MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Goa Trip: బాలీవుడ్ సినిమాల్లో చూసే ఆ అందమైన లొకేషన్లు గోవాలో ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Goa Trip: బాలీవుడ్ సినిమాల్లో చూసే ఆ అందమైన లొకేషన్లు గోవాలో ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Top 5 Places to Visit in Goa : గోవా వెళ్తున్నారా? అయితే బటర్ ఫ్లై బీచ్ నుంచి అంజునా మార్కెట్ వరకు మీరు అస్సలు మిస్ చేయకూడని 5 బెస్ట్ ప్లేసెస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2026, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గోవా వెళ్తున్నారా? ఈ 5 ప్లేసెస్ చూడకపోతే మీ ట్రిప్ వేస్టే గురూ!
Image Credit : Gemini

గోవా వెళ్తున్నారా? ఈ 5 ప్లేసెస్ చూడకపోతే మీ ట్రిప్ వేస్టే గురూ!

ఇండియాలో చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ అంటే అది గోవా అనే చెప్పాలి. మన బాలీవుడ్ సినిమాలు కూడా గోవాలోని అందమైన బీచ్‌లను, పోర్చుగీస్ కాలం నాటి కట్టడాలను చాలా గ్రాండ్‌గా చూపించాయి. అందుకే అందరికీ గోవా వెళ్లాలని ఒక కోరిక ఉంటుంది. మీరు సినిమా ప్రేమికులైనా, అడ్వెంచర్ ఇష్టపడే వారైనా, షాపింగ్ ప్రియులైనా లేదా ఫుడ్డీస్ అయినా.. గోవాలో అందరికీ నచ్చే ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది. అద్భుతమైన సీఫుడ్, బీచ్‌లతో పాటు అక్కడి సంస్కృతి మిమ్మల్ని ఫిదా చేస్తుంది. మరి ఈ ట్రిప్‌లో మీరు అస్సలు మిస్ చేయకూడదు టాప్ 5 ప్లేసెస్ ఏంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. బటర్ ఫ్లై బీచ్: ప్రేమికుల కోసం ఒక సీక్రెట్ ఐలాండ్
Image Credit : our own

1. బటర్ ఫ్లై బీచ్: ప్రేమికుల కోసం ఒక సీక్రెట్ ఐలాండ్

గోవాలో చాలా మందికి తెలియని, చాలా ప్రశాంతంగా ఉండే బీచ్ ఏదైనా ఉందంటే అది బటర్ ఫ్లై బీచ్. దీనిని 'హనీమూన్ బీచ్' అని కూడా పిలుస్తారు. దట్టమైన అడవుల మధ్య ఉండే ఈ బీచ్, ప్రైవసీ కోరుకునే జంటలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ బీచ్ ఆకారం సీతాకోకచిలుకలా ఉండటం, చుట్టుపక్కల చెట్లపై రంగురంగుల సీతాకోకచిలుకలు కనిపిస్తూ ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. పాతకాలపు ప్రశాంతమైన బీచ్‌లను ఇష్టపడే వారు ఇక్కడికి వెళ్తే ఆ వైబ్ వేరే లెవల్‌లో ఉంటుంది.

36
2. ఫాంటైన్హాస్, సావో టోమ్: కలర్‌ఫుల్ ఫొటోల కోసం..
Image Credit : @trdessai/X

2. ఫాంటైన్హాస్, సావో టోమ్: కలర్‌ఫుల్ ఫొటోల కోసం..

మీరు ఇన్‌స్టాగ్రామ్ కోసం క్రేజీ ఫొటోలు దిగాలనుకుంటే పనాజీలోని ఫాంటైన్హాస్ ఏరియాకు వెళ్లాల్సిందే. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ప్రాంతం ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడి ఇళ్లు పోర్చుగీస్ స్టైల్‌లో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. మనం చాలా సినిమాల్లో, పాటల్లో చూసే అందమైన వీధులు ఇవే. ఆ రంగు రంగుల బిల్డింగ్‌ల మధ్య నడుస్తుంటే మనం ఏదో యూరప్ దేశంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది.

46
3. చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్
Image Credit : Getty

3. చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్

పనాజీ మధ్యలో ఉండే ఈ చర్చి గోవాలోనే అత్యంత పాతది.. చాలా ఫేమస్. తెల్లటి రంగులో మెరిసిపోయే ఈ చర్చిని 1541లో నిర్మించారు. ఇక్కడ గోవాలోనే రెండో అతిపెద్ద గంట ఉంటుంది. కొండ పైన ఉండే ఈ చర్చికి వెళ్లడానికి రెండు వైపులా మెట్లు ఉంటాయి. ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఇక్కడ జరిగే ఫెస్టివల్ చూడటానికి టూరిస్ట్లు భారీగా వస్తుంటారు.

56
4. డోనా పౌలా: ఒక విషాద ప్రేమ గాథకు నిదర్శనం
Image Credit : Getty

4. డోనా పౌలా: ఒక విషాద ప్రేమ గాథకు నిదర్శనం

డోనా పౌలా బీచ్‌ను 'లవర్స్ ప్యారడైజ్' అని పిలుస్తారు. ఇక్కడ ఉండే జెట్టీ నుంచి అరేబియా సముద్రం అందాలను చూడటం ఒక మధురమైన అనుభవం. ఈ ప్రదేశానికి ఆ పేరు వెనుక ఒక విషాద లవ్ స్టోరీ ఉంది. అప్పటి వైస్రాయ్ కూతురు డోనా పౌలా, ఒక స్థానికంగా చేపలు పట్టే అతన్ని ప్రేమించింది. కానీ వారి పెళ్లికి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆమె కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె జ్ఞాపకార్థమే దీనికి ఆ పేరు పెట్టారు. ఇక్కడ 'ఇమేజ్ ఆఫ్ ఇండియా' అనే స్టాచ్యూ కూడా మస్తు ఉంటుంది.

66
5. అంజునా ఫ్లీ మార్కెట్: షాపింగ్ ప్రియులకు పండగే
Image Credit : Gemini AI

5. అంజునా ఫ్లీ మార్కెట్: షాపింగ్ ప్రియులకు పండగే

షాపింగ్ అంటే ఇష్టమా? అయితే అంజునా ఫ్లీ మార్కెట్‌కు వెళ్లాల్సిందే. దీనిని 'క్వీన్ ఆఫ్ హిప్పీ ఫ్లీ మార్కెట్స్' అంటారు. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్, స్టైలిష్ బట్టలు, గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. షాపింగ్‌తో పాటు లైవ్ మ్యూజిక్, బ్యాండ్ పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ పక్కనే ఉండే షాక్స్‌లో అదిరిపోయే సీఫుడ్ తింటూ చిల్ అవ్వొచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి నాడు కచ్చితంగా చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే!
Recommended image2
Wrinkles: వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు వస్తున్నాయా? ఇలా చేస్తే ముడతలు మాయం
Recommended image3
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Related Stories
Recommended image1
Goa Trip: గోవాలో తప్పక చూడాల్సిన బీచ్ ఇది.. కలంగుట్ బీచ్ ఎందుకు అంత స్పెషల్ !
Recommended image2
Celebrity Restaurants : గోవా వెళ్తున్నారా? విరాట్ కోహ్లీ నుంచి శిల్పా శెట్టి వరకు.. సెలబ్రిటీల టాప్ 6 రెస్టారెంట్లు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved