార్ట్‌ఫోన్‌లు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వాట్సాప్ భద్రతా లోపాలు ఏమిటి?
Image Credit : Getty

వాట్సాప్ భద్రతా లోపాలు ఏమిటి?

మెటా వెల్లడించిన వివరాల ప్రకారం, వాట్సాప్‌లో రెండు రకాల లోపాలు గుర్తించారు. ఇవి విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

1. విండోస్ యూజర్లకు ముప్పు: విండోస్ వెర్షన్ వాట్సాప్ లో 'అటాచ్‌మెంట్ స్పూఫింగ్' అనే బగ్ ను గుర్తించారు. అంటే, హ్యాకర్లు పంపే ఒక ప్రమాదకరమైన ఫైల్ చూడటానికి మామూలు డాక్యుమెంట్‌లాగే కనిపిస్తుంది. కానీ యూజర్ దానిని క్లిక్ చేయగానే, అది ఒక ప్రోగ్రామ్‌లా రన్ అయ్యి ఫోన్ లేదా కంప్యూటర్‌ను డ్యామేజ్ చేస్తుంది.

2. ఆండ్రాయిడ్ & ఐఓఎస్ యూజర్లకు ముప్పు: రెండో బగ్ మీడియా మెసేజ్‌లకు సంబంధించింది. హ్యాకర్లు దీని ద్వారా ఫోన్‌లోకి బయటి కంటెంట్‌ను లోడ్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫోన్ సిస్టమ్ హ్యాక్ అవ్వడమే కాకుండా, మీ ప్రైవేట్ డేటా కూడా చోరీకి గురయ్యే ఛాన్స్ ఉంది.

Related Articles

Related image1
iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో వస్తోంది.. కెమెరా అదిరిపోద్ది, ఫీచర్లు మామూలుగా లేవుగా!
Related image2
Credit Card : క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోకపోతే భారీ నష్టమే!
34
ఈ బగ్స్ పై మెటా ఏం చెప్పింది?
Image Credit : Getty

ఈ బగ్స్ పై మెటా ఏం చెప్పింది?

మెటా తన 'బగ్ బౌంటీ' ప్రోగ్రామ్ ద్వారా ఈ రెండు లోపాలను గుర్తించింది. ఈ లోపాలను కంపెనీ మీడియం కేటగిరీ రిస్క్ కింద పేర్కొంది. ప్రస్తుతానికి ఈ లోపాలను అడ్డం పెట్టుకుని ఎవరైనా హ్యాకింగ్‌కు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని మెటా స్పష్టం చేసింది. యూజర్ల భద్రత కోసం ఇప్పటికే వీటికి సంబంధించిన అప్‌డేట్ ను రిలీజ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

44
మీరు వెంటనే చేయాల్సిన పనులు ఏమిటి?
Image Credit : Getty

మీరు వెంటనే చేయాల్సిన పనులు ఏమిటి?

మీ ఫోన్, మీ డేటా సేఫ్‌గా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి..

• వెంటనే అప్‌డేట్ చేయండి: మీ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.

• తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దు: మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద అటాచ్‌మెంట్స్ లేదా ఫైల్స్‌ను ఓపెన్ చేయకండి. లింక్స్ ను క్లిక్ చేయకండి.

• జాగ్రత్తగా ఉండండి: ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసే ముందు అది నమ్మకమైనదేనా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి.

ప్రస్తుత డిజిటల్ కాలంలో హ్యాకర్ల నుంచి తప్పించుకోవాలంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఒక్కటే మార్గం. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ వాట్సాప్‌ను ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest 5G Plan : రూ.200 లోపే 5G డేటా.. జియో, ఎయిర్‌టెల్, Viలో చౌక రీఛార్జ్ ప్లాన్ ఎవరిది?
Recommended image2
Best Smartphones Under 20K : రూ.20 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు.. గేమర్స్, క్రియేటర్స్ కోసం టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే !
Recommended image3
Telegram Banned: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్‌తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది?
Related Stories
Recommended image1
iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో వస్తోంది.. కెమెరా అదిరిపోద్ది, ఫీచర్లు మామూలుగా లేవుగా!
Recommended image2
Credit Card : క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోకపోతే భారీ నష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved