8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగుల జీతం 100 కాదు 157 శాతం పెరుగుతుందా?
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్… 8వ వేతన సంఘం సిపార్సులతో భారీగా జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. 100 కాదు 157 శాతం సాలరీ పెంపు ఉంటుందట…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (పే కమీషన్) ఏర్పాటయ్యింది. 8వ పే కమీషన్ ఏర్పాటుకు ఈ ఏడాది ఆరంభంలోనే ఆమోదం తెలిపినా కమీషన్ సభ్యులను నియమించేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రంజన్ దేశాయ్ ఛైర్మన్ గా, పార్ట్ టైమ్ మెంబర్ గా ప్రొఫెసర్ పులక్ ఘోష్, సెక్రటరీగా పంకజ్ జైన్ లతో పే కమీషన్ ను నియమించింది ప్రభుత్వం.
అయితే 8వ పే కమీషన్ తో పాటే ToR (Terms of Reference) ను కూడా ప్రకటించింది. దీనితో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 70 లక్షల మంది పెన్షనర్లకు జీతాల పెంపు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
2027లోనే జీతాల పెంపు
ఇప్పటివరకు ప్రతి వేతనసంఘం నివేదికను సమర్పించేందుకు దాదాపు ఏడాదిన్నర రెండేళ్ల సమయం తీసుకుంటుంది. ఇలా 8వ పే కమీషన్ 18 నెలల్లో తుది నివేదిక సమర్పించే అవకాశాముందని అంచనా... అంటే 2027 నాటికి కొత్త జీతాల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
అవసరమైతే ఈ పే కమీషన్ మధ్యంతర నివేదిక కూడా విడుదల చేయవచ్చు. దేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక భారం, ప్రభుత్వ-ప్రైవేట్ ఉద్యోగుల జీతాల వ్యత్యాసాన్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది.
8వ వేతనసంఘం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను ఎంత నిర్ణయిస్తుంది?
ఉద్యోగుల బేసిక్ వేతన పెంపును నిర్ణయించే ముఖ్యమైన అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్... ఈసారి ఇది 1.8 నుంచి 2.57 వరకు ఉండొచ్చని అంచనా. గత వేతన సంఘం (7th Pay Commission) దీన్ని 2.57 గా నిర్ణయించింది. ఈ 8వ పే కమీషన్ కూడా ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను 1.92 నుండి 2.86 వరకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఎంతుంటే బేసిక్ సాలరీ ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఎంతుంటే బేసిక్ సాలరీ ఎంత పెరుగుతుంది?
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 1.8 అయితే
లెవల్ 1 రూ.18,000 → రూ.32,400
లెవల్ 2 రూ.19,900 → రూ.35,820
లెవల్ 3 రూ.21,700 → రూ.39,060
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 అయితే
లెవల్ 1 రూ.18,000 → రూ.46,260
లెవల్ 2 రూ.19,900 → రూ.51,143
లెవల్ 3 రూ.21,700 → రూ.55,769
అంటే – జీతం 80% నుంచి 157% వరకు పెరిగే అవకాశం ఉంది.
కొత్త వేతన సంఘం కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం (TA)లలో కూడా కొత్త లెక్కింపులు చేస్తుంది. పెన్షన్ మొత్తం పెంచడంతో పాటు, పెన్షన్ లెక్కింపులను సులభతరం చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు
8వ వేతన సంఘం నివేదిక తర్వాత కొత్త పే మ్యాట్రిక్స్ అమల్లోకి వస్తుంది. దీని ద్వారా జీతాల స్థాయిలు, ఇంక్రిమెంట్లు, పదవి ఆధారిత మార్పులు స్పష్టంగా అర్థమవుతాయి. మొత్తంగా 2027లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ జీతాల పెంపు లభిస్తుంది.