Yoga Empty Stomach: ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదా? కాదా?
Yoga Empty Stomach: మన ఆరోగ్యానికి యోగా చాలా మంచిది. అయితే.. ఖాళీ కడుపుతో చేయాలా? వద్దా? అనేది తెలుసుకోవడం చాలా అవసరం. యోగా చేస్తున్న చాలా మందికి ఈ సందేహం ఉంది. ఇంతకీ ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదా? కాదా ? అనే విషయాలు తెలుసుకుందాం.

క్రమశిక్షణ
యోగా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజూ యోగా సాధన చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో మనస్సు, శరీరం ,ఆత్మను అనుసంధానం చేయవచ్చు. శరీరాన్ని అంతర్గతంగా పునరుజ్జీవింపజేయడానికి , బాహ్య ప్రపంచంలో ఉన్న కఠినమైన పరిస్థితులను తట్టుకుని పోరాడేంత బలంగా చేస్తుంది యోగా. ఇలాంటి యోగాను ఖాళీ కడుపుతో చేసినప్పుడు.. అది శరీరం, మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదా? కాదా? అనేది తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు
యోగా నిపుణులు ప్రకారం తిన్న తర్వాత యోగా చేసినప్పుడు శరీరంపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా కడుపు ఎక్కువగా ఉబ్బుతుంది, దీనివల్ల ఆహారం తిరిగి పైకి వచ్చి అజీర్ణం, గ్యాస్ సమస్య లేదా ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
ప్రతికూల ప్రభావం
తిన్న తర్వాత శరీరంలోని ఎక్కువ శక్తి జీర్ణక్రియకు ఖర్చవుతుంది. అలాంటి పరిస్థితిలో మనం యోగా సాధన చేస్తే.. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు లేదా యోగా ప్రయోజనాలను పొందలేము. దీనికి విరుద్ధంగా శరీరం అలసిపోయి, బరువుగా అనిపించడం ప్రారంభిస్తుంది. ప్రతికూల ప్రభావం పడుతుంది.
అలా చేయడమే మేలు .
తిన్న తరువాత యోగా చేస్తే ఏకాగ్రత తగ్గుతుంది. కానీ ఖాళీ కడుపుతో యోగా చేయడం వల్ల శక్తి అంతా ఆసనాలు, ప్రాణాయామంలో ఉపయోగించబడుతుంది, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, శరీరం తగినంత ఆక్సిజన్‌ను పొందుతుంది.
ఖాళీ కడుపుతో యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
ఖాళీ కడుపుతో యోగా చేయడం వల్ల శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తిన్న తర్వాత శరీరంలో రక్త ప్రసరణ జీర్ణాశయ అవయవాల వైపు పెరుగుతుంది, కానీ, యోగా చేసేటప్పుడు శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, శక్తి అవసరం. అలాంటి పరిస్థితిలో యోగా ప్రభావం తగ్గుతుంది.
యోగా ఎప్పుడు చేయాలి? సరైన సమయం ఏది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వజ్రాసనం తప్ప, ఏ యోగానీ తిన్న వెంటనే చేయకూడదు. తిన్న తర్వాత 5 నుండి 10 నిమిషాల పాటు వజ్రాసనం చేయడం జీర్ణక్రియకు మంచిది. ఇతర యోగాసనాలకు కనీసం 3 నుండి 3.5 గంటల విరామం అవసరం. ఉదాహరణకు మీరు మధ్యాహ్నం 2 గంటలకు తిన్నట్లయితే సాయంత్రం 5 లేదా 5:30కి యోగా చేయడం మంచిది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేయదు.