Drinking Water: మంచి నీళ్లు సరిగా తాగకపోతే ఏమౌతుంది?
మన శరీరానికి సరిపడా నీరు తాగకపోతే.. బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా శరీరంలోని ద్రవాలు సమతుల్యత కోల్పోతాయి.

మంచి నీరు తాగకపోతే...
మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమూ.. నీరు కూడా అంతే ముఖ్యం. మంచినీరు సరిగా తాగకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీటికి మన ఆరోగ్యంలో కీలక పాత్ర ఉంది. అది సరైన మొత్తంలో శరీరానికి అందకపోతే.. తీవ్రమైన ప్రభావాలను చూపిస్తుంది. మరి, నీరు తక్కువగా తాగితే కలిగే నష్టాలేంటో చూద్దాం...
డీహైడ్రేషన్ (Dehydration)...
మనం, మన శరీరానికి సరిపడా నీరు తాగకపోతే.. బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా శరీరంలోని ద్రవాలు సమతుల్యత కోల్పోతాయి. దీని వల్ల తలనొప్పి, అలసట, కళ్లు తిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మెదడు పనితీరు..
నీటి లోపం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. గమనించే సామర్థ్యం, కేంద్రీకరణ శక్తి తగ్గిపోతుంది. సరిగా వాటర్ తాగకపోవడం మనం ఏదైనా విషయాన్ని సరిగా ఆలోచించలేం కూడా. అందుకే.. నీరు తాగడం చాలా ముఖ్యం.
మలబద్ధకం (Constipation)
నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఆహారం సరైన రీతిలో జీర్ణం కాక మలబద్ధకం సమస్య వస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ఈ మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారే. నీరు సరిగా తాగకపోవడం వల్లే ఈ సమస్య రావచ్చు.
చర్మ సమస్యలు
నీటి లోపం వల్ల చర్మం పొడి పోయి, ముడతలు, ఆరోగ్యవంతమైన మెరుగు తగ్గిపోతాయి.
మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు
నీళ్లు తక్కువగా తాగడం వల్ల మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలకు హాని కలగొచ్చు. మీ మూత్రం రంగు కూడా మారుతుంది.
శక్తి లోపం
నీటి లోపం శక్తినివ్వకపోవడంతో రోజువారీ పనుల్లో అలసట ఎక్కువగా అనిపిస్తుంది.
రోజుకి ఎంత నీరు తాగాలి..?
ప్రతిరోజూ పురుషులు కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. ఇక మహిళలు అయితే.. కనీసం రోజుకి 3 లీటర్ల నీరు తాగాలి. వేసవిలో అయితే.. ఇంకాస్త ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇక.. పిల్లల విషయానికి వస్తే... నెలల పిల్లలకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. కాస్త పెద్ద పిల్లలకు.. వారి వయసుకు తగినట్లు నీరు తాగించాలి.