- Home
- Life
- Health
- Heart Health: మహిళల్లో గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. పురుషులతో పోలిస్తే భిన్నమే..
Heart Health: మహిళల్లో గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. పురుషులతో పోలిస్తే భిన్నమే..
Heart Health: స్త్రీలలో గుండె జబ్బులు తరచుగా భిన్నంగా కనిపిస్తాయి, దీనివల్ల ప్రారంభంలోనే గుర్తించడం కష్టం. ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన ప్రారంభ దశ గుండె ఆరోగ్య సమస్యలను సూచించే ఈ కీలకమైన లక్షణాలు తెలుసుకోవాలి.

గుండె సమస్యల లక్షణాలు
చాలాకాలంగా గుండెజబ్బును పురుషుల సమస్యగా భావిస్తున్నారు. కానీ, నిజం ఏమిటంటే, స్త్రీల మరణానికి ప్రధాన కారణం గుండె సమస్యే. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే – పురుషుల కంటే మహిళలు గుండె వ్యాధి సంబంధిత లక్షణాలు భిన్నంగా ఉంటాయి. చాలా సార్లు ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. దీంతో ఇతర సాధారణ సమస్యలుగా పొరబడి, అసలు సమస్యను గుర్తించలేకపోతున్నారు.
అలసట
స్త్రీలలో గుండెజబ్బుల ప్రారంభ లక్షణాల్లో ఒకటి తీవ్ర అలసట. బాగా నిద్రపోయినా కూడా అలసటగా లేచడం లేదా తేలికపాటి పనుల చేయగానే శరీరం తేలిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ అలసట సాధారణం కంటే భిన్నంగా ఉంటుంది, దీర్ఘకాలంగా కొనసాగుతుంది. విశ్రాంతితో తగ్గదు. దీన్ని గుండె సమస్య సంకేతంగా పరిగణించాలి.
ఊపిరి ఆడకపోవడం
సాధారణ కార్యకలాపాల సమయంలో అంటే.. మెట్లు ఎక్కడం, నడవడం లేదా పడుకోవడం వంటి సందర్భాల్లో ఊపిరి ఆడకపోవడం గుండె జబ్బుల ప్రారంభ సంకేతం కావచ్చు. గుండె సమర్థంగా పనిచేయకపోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుందని సూచన. పురుషుల కంటే మహిళల్లోనే గుండె సంబంధిత సమస్యల ప్రారంభ దశలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఛాతీ నొప్పి
స్త్రీలలో గుండెజబ్బుల లక్షణాలు స్పష్టంగా కనిపించవు. చాలా సందర్భాల్లో ఛాతీ నొప్పి, ఒత్తిడి , మంట భావన లాంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అప్పుడప్పుడూ కనిపించినా వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఇవి అలసట, ఊపిరి ఆడకపోవడం, నొప్పి వంటి ఇతర లక్షణాలు కనిపిస్తే, గుండె సంబంధిత హెచ్చరికగా పరిగణించాలి.
మెడ, దవడ లేదా వీపు నొప్పి
ఛాతీలో తీవ్ర అసౌకర్యం గుండె సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా దవడ, మెడ, పైవీపు దగ్గర తీవ్రమైన నొప్పి. దీని కండరాల నొప్పిగా భావించినా తరువాత తీవ్ర సమస్యగా మారవచ్చు. ఇటువంటి నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా, తక్షణమే వైద్య సలహా తీసుకోవడం అవసరం.
వికారం, తల తేలికగా అనిపించడం
స్పష్టమైన కారణం లేకుండా వికారం, మైకం లేదా మూర్ఛ వంటి లక్షణాలు గుండె సమస్యల ప్రారంభ హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇవి చెమట లేదా ఛాతీ నొప్పితో పాటు యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే.. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో తక్షణ వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.
క్రమరహిత హృదయ స్పందన
అప్పుడప్పుడు హృదయ స్పందన రేటు పెరగడం సాధారణమే. కానీ, విశ్రాంతి సమయంలోనే పల్స్ రేటు అధికంగా ఉండటం ఆందోళనకరమైన అంశం. స్త్రీలు పెరిమెనోపాజ్ దశలో ఇలా అనుభవించవచ్చు, కానీ, ఇది సాధారణంగా అనిపించకపోతే లేదా ఇతర లక్షణాలు కూడా ఉంటే, తప్పకుండా వైద్య పరీక్ష చేయించుకోవాలి.