Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా? ఈ చిట్కాలు పాటించండి చాలు..
Weight Loss: ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా బరువు తగ్గకపోతే.. వారు ఈ చిట్కాలు పాటిస్తే.. బరువు తగ్గుతారు.

ఆహారపు అలవాట్లు
సరైన సమయానికి భోజనం: చాలా మంది ఆకలి లేకున్నా తింటారు. బోర్ కొట్టినప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, లేదా స్నేహితులతో ఉన్నప్పుడు అతిగా తింటారు. అలా చేయడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. ఈ సమస్యకు పరిష్కరం ఒక్కటే.. సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం.
పోషక ఆహారం
సాధ్యమైనంతవరకు సహజమైన, పోషకాహారం తినండి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, మాంసం, గుడ్లు వంటివి ఆహారాన్ని మీ డైట్ లో భాగం చేసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్లు, అధిక నూనె పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి నాన్ హెల్తీ ఫుడ్ కు వీలైనంత వరకు దూరంగా ఉండండి. వీటిలో కేలరీలు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి.
తగినంత నీరు
నీరు శరీరానికి చాలా అవసరం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగడం మంచిది. కొన్నిసార్లు, మనం ఆకలిగా ఉన్నామని భావించినప్పుడు, అది దాహంగా కూడా ఉండవచ్చు. ఒక గ్లాసు నీరు త్రాగి, 15 నిమిషాలు వేచి ఉండండి. ఆకలి తీరకపోతే మాత్రమే తినండి.
వ్యాయామం
వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఆహార అలవాట్లతో పాటు వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, జిమ్‌కి వెళ్లి కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాలు వేగంగా నడవండి. ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది, కేలరీలను బర్న్ చేస్తుంది, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అలాగే.. లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్లు వాడండి. ఇంటి పనులు మీరే చేసుకోండి.
శారీరక శ్రమ
డాన్స్ చేయడం, సైక్లింగ్, ఈత, ఆటలు ఆడటం వంటి మీకు నచ్చిన పనులు చేయండి. వ్యాయామం భారంగా అనిపించకూడదు .ఎక్కువ సేపు కూర్చొని టీవీ చూడటం లేదా కంప్యూటర్‌లో పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి గంటకు ఒకసారి లేచి కొంచెం దూరం నడవండి.
విశ్రాంతి
శరీరానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి, ప్రశాంతత కూడా అంతే అవసరం. ప్రతిరోజూ 7-8 గంటలు గాఢ నిద్ర అవసరం. తక్కువ సేపు నిద్రపోయినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. తగినంత నిద్ర లేనప్పుడు వ్యాయామం చేయడానికి, పోషకమైన ఆహారం తినడానికి కూడా ఆసక్తి ఉండదు.
ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి: ఒత్తిడి శరీర బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం. యోగా, ధ్యానం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, స్నేహితులతో మాట్లాడటం వంటి మీకు నచ్చిన పనులు చేసి ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీరు ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకుంటారు.