MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Walking: 20 రోజులపాటు రోజుకు 10 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!

Walking: 20 రోజులపాటు రోజుకు 10 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!

ప్రస్తుతం చాలామంది కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువగా చేస్తున్నారు. దానివల్ల శరీరం కాస్త స్లో అవుతోంది. అయితే కొన్ని చిన్న చిన్న అలవాట్లతో ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. రోజుకు 10 నిమిషాలు నడిస్తే మంచి ఫలితాలు చూడవచ్చంటున్నారు. అవేంటో చూద్దాం 

2 Min read
Author : Kavitha G
Published : Feb 28 2026, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాకింగ్ ప్రయోజనాలు
Image Credit : Getty

వాకింగ్ ప్రయోజనాలు

వాకింగ్.. శరీరానికి మేలు చేసే ఒక సహజ వ్యాయామం. నిపుణుల ప్రకారం 20 రోజులపాటు రోజుకు కేవలం 10 నిమిషాల నడక శరీరంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
గుండె ఆరోగ్యం
Image Credit : Getty

గుండె ఆరోగ్యం

ప్రతి రోజు 10 నిమిషాలు వేగంగా వాకింగ్ చేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ పెరుగుతుంది. బ్లెడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉంటుంది. నిపుణుల ప్రకారం చిన్న వ్యాయామాలైనా రోజూ చేయడం వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. 20 రోజులపాటు ఇలా క్రమంగా వాకింగ్ చేసినప్పుడు హార్ట్ పేషెంట్‌లలో ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

Related Articles

Related image1
Cumin Saunf Ajwain Water: 11 రోజులపాటు పరగడుపున జీలకర్ర, సోంపు, వాము కలిపిన వాటర్ తాగితే ఏమవుతుంది?
Related image2
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
36
మానసిక ఆరోగ్యం
Image Credit : Getty

మానసిక ఆరోగ్యం

నడక, కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వాకింగ్ చేసేటప్పుడు శరీరం హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. 20 రోజులపాటు క్రమంగా వాకింగ్ చేసే వ్యక్తులలో ఆంగ్జైటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి. నిపుణుల ప్రకారం, ఆరు నిమిషాలు వేగంగా నడిచినా మానసిక స్పష్టత, ఫోకస్ పెరుగుతాయి.

46
మెటబాలిజం పెరుగుదల
Image Credit : Getty

మెటబాలిజం పెరుగుదల

రోజుకు 10 నిమిషాల వాకింగ్, కేలరీలు కరగడానికి సహాయపడుతుంది. 20 రోజులపాటు ఇలా క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే మెటబాలిజం రేటు పెరుగుతుంది. ప్రత్యేకంగా పొట్ట చుట్టూ కొవ్వు ఉన్నవారికి ఈ వాకింగ్ ఉపయుక్తంగా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రీ డయాబెట్స్ లేదా గెస్టెషనల్ డయాబెట్స్ ఉన్నవారికి నడక చాలా మంచిది.

56
రోగనిరోధక శక్తి
Image Credit : Getty

రోగనిరోధక శక్తి

ప్రతిరోజు వేగంగా 10–30 నిమిషాల వాకింగ్ చేయడం శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది, ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది, ఫిట్‌నెస్, శక్తి పెరుగుతాయి. నడక సమయంలో శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది, ఇది శక్తిని పెంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, రక్తప్రసరణ సక్రమంగా జరగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

66
కండరాల బలోపేతానికి..
Image Credit : istockphoto

కండరాల బలోపేతానికి..

ప్రతిరోజు 10–20 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. ముఖ్యంగా కాళ్ల కండరాలు, తొడ భాగం, మోకాలు, పాదాల భాగం, నడుము చుట్టూ ఉన్న కండరాలు క్రమంగా బలపడతాయి. అదేవిధంగా రక్తప్రసరణ పెరగడం వల్ల కండరాలకు ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా అందుతాయి. రోజూ వాకింగ్ చేస్తే శరీర స్థిరత్వం, సమతుల్యత, పోస్చర్ మెరుగుపడతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Orange Benefits: రోజుకో ఆరెంజ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image3
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Related Stories
Recommended image1
Cumin Saunf Ajwain Water: 11 రోజులపాటు పరగడుపున జీలకర్ర, సోంపు, వాము కలిపిన వాటర్ తాగితే ఏమవుతుంది?
Recommended image2
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved