పీరియడ్స్ సమయంలో వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
పెరుగు, పులియబెట్టిన ఆహారాలు, కూరగాయలు వంటివి తినాలి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పీరియడ్స్ టైమ్‌లో యోగా, వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం రాకుండా సహాయపడతాయి.
ఓట్స్, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
పీరియడ్స్ సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను పెంచుతాయి.
కొంతమందికి పీరియడ్స్ సమయంలో పాల ఉత్పత్తులు పడవు. ఇవి మలబద్ధకానికి దారితీస్తాయి. కాబట్టి, అలాంటి వారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది.
పీరియడ్స్ సమయంలో ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా, కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినాలి. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది.
Soaked Almonds: రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?
Orange Benefits: రోజుకో ఆరెంజ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!
Dates Benefits: రోజుకు రెండు ఖర్జూరాలు తింటే కలిగే 7 లాభాలు ఇవే!