MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ ఆయుర్వేద చిట్కాలతో ఆయిలీ స్కిన్ మాయం..!

ఈ ఆయుర్వేద చిట్కాలతో ఆయిలీ స్కిన్ మాయం..!

ఆయిలీ స్కిన్ వల్ల ముఖంపై మొటిమలు అవుతాయి. అలాగే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఎండాకాలంలో కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఫాలో అయితే మీ ముఖంపై జిడ్డు తగ్గుతుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 04 2023, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
oily skin

oily skin

మన చర్మంలోంచి సెబమ్ అనే మైనపు పదార్థం రిలీజ్ అవుతుంది. ఇవి వివిధ లిపిడ్ల సంక్లిష్ట మిశ్రమంతో తయారవుతుంది. ఇది చర్మం పొడిబారకుండా, చికాకు కలగకుండా చూస్తుంది. అలాగే రంధ్రాల నుంచి డెడ్ స్కిన్ సెల్స్ ను, మురికిని తొలగిస్తుంది కూడా. అయినప్పటికీ.. సెబమ్ ఎక్కువగా రిలీజ్ అయితే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే చర్మం జిడ్డుగా మారుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

యుక్తవయస్సు, జన్యుపరంగా, కాలుష్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెద్ద పెద్ద చర్మ రంధ్రాలు, పేలవమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు జిడ్డు చర్మానికి దారితీస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో జిడ్డు చర్మాన్ని వదిలించుకోవచ్చు. అవేంటంటే.. 

35
aloe vera gel

aloe vera gel

కలబంద

కలబందలో ఆస్ట్రిజెంట్, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి రంధ్రాలను కుదిస్తాయి. దీంతో చర్మం నుంచి నూనె ఉత్పత్తి తగ్గుతుంది. ఫేస్ వాష్ ను ఉపయోగించి మీ ముఖాన్ని బాగా కడగండి. అలాగే రాత్రి పడుకునే ముందు తాజా కలబంద జెల్ ను పెట్టండి. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేయండి.
 

45
green tea

green tea

గ్రీన్ టీ

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడానికి, సెబమ్ ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా ఒక కప్పు గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగులను తిరిగి ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం వీటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టండి. ముఖాన్ని శుభ్రంగా కడిగి చల్లని టీ బ్యాగులను ముఖంపై పెట్టండి. 
 

55
honey

honey

ముడి తేనె

తేనె సహజంగా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే చర్మంపై నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేకాదు దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలయ్యే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఇందుకోసం ముందుగా మీ చేతులను శుభ్రంగా కడగండి. తర్వాత మీ ముఖాన్ని కూడా కడగండి. తర్వాత ముడి తేనెను మీ ముఖానికి అప్లై చేసి 5-7 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
రోజూ ఇదొక్కటి తినండి చాలు.. కాలేయంలో ఉన్న కొవ్వు మొత్తం కొన్ని రోజుల్లో కరిగిపోతుంది
Recommended image2
Ragi Roti: 30 రోజుల పాటు రాత్రిపూట రాగి రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Curd Face Pack: పెరుగు ఫేస్ ప్యాక్ తో మ్యాజిక్.. చర్మం మెరిసిపోతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved